రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్

నువ్వంటే ప్రాణమనీ, నీతోనే లోకమనీ,
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకనీ,
ఎవరికీ చెప్పుకోను నాకు తప్ప,
కన్నులకి కలలు లేవు నీరు తప్ప.

మనసూ వుంది, మమతా వుంది,
పంచుకునే నువ్వు తప్ప,
ఉపిరి వుంది, ఆయువు వుంది,
వుండాలనే ఆశ తప్ప.
ప్రేమంటే శాశ్వత విరహం అంతేనా,
ప్రేమిస్తే సుదీర్గ నరకం నిజమేనా.
ఎవరిని అడగాలి నన్ను తప్ప,
చివరికి ఏమవ్వాలి మన్ను తప్పా.

వేంటోస్థానన్నావు వెళ్లోస్తనన్నావు,
జంటై ఒకరి పంటై వెళ్లావు.
కరునిస్తానన్నావు, వరమిస్తానన్నావు,
బరువై మెడకు వురివై పోయావు.
దేవత లోను ద్రోహం వుందని తెలిపావు,
దీపం కూడా దహియిస్తుందని తేల్చావు.
ఎవరిని నమ్మాలి నన్ను తప్ప,
ఎవరిని నిందిచాలి నిన్ను తప్ప.