రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

వెరైటీ వెజ్ ఫ్రైడ్‌రైస్

కావలసిన పదార్థాలు :
బీన్స్,క్యారెట్, ఉల్లికాడల తరుగు.. ఒక్కోటి అర కప్పు చొప్పున
బాస్మతి రైస్.. రెండు కప్పులు
వెనిగర్.. నాలుగు టీ.
సోయాసాస్.. 2 టీ.
ఉప్పు.. తగినంత

తయారీ విధానం :
బాస్మతి రైస్‌కు నాలుగు టీస్పూన్ల నూనెను కలిపి.. నాలుగు కప్పుల నీటితో ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బాణలి వేడయ్యాక నూనెను పోసి అందులో బీన్స్, క్యారెట్, ఉల్లికాడల తరుగులను చేర్చి, ఉడికించిన రైస్‌ను కలుపుకుని బాగా వేయించాలి. ఇందులో వెనిగర్ సోయాసాస్, ఉప్పు చేర్చాలి. కొద్ది సేపటి తరువాత రైస్ ముద్దలా అవకుండా చూసుకుని దించేయాలి. అంతే వెరైటీ వెజ్ ఫ్రైడ్‌రైస్ రెడీ. దీనికి పెరుగు చట్నీలేదా వెజిటబుల్ కుర్మాను సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు.