రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

నవరతాన్ కుర్మా


కావలసినవి :
కూరగాయలముక్కలు (క్యారెట్‌, బఠాణీ, బంగాళాదుంప, కాలీఫ్లవర్‌): 2 కప్పులు, ఉల్లిపాయలు: రెండు, అల్లంవెల్లుల్లి: 2 టీస్పూన్లు, పసుపు: అరటీస్పూను, దనియాలపొడి: 2 టీస్పూన్లు, కారం: ఒకటిన్నర టీస్పూన్లు, గరంమసాలా: ఒకటిన్నరటీస్పూన్లు, పాలు: కప్పు, మీగడ: 2 టేబుల్‌స్పూన్లు, నెయ్యి: 3 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, పనీర్‌: 100గ్రా., టొమాటో గుజ్జు: 3 టేబుల్‌స్పూన్లు, డ్రైఫ్రూట్స్‌ (జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌): 4 టేబుల్‌స్పూన్లు, పైనాపిల్‌ముక్కలు: 5 టేబుల్‌స్పూన్లు.
తయారుచేసే విధానం :
ఉల్లిపాయల్ని సన్నగా తురమాలి.
కూరగాయ ముక్కల్ని ఉడికించి ఉంచాలి.
పైనాపిల్‌ ముక్కల్ని కూడా మెత్తగా చేసి ఉంచాలి.
ఓ నాన్‌స్టిక్‌ పాన్‌ తీసుకుని నెయ్యి వేసి చదరపు ముక్కల్లా కోసిన పనీర్‌ను వేసి ఎర్రగా వేయించి పక్కన ఉంచాలి.
అందులోనే ఉల్లిముక్కలు, అల్లంవెల్లుల్లి వేసి తక్కువ మంటమీద వేయించాలి.
తరవాత టొమాటోగుజ్జు, పసుపు, దనియాలపొడి, కారం, గరంమసాలా పొడి, ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసి ఉడికించాలి. అది ఉడికి మంచి వాసన వస్తుండగా ఉడికించిన కూరగాయ ముక్కలు వేసి దగ్గరగా అయ్యేవరకూ ఉడికించాలి.
ఇప్పుడు పాలు, మీగడ వేసి మరో నిమిషం ఉడికించాలి. చివరగాదించేముందు వేయించిన పనీర్‌ ముక్కలు, డ్రైఫ్రూట్స్‌, పైనాపిల్‌ గుజ్జు, కొత్తిమీర వేసి దించాలి.