రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

ఉరుకుల పరుగుల జీవితంలో


ఓ వైపు కింద పరవళ్లు తొక్కుతూ ప్రవహించే నదీ ప్రవాహం.. పైన తాళ్లతో వేలాడే చెక్క వంతెన... అడుగులో అడుగు వేసుకుంటూ ఆ వంతెనపై నడుస్తూ నదిని దాటాలంటే ఎవరికైనా గట్స్ ఉండాల్సిందే..! మరోవైపు పెద్ద లోయ.. కిందికి చూస్తే ప్రాణాలు పైపైనే పోతాయన్న భయం.. అలాంటి చోటుకి కొండ పైనుంచి కిందికి తాళ్లతో జారుకుంటూ పోతే... తలచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ...? అలాగే.. గలగలా పారే నదిలో రయ్‌మంటూ దూసుకెళ్లే మరపడవ.. ఆ పడవలో మీరు భలే ఉంటుంది కదా..! ఇలాంటి సాహసాలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ పలు ప్యాకేజీలను నిర్వహిస్తోంది.

సాహసాలు అనేవి మనసుకు థ్రిల్లింగ్‌ను కలిగిస్తాయి. అవి శరీరానికి మంచి వ్యాయామం కూడా.. ఉరుకుల పరుగుల జీవితంలో విసుగెత్తిపోయేవారు ఇలాంటి ప్రదేశాల్లో ఒక రోజంతా సేదతీరవచ్చు. ఇందుకోసం ఏపీ పర్యాటక శాఖ అనేక రకాల పర్యాటక ప్రదేశాలను ఎంపిక చేసి.. అక్కడ అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది. సుదూర ప్రాంతాలతోపాటు హైదరాబాద్ నగరానికి సమీపంలోగల కీసర గుట్టవద్ద ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ లాంటివి నిర్వహిస్తోంది.హార్స్‌లీ హిల్స్‌లో ట్రెక్కింగ్..!
హార్స్‌లీ హిల్స్... రాక్‌ క్లైంబింగ్‌, ట్రెక్కింగ్‌ చేసే వారికి ఎంతో అనువైన ప్రదేశం. ఇక్కడ రోప్‌వే సౌకర్యం కూడా ఉంది. ప్రకృతి సోయగాల మధ్య.. చల్లటి పిల్ల గాలులు శరీరాన్ని అలా తాకుతూ వెళుతుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఈ ప్రాంతానికి కూడా పర్యాటక..

ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, రివర్ క్రాసింగ్, బోట్ రైడింగ్ తదితర సాహసాలకు ఎక్కడో విదేశాలకు లేదా పక్క రాష్ట్రాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలోనే ఇలాంటి పర్యాటక ప్రదేశాలు బోలెడన్ని ఉన్నాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం, యాదగిరి గుట్ట, భద్రాచలం, కుప్పం, బాసర, హార్స్‌లీ హిల్స్ తదితర ప్రాంతాలు.. అలాంటి వాటిలో కొన్ని. ఈ ప్రాంతాల్లో పర్యాటక శాఖ అన్ని అవకాశలను కల్పించటంతోపాటు.. పగలు, రాత్రి వేళల్లో అక్కడే ఉండి గడిపే విధంగా కూడా ప్యాకేజీలను రూపొందించిది. ఇక.. వసతి, భోజన సౌకర్యాలు కూడా ఆ శాఖే చూస్తుంది కాబట్టి.. దిగులేమీ ఉండదు.

ఆ ప్యాకేజీలేంటో ఇప్పుడు చూద్దామా...?!

కీసర గుట్ట...
హైదరాబాద్‌కు సమీపంలో ఉంది. ఇక్కడ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాక్‌ క్లైంబింగ్‌ నిర్వహిస్తున్నారు. గ్రూపుల వారీగా వెళ్లిన వారికి ప్రత్యేక రాయితీలు ఉంటాయి కూడా. అయితే రవాణా సౌకర్యాలను మాత్రం పర్యాటకులే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లైంబింగ్‌కు మాత్రం గ్రూపును బట్టి కొంత రుసుమును వసూలు చేస్తుంటారు.

నాగార్జున సాగర్...
ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల నాగార్జున సాగర్..! ఇక్కడి కృష్ణానదిలో బోట్‌ రైడింగ్‌ ఎంతో థ్రిల్లింగ్‌ కలిగిస్తుంది. హైదరాబాద్‌ నుంచి వసతి, భోజనం, రవాణా తదితర సౌకర్యాలతో పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలను కల్పిస్తోంది. అలా కాకుండా ఎవరికివారు వారి సొంత ఖర్చులతో, ప్రైవేటు వాహనాలతో కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు.

హర్స్‌లీ హిల్స్...
మదనపల్లికి సమీపంలో ఈ కొండలు ఉన్నాయి. రాక్‌ క్లైంబింగ్‌, ట్రెక్కింగ్‌ చేసే వారికి ఇది ఎంతో అనువైన ప్రదేశం. ఇక్కడ రోప్‌వే సౌకర్యం కూడా ఉంది. ప్రకృతి సోయగాల మధ్య.. చల్లటి పిల్ల గాలులు శరీరాన్ని అలా తాకుతూ వెళుతుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఈ ప్రాంతానికి కూడా పర్యాటక శాఖ అన్ని రకాల సౌకర్యాలతో ప్యాకేజీలను అందిస్తోంది.

శ్రీశైలం...
ట్రెక్కర్లకు ఇదో స్వర్గధామం. మల్లిఖార్జునస్వామి కొలువైన ఈ ప్రాంతంలోని నల్లమల అటవీ అందాలు కనువిందు చేస్తుంటాయి. ఈ అడవుల్లోని జలపాతాలు మరో అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు. రవాణా, లాడ్జింగ్, బోడ్జింగ్ తదితర అన్ని రకాల సౌకర్యాలతో ఏపీ టూరిజం శాఖ ప్యాకేజీలను కల్పిస్తోంది.

భద్రాచలం...
పరవళ్లు తొక్కే గోదావరి ఒడ్డున కొలువైన ప్రదేశం భద్రాచలం. సీతారాములు కొలువైన ఈఆధ్యాత్మిక ప్రదేశంలో రాక్‌ క్లైంబింగ్‌కు అనువైన కొండలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడికి కూడా టూరిజంశాఖ అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచుతోంది.

యాదగిరిగుట్ట...
లక్ష్మీ నరసింహస్వామి కొలువైన ప్రదేశం ఇది. ఇక్కడి ఎత్తైన కొండపైకి రాక్‌ క్లైబ్లింగ్‌ చేస్తే ఆ అనుభూతే వేరు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న ఈ క్షేత్రానికి ఉదయం వెళితే సాయంత్రానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడికి ప్రైవేటు వాహనాలలో, సొంత ఖర్చులతోనూ వెళ్లవచ్చు లేదా.. టూరిజం శాఖ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది.

డిసెంబర్‌ 31న శ్రీవారి ఆలయం మూసివేత

చంద్రగ్రహణం కారణంగా వచ్చే డిసెంబర్‌లో శ్రీవారి స్వామి వారి ఆలయాన్ని మూసివేయనున్నారు. డిసెంబరు 31 రాత్రి ఏడు గంటలకు మూసివేసి జనవరి 1న ఉదయం తెరుస్తారు.
స్వామి వారికి మూడు కిలోల బంగారం విరాళం :
హైదరాబాద్‌కు చెందిన బీవీ రామారావు రెండు కిలోలు, రామిరెడ్డి శ్రీనివాసులురెడ్డి కిలో వంతున మొత్తం మూడు కిలోల బంగారం విరాళంగా అందించినట్లు దేవస్థానం ఛైర్మన్‌ డి.కె.ఆదికేశవులు నాయుడు వెల్లడించారు.

ప్రత్యక్ష దైవానికి మరో విడిది "ద్వారకా తిరుమల"


నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో... తిరుమల శిఖరాలు దిగివచ్చునో... మముగన్న మాయమ్మ అలివేలు మంగ.. పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ.. స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ..." అంటూ భక్త జనావళి స్వామివారి కరుణ తమమీద ఉండేలా చూడాలని అమ్మవారికి విన్నవించుకోవటం మామూలే..! అయితే ఈ అయ్యవారిని ఏడుకొండలూ ఎక్కి చూడలేకపోతేనేం.. స్వయంభువుగా ప్రత్యక్షమైన చిన్న తిరుపతి అయ్యవారి కరుణ తమమీద ఉంటే చాలదా అన్నట్లుగా పరమ పవిత్రమైన "ద్వారకా తిరుమల"ను పశ్చిమగోదావరి వాసులు దర్శించుకుంటుంటారు.

ఏలూరు పట్టణం నుంచి 42 కిలోమీటర్ల దూరంలోనున్న శేషాద్రి కొండపైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు "ద్వారకా తిరుమల"లో కొలువుదీరి ఉన్నారు. స్వయంభువుగా ప్రత్యక్షమైన స్వామివారిని చీమలపుట్ట నుంచి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ఆలయానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చనట్లు పూర్వీకుల కథనం. సుదర్శన క్షేత్రమైన ఈ ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా కూడా ప్రసిద్ధి చెంది.. అశేష భక్త జనావళి నీరాజనాలు అందుకుంటోంది.

"తిరుమల" స్వామివారికి మ్రొక్కిన మ్రొక్కును "చిన్న తిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే చిన్నతిరుపతిలో తీర్చుకునేందుకు మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని భక్తులు, స్థానికులు ప్రగాడంగా నమ్ముతుంటారు. ఇక్కడ స్వామివారిని కలియుగ వైకుంఠ వాసునిగా భావించి సేవిస్తారు. తిరుపతికి వెళ్ళలేని భక్తులు తమ ముడుపులను, తలనీలాలను, మొక్కుబడులను ఇక్కడ సమర్పిస్తే తిరుపతి స్వామివారికి చెందుతాయని భావిస్తారు.
అజమహారాజు స్వయంవరం..!
బ్రహ్మపురాణం ఆధారంగా, శ్రీరామచంద్రుడి తాతగారు అజమహారాజు తన వివాహం కోసం స్వామివారిని సేవించారు. ఆయన ఇందుమతి స్వయంవరానికి వెళుతూ.. మార్గమధ్యంలో ఉన్న ద్వారకా తిరుమలలో ఆగి స్వామివారిని దర్శించుకోకుండానే వెళ్లిపోయారట. ఇందుమతి అజమహారాజును పెళ్లి...

ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. అయితే ఆ మునికి ప్రత్యక్షమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు దక్షిణాభిముఖుడై ఉన్నాడట. అందుకనే.. ఈ ఆలయంలో మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉండటం విశేషంగా చెప్పవచ్చు. అలాగే ఒకే విమాన శిఖరం క్రింద రెండు విగ్రహాలు ఉండటం ఇక్కడి మరో విశేషం. ఒక విగ్రహం సంపూర్ణమైనదిగా, రెండవది స్వామివారి పై భాగం మాత్రమే కనిపించేటట్లుగా ఉండే అర్థవిగ్రహంగా ఉంటుంది.

స్థల పురాణం ప్రకారం చూస్తే... ద్వారకా తిరుమల క్షేత్రం శ్రీరాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదిగా భావిస్తున్నారు. ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాద సేవను కోరారట. దాంతో స్వామివారి పాదములను మాత్రమే పూజించే భాగ్యం అతడికి దక్కింది. అందుకే మనకు నేడు స్వామివారి పై భాగం మాత్రమే దర్శనమిస్తుంది.

అయితే.. విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారనీ... అప్పుడు భక్తులందరి విన్నపాలను స్వీకరించిన ఆయన స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధృవమూర్తికి వెనుకవైపు పీఠంపై.. వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్టించారని చెబుతుంటారు.

అందుకే.. స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే శ్రీ వేంకటేశ్వర ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ.. ఆ తరువాత ప్రతిష్టింపబడిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్థ కామపురుషార్ధములు సమకూరుతాయనీ భక్తులు నమ్ముతుంటారు.

పురాణ గాథల ప్రకారం ఆలయ చరిత్రను చూసినట్లయితే... బ్రహ్మపురాణం ఆధారంగా, శ్రీరామచంద్రుడి తాతగారు అజమహారాజు తన వివాహం కోసం స్వామివారిని సేవించారు. ఆయన ఇందుమతి స్వయంవరానికి వెళుతూ.. మార్గమధ్యంలో ఉన్న ద్వారకా తిరుమలలో ఆగి స్వామివారిని దర్శించుకోకుండానే వెళ్లిపోయారట. ఇందుమతి అజమహారాజును పెళ్లి చేసుకున్నప్పటికీ.. స్వయంవరానికి వచ్చిన ఇతర రాజులు ఆయనపై దాడి చేస్తారు.

తాను మార్గమధ్యలో స్వామివారిని దర్శించుకోకుండా వెళ్లినందుకే ఇలా జరిగిందని భావించిన అజమహారాజు శ్రీవేంకటేశ్వరుని క్షమించమని ప్రార్థిస్తాడు. అంతటితో ఆ అలజడి ఆగిపోయిందట. అత్యంత ప్రాచీన చరిత్రగల ఈ ఆలయం కృతయుగం నుంచి ఉందనేందుకు ఇదో చక్కని నిదర్శనంగా చెప్పవచ్చు.

ఇక.. ద్వారకా తిరుమలలోని స్వామి వారికి అభిషేకం చేయకపోవటం మరో విశేషంగా చెప్పవచ్చు. ఎందుకంటే.. స్వామివారిపై ఒక చిన్న నీటి బొట్టుపడినా.. అది స్వామివారి విగ్రహం క్రిందనుండే ఎర్రచీమలను కదుల్చుతుందని అభిషేకం చేయరు. గుడి సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ, ఆశ్వయుజ మాసాలలో రెండు కళ్యాణోత్సవాలు జరుపుతుంటారు. ఎందుకంటే.. స్వామివారు స్వయంభువుగా వైశాఖ మాసంలో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజ మాసంలో ప్రతిష్టించిన కారణంగా అలా చేస్తుంటారు.

రవ్వ పులిహోర


చింతపండు లేదా నిమ్మతో చేసే అన్నం పులిహోరకు ప్రత్యామ్నాయమిది
కావలసిన పదార్థాలు: బియ్యంరవ్వ- నాలుగుకప్పులు, చింతపండుగుజ్జు- -పావుకప్పు, నూనె-పావుకప్పు, పసుపు-పావుచెంచా.
తాలింపు కోసం: ఆవాలు - చెంచా, వేరుశెనగపప్పు - పావుకప్పు, పచ్చి శెనగపప్పు, మినపప్పు - రెండు చెంచాల చొప్పున, ఎండుమిర్చి - ఐదారు, కరివేపాకురెబ్బలు - నాలుగు, నిలువుగా తరిగిన పచ్చిమిర్చి-ఐదారు.
తయారీ: ముందుగా వెడల్పాటి పాత్ర తీసుకుని ఎనిమిది కప్పుల నీరుపోసి.. రెండుచెంచాల నూనె, పసుపు వేయండి. మరుగుతున్నప్పుడు బియ్యంపిండిని కలిపి సన్ననిమంటపై ఉడకనివ్వాలి. దీన్ని మరో పాత్రలోకి తీసుకుని ఆరనివ్వండి. బాణలిలో నూనె వేసి.. కరివేపాకు, పచ్చిమిర్చి, చింతపండుగుజ్జు తప్ప.. మిగిలిన పదార్థాలన్నీ వేయించండి. ఇందులో చింతపండు గుజ్జు తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు... వేసి.. ఉడకనివ్వండి. ఈ పులుసును నేరుగా బియ్యంరవ్వలో వేసి కలపాలి. అంతే.. రవ్వపులిహోర రెడీ. మరికాస్త రుచికోసం.. చిటికెడు మెంతపొడి, వేయించిన జీడిపప్పు పలుకులు కూడా చేర్చుకోవచ్చు.

మఖ్‌మల్‌పూరీ


ఏదో ఒక స్వీట్‌ కాకుండా... నట్స్‌తో చేసే వెరైటీ పూరీ ఇది.
కావలసిన పదార్థాలు: మైదా, బాదం, జీడిపప్పు, పిస్తా - కప్పు చొప్పున, పంచదార, బొంబాయిరవ్వ - ఒకటిన్నర కప్పు చొప్పున, యాలకుల పొడి- అరచెంచా, నెయ్యి- రెండుచెంచాలు, నూనె-వేయించేందుకు సరిపడా.
తయారీ: మైదాను నీరు ఆ తర్వాత నెయ్యితో పూరీపిండిలా కలిపి నాననివ్వాలి. బాదం, పిస్తా, జీడిపప్పు ఒక నిమిషం మిక్సీలో తిప్పి... ఆ తర్వాత పంచదార కలిపి.. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా పొడిచేయాలి. దీనికి యాలకులపొడి, వేయించిన బొంబాయిరవ్వ కలపాలి.
ఇప్పుడు మైదాపిండిని మరోసారి కలిపి.. చిన్నచిన్న ఉండల్లా చేయాలి. చేత్తోనే పూరీలా చేసి.. మధ్యలో ముందుగా సిద్ధం చేసిపెట్టుకున్న మిశ్రమాన్ని చెంచా వేసి.. చుట్టూ మూసేయాలి. పూరీ కాస్త మందంగానే వత్తి నూనెలో వేయించి తీయాలి. అంతే..మఖ్‌మల్‌పూరీ సిద్ధం.
చల్లారాక డబ్బాలో వేస్తే.. పదిరోజుల దాకా నిల్వ ఉంటాయివి.

HOW TO STAY YOUNG



1. Throw out nonessential numbers. This includes age, weight and height. Let the doctors worry about them. That is why you pay 'them'

2. Keep only cheerful friends. The grouches pull you down..

3. Keep learning. Learn more about the computer, crafts, gardening, whatever. Never let the brain idle. 'An idle mind is the devil's workshop.' And the devil's name is Alzheimer's.

4. Enjoy the simple things.

5. Laugh often, long and loud. Laugh until you gasp for breath.

6. The tears happen. Endure, grieve, and move on. The only person, who is with us our entire life, is ourselves. Be ALIVE while you are alive.

7. Surround yourself with what you love , whether it's family, pets, keepsakes, music, plants, hobbies, whatever. Your home is your refuge.

8. Cherish your health: If it is good, preserve it.. If it is unstable, improve it. If it is beyond what you can improve, get help.

9. Don't take guilt trips. Take a trip to the mall, even to the next county; to a foreign country but NOT to where the guilt is.

10. Tell the people you love that you love them, at every opportunity.

AND ALWAYS REMEMBER :
Life is not measured by the number of breaths we take, but by the moments that take our breath away.



Worry about nothing, pray about everything!!!

పెళ్ళి చేసుకొనేటప్పుడు...

పెళ్ళి చేసుకొనేటప్పుడు అమ్మాయి వయసు అబ్బాయి వయసు కన్నా తక్కువ ఉండాలంటారు మన పెద్దలు. ఎందుకో తెలుసా?

పెళ్ళి చేసుకొనేటప్పుడు అమ్మాయి వయసు అబ్బాయి వయసు కన్నా తక్కువ ఉండాలంటారు మన పెద్దలు. ఎందుకో తెలుసా?
ఎందుకంటే శృంగార పరంగా చూస్తే, పురుషులలొ కన్నా స్త్రీలలో శృంగార వాంచలు కొంచం ముందుగానే తగ్గిపోతాయి. ఉదాహరణకి ఒక పురుషుడు 60 సంవత్సరముల వరకూ శృంగార వాంచలు కలిగి ఉంటే స్త్రీ 55 సంవత్సరముల వరకూ మాత్రమే శృంగార వాంచలు కలిగి ఉంటారు. ఎందుకంటే వీరిలో పురుళ్ళు, బహిస్టు వంటి ప్రకృతి కార్యక్రమముల వలన వీరి శరీరం, ఎముకలు త్వరగా బలహీనము అవుటాయి. అందుకే పురుషులలొ కన్నా స్త్రీలలో మెనొపాజ్ స్టేజ్ త్వరగా వస్తుంది. పైన చెప్పిన వయస్సులు కేవలం ఉదాహరణకి తీసుకున్నవి మాత్రమే. మనిషిని బట్టీ, వారి వారి ఆరోగ్య విధానాన్ని బట్టి ఈ వయసు ఆధార పడి ఉంటుంది. అందుకే స్త్రీ పురుషుల మధ్య శృంగార సమన్వయం లో పించకుండా పెళ్ళి చేసుకొనేటప్పుడు అమ్మాయి వయసు అబ్బాయి వయసు కన్నా తక్కువ ఉండాలంటారు. నా వివరణ తప్పయితే క్షమించి సరయిన కారణమును తెలియ చేయగలరు.

మామిడి తోరణాలు ఎందుకు?

పెళ్ళిళ్ళకి, శుభకార్యములకు మామిడి తోరణాలు కడతారు. ఎందుకు?

ఎందుకంటే పెళ్ళిళ్ళు, శుభకార్యములు జరిగినపుడు ఆ ప్రదేశంలో ఎక్కువ మంది మనుషులు ఒక చోట చేరుతారు.మనుషులు అందరూ గాలిలో ఉన్న ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డై ఆక్సైడ్ వదులుతుంటారు. కాబట్టి శుభకార్యములు జరిగినప్పుడు గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. అటువంటప్పుడు గాలిలొ ఆక్సిజన్ పెంచడానికి మామిడి తోరణాలు, తాటాకు పందిళ్ళు, అరటి చెట్లతో మండపాలు వంటివి ఏర్పాటు చేస్తారు. ఆకుపచ్చని మొక్కలు అన్ని గాలిలొ ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతుంటాయి. అందుకని పెళ్ళిళ్ళకి, శుభకార్యములకు మామిడి తోరణాలు కడతారు.

నీకెందుకంత గర్వం

మనసా నీకెందుకంత గర్వం
మనిషికి తప్పదా నీతో నిరంతర సమరం

అందమైన ఆశల్ని ఆనందంగా రేపి...
తపించే మనిషిని చూచి వెక్కిరింతల కేరింతలు కొట్టే నీకు తెలియదు సుమా...
ఆ మనిషే ఓడిననాడు కలిగే అపజయాల గాయాలు భరించాల్సింది నీవేనని.

నీకోసం...

నా ప్రతి తలపు నీకోసం...
నా ప్రతి అడుగు నీకోసం...

నాలోని ప్రతిశ్వాస నీకోసం...
నాలోని ప్రతి అణువూ నీకోసం...

నే బ్రతికున్నది నీకోసం...
నే బ్రతుకుతున్నదీ నీకోసం...

నా నీరీక్షణ నీకోసం...
నే పడుతున్న తపన నీకోసం...

కొడిగడుతున్న నా ప్రాణం నిలుచున్నది నీకోసం...
మరణం సైతం నావద్దకు రాకున్నది నీకోసం...
కాదని నీవు నన్ను వదిలేస్తే (నే) మరణిస్తా నీకోసం.

ప్రేముంటేనే జీవితం

ఎప్పుడొచ్చావు నా గుండెలోకి... చప్పుడైనా చేయకుండా...
ఏమి చెప్పావు నా మనసుకి... నాకేమాత్రం తెలియకుండా...

ఏ మంత్రం వేశావు నామదికి... నీవు తప్ప మరో ఆలోచన లేకుండా...
ఏ మాయ చేశావు నాలోని తలపులకి... నిత్యం నీ ధ్యాసే తప్ప మరేదీ రాకుండా...

అన్నీ నువ్వు చేస్తావు... కానీ నా మాట మాత్రం పట్టించుకోనంటావు...
ప్రేమంటే ఆట నీకు... కానీ నీతోటి ప్రేముంటేనే జీవితం నాకు...

ఏ రోజు ఎలాంటి ఆభరణాలు


రత్నాలశాస్త్రం ప్రకారం ప్రతిరోజూ నవగ్రహాలను అనుసరించి ఆభరణాలు ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఇందులో భాగంగా స్త్రీలు బంగారంతో పొదిగించిన ఆభరణాలు లేకపోయినా.. తమ తమ స్థోమతకు తగినట్లు ఫ్యాన్సీగా ప్రస్తుత షాపుల్లో అమ్మబడే ఆభరణాలతో ప్రతిరోజూ అలంకరణ చేసుకోవడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఇక ఏ వారంలో ఎలాంటి ఆభరణాలు ధలించాలో చూద్దాం.. ఆదివారం సూర్యునికి (సూర్యగ్రహానికి ప్రీతికరమైన రోజు) కెంపుల చెవిపోగులు, హారాలు మొదలగునవి వాడటం మంచిది. దీనిద్వారా నేత్ర సంబంధిత రోగాలు, శరీర తేజస్సు, ప్రకాశవంతం పొందవచ్చును.

అలాగే సోమవారం చంద్రుని (చంద్రగ్రహం) కోసం ముత్యాల హారాలు, గాజులను వేసుకోవడం మంచిది. ముత్యాలతో తయారయ్యే గాజులను, చెవిపోగులను వాడటం ద్వారా మనశ్శాంతి, అనుకున్న కార్యములో విజయం చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

మంగళవారం కుజుని (కుజ గ్రహం) కోసం పగడాల దండలు, ఉంగరాలను వాడటం మంచిది. పగడాలతో తయారైన ఉంగరాలను, దండలను వాడటం ద్వారా కుటుంబసంక్షేమం చేకూరటం, ఈతిబాధలు తొలగిపోవడం వంటి ఫలితాలుంటాయి.

అదేవిధంగా.. బుధవారం (బుధుడు) బుధుని కోసం పచ్చల పతకాలు, గాజులు మొదలగునవి వాడటం శ్రేయస్కరం. విద్యాకారకుడైన బుధునికి ప్రీతికరమైన ఈ రోజుల విద్యార్థులు పచ్చని రంగుతో కూడిన ఉంగరాలు, స్త్రీలతే హారాలు వినియోగించడం మంచిది. దీంతో బుద్ధికుశలతలు పెరగడం, ధనలాభం, కార్యసిద్ధి చేకూరుతుంది.

గురువారం బృహస్పతి (గురుభగవానుడు) కోసం పుష్యరాగముతో తయారైన చెవిపోగులు, ఉంగరాలు మొదలగునవి వాడితే గురగ్రహ ప్రభావంతో అవివాహితులకు కళ్యాణం జరగడం, వ్యాపారాభివృద్ధి, కార్యసిద్ధివంటి ఫలితాలుంటాయి.

ఇకపోతే.. శుక్రవారం శుక్రుని (శుక్రగ్రహం) కోసం వజ్రాల హారాలు, ముక్కుపుడక వాడటం ద్వారా స్త్రీలకు సౌభాగ్యం, ఆర్థిక సమస్యలు తొలగిపోవడం, పదోన్నతులు, అనుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి.

అలాగే.. శనివారం (శనిగ్రహం) శనికోసం నీలమణి, మణిహారాలు మొదలగునవి వాడటం మంచిది. దీనిద్వారా శనిగ్రహ ప్రభావంతో తలెత్తే సమస్యలు కొంతవరకు సమసిపోతాయి. నీలమణితో తయారైన హారాలు చెవిపోగులు, ఉంగరాలు ధరించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

తిరుమలేశునికి బంగారు గంగాళం



కలియుగ ప్రత్యక్షదైవం, తిరుమలేశునికి భక్తులు కానుకల వర్షం కురిపిస్తున్నారు. భక్తుల కొంగుబంగారంగా కోరిన వరాలను ప్రసాదించే ఆపదమొక్కులవాడికి సోమవారం రూ. 3కోట్ల విలువైన స్వర్ణ గంగాళం కానుకగా అందింది. ఢిల్లీకి చెందిన ఓ అజ్ఞాత భక్తులు దీన్ని వెంకన్నకు కానుకగా అందజేశారు.

అభిషేకం, తిరుమంజన సేవల్లో దీన్ని ఉపయోగించే దిశగా సుమారు 18 కిలోల బంగారంతో గంగళాన్ని తయారు చేసినట్లు టీటీడీ ఛైర్నన్ డీకే ఆదికేశవులనాయుడు అన్నారు.

ఈ గంగళాన్ని ఆ అజ్ఞాత భక్తుడు ఆదికేశవులనాయుడుకు అందజేస్తూ.. తాను గతంలో అభిషేక సేవలో పాల్గొన్నపుడు స్వామివారి సేవలో వెండి గంగాళాన్ని ఉపయోగించడం చూసి బంగారు గంగాళాన్ని కానుకగా అందించాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.

Friendship



Friendship is not about “I m sorry “ its about “abbe teri galti hai
Friendship is not about “I m there for u “ its about “kahan marr gaya saale
Friendship is not about “Get well soon “ its about “ Itna piyega toh yehi hoga
Friendship is not about “I understand “ its about “sab teri wajah se hua manhus
Friendship is not about “I m happy for ur success “its about “chal party de saale
Friendship is not about “I care for u “ its about “kamino tumhe chhod ke kahan jaunga
Friendship is not about “I love that girl“ its about “saalo izzat se dekho tumhari bhabhi hain
F'ship is not about “All the best for ur career“ its about “ bahut hua, abhi toh switch mar saale

Dear Cherukupalli




A faithful friend is the medicine of life
Happy Birthday

To Balu




HAPPY BIRTHDAY!! ( ENGLISH )
Feliz cumpleaños!! ( SPANISH )
Voeux de bonheur!! ( FRENCH )
FELICE COMPLEANNO!! ( ITALIAN )
С ДНЕМ РОЖДЕНИЯ!! ( RUSSIAN )
GLÜCKLICHER GEBURTSTAG!! ( GERMAN )
Feliz anivérsario!! ( PORTUGUESE )
ŠŤASTNÝ NAROZENINY!! ( CZECH )
GAUISUS NATALIS!! ( LATIN )
‘N DDEDWYDD BEN-BLWYDD!! ( WELSH )
ευτυχισμένα γεννέθλια!! ( GREEK )
mutlu doğum!! ( TURKISH )
Gratulera med dagen!! ( SWEDISH )
Wszystkiego najlepszego z okazji urodzin!! ( POLISH )
Gratulerer med dagen!!! ( NORWEGIAN )
VERHEUGD VERJARING!! ( DUTCH )
ЩАСТЛИВ РОЖДЕНИЕ!! ( BULGARIAN )
SRETAN ROĐENDAN!! ( CROATIAN )
Til lykke med fødselsdagen!! ( DANISH )
Boldog születésnapot!! ( HUNGARIAN )
ILOINEN ALKU!! ( FINNISH )
HAMINGJUSAMUR FÆÐINGARDAGUR!! ( ICELANDIC )
FERICIT ZIUA DE NAŞTERE!! ( ROMANIAN )
Sretan rođendan!! ( SERBIAN )
vesel rojstni dan!! ( SLOVENIAN )