శ్రీవారి ఆభరణాల విలువ
శ్రీవారి ఆభరణాల విలువ రూ.52 కోట్లు
స్థిరాస్తుల విలువ రూ.32 వేల కోట్లు
పురాతన కాలం నాటి అంచనాలే ప్రామాణికం
తిరుమల, తిరుపతి దేవస్థానం సోమవారం హైకోర్టుకు సీల్డ్ కవర్‌లో సమర్పించిన శ్రీవారి ఆస్తుల వివరాలను మూడు నెలలుగా లెక్కించింది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు.. ప్రస్తుత మార్కెట్ విలువతో కాకుండా పురాతన రికార్డులనే తితిదే ప్రామాణికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. బంగారు ఆభరణాల విలువ 2008 ఏప్రిల్ నాటికి రూ.73 కోట్లుగా తేల్చగా, అందులో శ్రీవారి ఆభరణాల విలువ మాత్రం రూ.52 కోట్లుగా చూపించినట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన బంగారు ఆభరణాల విరాళాలను పరిగణలోకి తీసుకోలేదనీ, వీటి విలువను ఇంకా నిర్ధరించనందు వల్ల లెక్కల్లో చూపలేదని తెలుస్తోంది. స్థిరాస్తుల విలువ రూ.32 వేల కోట్లుగా లెక్కించగా, వీటిని కూడా ప్రస్తుత మార్కెట్ విలువతో లెక్కించే ప్రయత్నం చేయలేదనీ, రికార్డుల మేరకు ఆస్తులన్నీ సక్రమంగానే ఉన్నాయని పేర్కొన్నట్లు సమాచారం.
Labels:
హరే శ్రీనివాసా