కార్తీక బ్రహ్మోత్సవాలు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 13 నుంచి 22 వరకూ జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం ఉదయం తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉత్సవాల వాల్ పోస్టర్ ను టిటిడి పాలకమండలి చైర్మన్ డి.కె. ఆదికేశవులు నాయుడు, టిటిడి కార్యనిర్వహణాధికారి ఐవైఆర్ కృష్ణారావు విడుదల చేశారు. అనంతరం వారిద్దరూ అమ్మవారి ఆలయ లోపల ఉన్న అయన మహల్ ను తనిఖీ చేశారు.
అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నవంబర్ 13న ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 17న గజవాహన సేవ ఉంటుంది. 20వ తేదీన రథోత్సవం, 21న పంచమీతీర్థం, 22న పుష్పయాగం నిర్వహిస్తామని టిటిడి చైర్మన్, కార్యనిర్వహణాధికారి తెలిపారు. వాల్ పోస్టర్ విడుదల కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ శ్రీమతి సరస్వతి, నారాయణశెట్టి, ఆలయ పూజారులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
Labels:
హరే శ్రీనివాసా