రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

Krishna - Vijayanirmala


ప్రథమంగా సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మలల ప్రేమవివాహాన్ని ప్రస్తావించుకోవాలి. 1967 సంవత్సరంలో బాపు దర్శకత్వంలో విడుదలైన 'సాక్షి' చిత్రంలో వీరిరువురు కలిసి నటించారు. ఆ చిత్ర కథను అనుసరించి వారిరువురి వివాహం ఓ దేవాలయంలో జరుగుతుంది. దీనిని గమనించిన హాస్యనటుడు రాజబాబు ఈ గుడిలో సినిమా పెళ్లి చేసుకున్నప్పటికీ నిజజీవితంలో దంపతులు అవుతారని సెలవిచ్చారు.

రాజబాబు మాట ప్రభావమో లేక దేవాలయ మహత్మ్యమో తెలియదు కాని కృష్ణ, విజయనిర్మలలు కొద్ది కాలానికే వివాహం చేసుకున్నారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో నూతన అధ్యాయాలకు శ్రీకారం చుడుతూ వైవిధ్యభరితమైన సినిమాలతో నటశేఖర కృష్ణ స్టార్‌డమ్‌కు చేరుకోగా, అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా విజయనిర్మల గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్నారు.