రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

క్యాబేజి రైస్

కావలసిన పదార్థాలు :
క్యాబేజీ తురుము - 1 కప్పు
బియ్యం - 1 కప్పు
నీళ్ళు - 2 కప్స్
ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు
కరివేపాకు - 4 రెమ్మలు
ఆవాలు - అర టీ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడ
పచ్చిసెనగపప్పు - టీస్పూన్
నువ్వులు - అర టీ స్పూన్
ధనియాలు - అర టీ స్పూన్
కొబ్బరి తురుము - టీ స్పూన్
ఎండు మిర్చి - 4
నూనె తగినంత

తయారు చేయు విధానం : క్యాబేజీని సన్నగా తరిగి పొడి పొడిగా ఉండేలా ఉడికించుకోవాలి. తర్వాత అన్నం కూడా వండి ఆరబెట్టు కోవాలి. బాణలిలో ధనియాలు, పచ్చిసెనగపప్పు, నువ్వులు, ఎండుమిర్చి, కరివేపాకు, కొబ్బరి తురుము దోరగా వేయించి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మరలా బాణలిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, మిక్సీ వేసిన పొడిని, ఉడకబెట్టుకున్న క్యాబేజీతో పాటు ఉల్లి ముక్కులు వేసి పది నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత దీన్ని ఆరబెట్టుకున్న అన్నంలో కలిపుకోవాలి. పుదీనా ఆకులతో అలంకరించుని వేడి విడిగా ఆరగిస్తే ఎంతో కమ్మగా ఉంటుంది.