రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

కరివేపాకు రైస్‌



కావలసినవి
కరివేపాకు: నాలుగు టీస్పూన్లు(రుబ్బినది), జీలకర్ర: టీస్పూను, పచ్చిమిర్చి: మూడు, వెల్లులిరేకలు: రెండు, ఉల్లిపాయ: ఒకటిి(ముక్కలుగా కోయాలి), జీడిపప్పు: 9, నిమ్మకాయ: ఒకటి(రసం పిండి ఉంచాలి), బియ్యం: పావుకేజి, నూనె: అరకప్పు, ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
అన్నం వండి ఉంచాలి. బాణలిలో నూనె వేసి జీడిపప్పు వేయించి తీయాలి. అదే నూనెలో జీలకర్ర, పచ్చిమిర్చి, చిదిమిన వెల్లుల్లి, ఉల్లిముక్కలు, రుబ్బిన కరివేపాకు వేసి బాగా వేయించి దించాలి. ఇందులోనే అన్నం వేసి కలపాలి. ఉప్పు, నిమ్మరసం కూడా వేసి బాగా కలపాలి. చివరగా జీడిపప్పుతో అలంకరిస్తే కరివేపాకు రైస్‌ రెడీ!