ఆనంద నిలయం అనంత స్వర్ణమయం
Labels:
హరే శ్రీనివాసా
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్
ఆంగ్లచిత్రంలో అన్నాచెల్లెళ్లు ఓ అన్న, ఓ చెల్లి.. ఇద్దరూ బాల నటులే.. ఇప్పుడు వీళ్లిద్దరూ.. ఓ ఇంగ్లిషు సినిమాలో నటిస్తున్నారు! ఇంతకీ వీరెవరో తెలుసా? దర్శకుడు పూరీజగన్నాథ్ పిల్లలు..
మాస్టర్ ఆకాశ్, బేబీ పవిత్ర తెలుసా అంటే గబుక్కున గుర్తు రాకపోవచ్చు. కానీ ‘బుజ్జిగాడు'లో హీరో ప్రభాస్, హీరోయిన్ త్రిషల చిన్ననాటి పాత్రల్లో నటించిన వారంటే చటుక్కున తెలిసిపోతుంది. ఈ అన్నాచెల్లెళ్లు ఇప్పుడు ‘లోటస్ పాండ్' అనే ఇంగ్లిషు సినిమాలో నటిస్తున్నారు. ఇదొక బాలల సినిమా అన్నమాట. ఇందులో హీరో ఆకాశే. ఇక పవిత్ర కూడా ఓ స్కూలు అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కులూలో మంచు కొండల మధ్య జరుగుతోంది. దీని కథ భలేగా ఉంటుంది. స్కూలు టీచర్ ఓసారి ఓ తామర కొలను గురించి చెబితే దాన్ని వెతుక్కుంటూ పిల్లలు బయల్దేరుతారన్నమాట. మంచు కొండలపై 14 వేల అడుగుల ఎత్తున ఉన్న అక్కడికి వెళ్లడంలో వారెలాంటి సాహసాలు చేశారనేదే కథ. దీనికి పీజీ విందా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని ఇతర దేశాల్లో కూడా విడుదల చేస్తార్ట. మన తెలుగులో కూడా వస్తుంది.
ఆరో తరగతి చదువుతున్న ఆకాశ్ ఇంతవరకూ మూడు సినిమాల్లో నటించాడు. ఆ మూడూ కూడా వాళ్ల నాన్న పూరీ తీసినవే. ‘చిరుత'లో హీరో రామ్‌చరణ్‌తేజ చిన్నప్పటి పాత్రలో కనిపించేది ఇతడే. అలాగే ‘ఏక్‌నిరంజన్'లో హీరోయిన్ పక్కన ఉండే పిల్లల్లో ఒకడిగా పెద్ద పెద్ద డైలాగులు చెబుతూ కనిపిస్తాడు. అన్నట్టు.. పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే ‘హీరో' అంటున్నాడు తడుముకోకుండా. దర్శకుడు విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రాబోయే మరో సినిమాలో కూడా నటించబోతున్నాడు. ఇక ఈతకొట్టడం, ఫుట్‌బాల్, క్రికెట్ ఆడటం ఆకాశ్‌కి భలే ఇష్టం.
ఆకాశ్ చెల్లెలు పవిత్ర 5వ తరగతి చదువుతోంది. ‘బుజ్జిగాడు'లో నటించేప్పుడు కాళ్ళు వణికిపోయాయిట. తర్వాత ధైర్యంగా చేసేసింది. పెద్దయ్యాక నటివవుతావా అని అడిగితే కానంటుంది ఈ పాప. బాగా చదువుకుని డాక్టర్ అవుతుందిట. పవిత్ర కూచిపూడి నేర్చుకుంటోంది. స్కూల్లో ప్రదర్శనలు కూడా ఇచ్చింది.
Labels:
సినిమా
TO DEAR DEVI
Medicines and friendships cure our problems.
The only difference is that friendships
don't have an expiry date
HAPPY BIRTHDAY
Labels:
శుభాకాంక్షలు
Nag - Amala
మూవీ మొఘల్ రామానాయుడు రూపొందించిన 'చినబాబు' చిత్రంలో నాగార్జున, అమలలు తొలిసారిగా కలిసి నటించారు. తరువాత నటించిన 'కిరాయి దాదా' చిత్రం షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ మొగ్గ తొడిగింది. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన 'శివ' చిత్రంతో ప్రేమ పరిపక్వతకు చేరుకుంది. 'ప్రేమ యుద్ధం' చిత్రం విడుదలైన కొద్దికాలానికే నాగార్జున అమలలు వివాహం చేసుకున్నారు.
Labels:
Hit Pairs
Happy Birday Nag
F - Field of Love
R - Root of Joy
I - Island of God
E - End of Sorrow
N - Name of Hope
D - Door of Understanding
...Thats You Friend
It's your birthday and I can't be there
But I'll send you a special birthday wish and a little prayer have a
May you have a great time today and find happiness in everything you do.
Labels:
శుభాకాంక్షలు
అనంత స్వర్ణమయం
ఆనంద నిలయం- అనంత స్వర్ణమయం
తిరుమలేశుని ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు తితిదే ఛైర్మన్ ఆదికేశవుల నాయుడు ఆధ్వర్యంలో ‘ఆనంద నిలయం- అనంత స్వర్ణమయం' పేరుతో భారీ పథకం చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రధానాలయాన్ని బంగారంతో తాపడం చేయాలన్నది ఈ పథకం ఉద్దేశం. ఇందుకుగాను మొత్తం 200 కిలోల బంగారం అవసరం అవుతుందని అంచనా వేశారు. గత సంవత్సరం అక్టోబరు 1న అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకూ 100 కిలోల బంగారాన్ని సేకరించారు. ఆలయానికి అమర్చేందుకు గాను ముందు రాగి రేకులను సిద్ధం చేసి వాటిని బంగారంతో తాపడం చేసే పని దాదాపు పూర్తి కావచ్చింది. వీటిని ఆలయానికి అమర్చాల్సి ఉంటుంది. ఈ భారీ ప్రాజెక్టులో అక్రమాలు కూడా భారీగానే జరిగాయని అందిన ఫిర్యాదుల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రంగంలోకి దిగింది. పథకానికి అవసరమైన బంగారం అంతా దాతల నుంచే స్వీకరిస్తున్నారు. తితిదే విజ్ఞప్తి చేసిందే మొదలు దాతలు భారీగా విరాళాలు ఇవ్వడం మొదలుపెట్టారు. సామాన్య భక్తుల నుంచి పారిశ్రామిక వేత్తల వరకూ తమకు చేతనైనంత సాయం చేస్తున్నారు.
Labels:
హరే శ్రీనివాసా
MS Office - 2007
అయితే ఇకపై అలా ఉండదు. ఎందుకంటే... ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ, Microsoft, కంప్యూటర్లను ప్రజలకు దగ్గర చేసే ఒక సరిక్రొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. Microsoft ఇప్పుడు అన్ని ప్రముఖ భారతీయ భాషల్లో భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్‌లను అందిస్తోంది, దీనితో ప్రతి సామాన్యుడు కంప్యూటర్‌ను ఉపయోగించవచ్చు. భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్‌లు లేదా సంక్షిప్తంగా LIPలను ఇన్‌స్టాల్ చేయడం మరియు ఉపయోగించడం చాలా సులభం. ఈ సాఫ్ట్‌వేర్ మీరు కంప్యూటర్లను చూసే విధానాన్ని మార్చేస్తుంది.
ఇక్కడ నుండి ప్యాక్‌ను డౌన్‌లోడ్ చేసి .exe పై క్లిక్ చేయడం ద్వారా ఇన్‌స్టాల్ చేయండి. దీన్ని ఇన్‌స్టాల్ చేసేందుకు మీరు మీ కంప్యూటర్‌లో Microsoft Office 2007 ఇంగ్లీష్ వెర్షన్‌ను కలిగి ఉండాలి. కొన్ని సెకన్లలో, మీ కంప్యూటర్ మీ స్వంత భాషలో మీకు కనిపిస్తుంది. డాక్యుమెంటేషన్, ఇమెయిల్, ప్రెజెంటేషన్‌ను సిద్ధం చేయడం లేదా ఇటీవల మీకు కష్టంగా అనిపించిన దేనినైనా ఇప్పుడు సులభంగా అర్థం చేసుకోవచ్చు మరియు ఇప్పుడు ఇది మీ స్వంత భాషలో ఉన్నందున, దాని గురించి మీరు పూర్తిగా అర్థం చేసుకోగలిగినందున ధైర్యంగా నేర్చుకోవచ్చు.
కాబట్టి, దీన్ని ఉపయోగించి చూడండి... ఇది మీ జీవితాన్ని మార్చివేస్తుంది! Download from here
Labels:
మీకు తెలుసా
ప్రేమవివాహాలకు పెద్దదిక్కు
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ ప్రేమవివాహం సికింద్రాబాద్‌లోని న్యూ బోయిన్‌పల్లిలోగల ఆర్యసమాజ్ మందిరంలో జరిగింది. టాలీవుడ్ హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ పెద్దల అంగీకారంతో తను ప్రేమించిన ప్రవాస భారతీయుడు ఉజ్వల్ కుమార్‌ను హైదరాబాద్, రాణీగంజ్‌లోని ఆర్యసమాజ్ మందిరంలో పరిణయమాడారు. బుల్లి తెర యాంకర్ జాహ్నవి సైతం మనసుకు నచ్చిన వాడిని ఆర్యసమాజ్ మందిరంలో మనువాడారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్యసమాజ్ మందిరంలో జరిగిన ప్రేమవివాహాల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. కుల, మత, జాతి వివక్షకు తావులేకుండా వివాహాలు జరిపించడం ద్వారా నిజమైన ప్రేమకు ఆర్య సమాజం పట్టం కడుతోంది. భారతీయ రాజ్యాంగాన్ని అనుసరించి వివాహ వయోపరిమితిని దాటిన యువతీ యువకులకు వివాహం జరిపిస్తోంది ఆర్య సమాజం. అదే సమయంలో తమ వయస్సును ధృవీకరించే తగు పత్రాలను చూపిన సందర్భంలో మాత్రమే ఇక్కడ వివాహాలు జరుగుతాయి.
ఆర్య సమాజంలో వివాహం జరిగే తీరు
ఆడంబరాలకు పోకుండా నిరాడంబరంగా వివాహం చేసుకోవాలనుకునే వారు ఆర్యసమాజాన్ని ఆశ్రయిస్తుంటారు. ఆర్యసమాజాన్ని స్వామీ దయానంద సరస్వతి స్థాపించిన సంగతి తెలిసిందే. సమాజం సిద్ధాంతాలను అనుసరించి కేవలం హిందువులకు మాత్రమే వేద మంత్రాల సాక్షిగా ఇక్కడ వివాహాలు జరుగుతుంటాయి. హిందూయేతరులు సైతం ఇక్కడ వివాహాలు చేసుకోవచ్చు.
కాకపోతే అందుకుగాను ఆర్యసమాజం నిర్వహించే 'శుద్ధి' కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం వివాహాలు చేయిస్తారు. స్వతహాగా ఆర్యసమాజం విగ్రహారాధనను వ్యతిరేకిస్తుంది. తదనుగుణంగా వివాహ తంతులో పంచభూతాల సాక్షిగా అగ్నిగుండం ఎదుటు వధూవరులను కూర్చుండబెట్టి వివాహం జరిపిస్తారు. మొత్తం వివాహ కార్యక్రమం గంట సేపట్లోనే ముగిసిపోతుంది. దీంతో వివాహానికి పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం ఉండదు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్యసమాజ్ మందిరంలో జరిగిన ప్రేమవివాహాల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. కుల, మత, జాతి వివక్షకు తావులేకుండా వివాహాలు జరిపించడం ద్వారా నిజమైన ప్రేమకు ఆర్య సమాజం పట్టం కడుతోంది. భారతీయ రాజ్యాంగాన్ని అనుసరించి వివాహ వయోపరిమితిని దాటిన యువతీ యువకులకు వివాహం జరిపిస్తోంది ఆర్య సమాజం. అదే సమయంలో తమ వయస్సును ధృవీకరించే తగు పత్రాలను చూపిన సందర్భంలో మాత్రమే ఇక్కడ వివాహాలు జరుగుతాయి.
ఆర్య సమాజంలో వివాహం జరిగే తీరు
ఆడంబరాలకు పోకుండా నిరాడంబరంగా వివాహం చేసుకోవాలనుకునే వారు ఆర్యసమాజాన్ని ఆశ్రయిస్తుంటారు. ఆర్యసమాజాన్ని స్వామీ దయానంద సరస్వతి స్థాపించిన సంగతి తెలిసిందే. సమాజం సిద్ధాంతాలను అనుసరించి కేవలం హిందువులకు మాత్రమే వేద మంత్రాల సాక్షిగా ఇక్కడ వివాహాలు జరుగుతుంటాయి. హిందూయేతరులు సైతం ఇక్కడ వివాహాలు చేసుకోవచ్చు.
కాకపోతే అందుకుగాను ఆర్యసమాజం నిర్వహించే 'శుద్ధి' కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం వివాహాలు చేయిస్తారు. స్వతహాగా ఆర్యసమాజం విగ్రహారాధనను వ్యతిరేకిస్తుంది. తదనుగుణంగా వివాహ తంతులో పంచభూతాల సాక్షిగా అగ్నిగుండం ఎదుటు వధూవరులను కూర్చుండబెట్టి వివాహం జరిపిస్తారు. మొత్తం వివాహ కార్యక్రమం గంట సేపట్లోనే ముగిసిపోతుంది. దీంతో వివాహానికి పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం ఉండదు.
Labels:
మీకు తెలుసా
Krishna - Vijayanirmala
ప్రథమంగా సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మలల ప్రేమవివాహాన్ని ప్రస్తావించుకోవాలి. 1967 సంవత్సరంలో బాపు దర్శకత్వంలో విడుదలైన 'సాక్షి' చిత్రంలో వీరిరువురు కలిసి నటించారు. ఆ చిత్ర కథను అనుసరించి వారిరువురి వివాహం ఓ దేవాలయంలో జరుగుతుంది. దీనిని గమనించిన హాస్యనటుడు రాజబాబు ఈ గుడిలో సినిమా పెళ్లి చేసుకున్నప్పటికీ నిజజీవితంలో దంపతులు అవుతారని సెలవిచ్చారు.
రాజబాబు మాట ప్రభావమో లేక దేవాలయ మహత్మ్యమో తెలియదు కాని కృష్ణ, విజయనిర్మలలు కొద్ది కాలానికే వివాహం చేసుకున్నారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో నూతన అధ్యాయాలకు శ్రీకారం చుడుతూ వైవిధ్యభరితమైన సినిమాలతో నటశేఖర కృష్ణ స్టార్‌డమ్‌కు చేరుకోగా, అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా విజయనిర్మల గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్నారు.
రాజబాబు మాట ప్రభావమో లేక దేవాలయ మహత్మ్యమో తెలియదు కాని కృష్ణ, విజయనిర్మలలు కొద్ది కాలానికే వివాహం చేసుకున్నారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో నూతన అధ్యాయాలకు శ్రీకారం చుడుతూ వైవిధ్యభరితమైన సినిమాలతో నటశేఖర కృష్ణ స్టార్‌డమ్‌కు చేరుకోగా, అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా విజయనిర్మల గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్నారు.
Labels:
Hit Pairs
బైంగన్‌కా బర్తా
కావలసినవి
పచ్చడి వంకాయలు: పెద్దవి రెండు, టొమాటోలు: నాలుగు, ఉల్లిపాయలు: మూడు, కొత్తిమీర: కట్ట, పచ్చిమిరపకాయలు: రెండు, కారం: స్పూను, పసుపు: అరస్పూను, పంచదార: స్పూను, దాల్చినచెక్క: రెండు, లవంగాలు: నాలుగు, ఉప్పు: తగినంత పోపుకోసం: ఆవాలు: ఒక స్పూను, మెంతులు: అర స్పూను, నూనె: ఐదు లేదా ఆరు స్పూన్లు
తయారుచేసే విధానం
వంకాయలకి కొద్దిగా నూనె రాసి చాకుతో గాట్లు పెట్టి స్టవ్ మీద కాల్చి మెత్తగా అయిన తరవాత తీసి పైన చల్లటి నీళ్లు చల్లి పక్కన ఉంచాలి. ఉల్లిపాయలు, టొమాటోలు సన్నగా విడివిడిగా తరగాలి.
బాణలిలో నూనె వేసి లవంగాలు, దాల్చినచెక్క వేయించి తీయాలి. ఆవాలు, మెంతులు వేసి అవి కూడా వేగిన తరవాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరప ముక్కలు వేసి కమ్మని వాసన వచ్చేవరకూ వేయించి అందులో టొమాటో ముక్కలు వేసి ఉప్పు, పసుపు, పంచదార వేసి మూతపెట్టాలి. మెత్తగా అయిన తరవాత దించి పక్కనపెట్టాలి. తరవాత వంకాయలు తొక్క తీసి రోటిలో వేసి మెత్తగా గుజ్జులా చేసి టొమాటోల్లో కలపాలి. లవంగాలు, దాల్చిన చెక్క పొడి చేసి వేయాలి. ఆపైన కొత్తిమీర సన్నగా తరిగి కలిపితే బెంగాలీలు ఎక్కువగా వండే బైంగన్‌కా బర్తా సిద్ధం.
Labels:
ఎంత రుచి రా
కరివేపాకు రైస్
కావలసినవి
కరివేపాకు: నాలుగు టీస్పూన్లు(రుబ్బినది), జీలకర్ర: టీస్పూను, పచ్చిమిర్చి: మూడు, వెల్లులిరేకలు: రెండు, ఉల్లిపాయ: ఒకటిి(ముక్కలుగా కోయాలి), జీడిపప్పు: 9, నిమ్మకాయ: ఒకటి(రసం పిండి ఉంచాలి), బియ్యం: పావుకేజి, నూనె: అరకప్పు, ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
అన్నం వండి ఉంచాలి. బాణలిలో నూనె వేసి జీడిపప్పు వేయించి తీయాలి. అదే నూనెలో జీలకర్ర, పచ్చిమిర్చి, చిదిమిన వెల్లుల్లి, ఉల్లిముక్కలు, రుబ్బిన కరివేపాకు వేసి బాగా వేయించి దించాలి. ఇందులోనే అన్నం వేసి కలపాలి. ఉప్పు, నిమ్మరసం కూడా వేసి బాగా కలపాలి. చివరగా జీడిపప్పుతో అలంకరిస్తే కరివేపాకు రైస్ రెడీ!
Labels:
ఎంత రుచి రా
కార్తీక పురాణం - 15
15వ అధ్యాయము
దీప ప్రజల్వనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో మనిషి (నర)రూపము పొందుట. అంత జనకమహారాజుతో వశిష్ఠ మహాముని - జనకా! కార్తీక మహాత్య్మను గురించి ఎంత చెప్పినా పూర్తి కాదు. కానీ ఇంకొక ఇతిహాసము చెప్తాను చక్కగా వినమనెను.
ఈ మాసములో హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణమును చదువుట, వినుట, సాయంత్రము దేవతా దర్శనములు చేయలేనివారు కాలసూత్రమనెడి నరకమున బడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశీ రోజున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగుతుంది. శ్రీమన్నారాయణుని గంధముతో, పుష్పాలతో, అక్షతలతో పూజించి దూప, దీప నైవేధ్యాలను సమర్పిస్తే విశేష ఫలము పొందగలరు. ఈవిధంగా నెల రోజులు విడవక చేసినవారికి దేవదుందుభులు మోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెలరోజులు చేయలేనివారు కార్తీక శుద్ధ త్రయోదశి, చత్రుర్థశి, పూర్ణిమ రోజులలోనానై నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపారాధన చేయవలెను.
ఈ కార్తీక మాసములో ఆవుపాలు పితికినంత సేపు దీపం వెలిగేలా ఉంచితే మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించుదురు. ఇతరులు వెలిగించిన దీపాలను సరిగ్గా ఉంచినా, లేక ఆరిపోయిన దీపాలను వెలిగించినా అట్టి వారి సమస్త పాపములు తొలిగిపోవును. దీనికి ఒక కథ కలదు. శ్రద్ధగా వినమని వశిష్ఠులవారు ఇలా చెప్పసాగెను.
సరస్వతీ నదీతీరమున శిథిలమైన దేవాలయం ఒకటి ఉంది. కర్మనిష్ఠుడనే దయగల యోగిపుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయూ అక్కడే ఉంటూ పురాణం చదవాలనే కోరికతో ఆ పాడుబడిన దేవాలయమును శుభ్రముగా చిమ్మి, నీళ్ళతో కడిగి, బొట్లు పెట్టి, ప్రక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులు వేసి, పన్నెండు దీపాలను వెలిగించి స్వామిని పూజిస్తూ, పురాణాన్ని చదువుతుండెను. ఈ విధంగా కార్తీక మాసము ప్రారంభం నుండి చేయసాగెను.
ఒక రోజున ఒక ఎలుక ఆ దేవలయములో ప్రవేశించి, నలుమూలలా వెతికి, తినడానికి ఏమీ దొరక్కపోవడంతో అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని నోట కరచుకొని పక్కనున్న దీపము వద్ద ఆగెను. నోట్లో ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరోపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలగడంతో దాని పాపాలు నశించి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడెను. ధ్యాన నిష్ఠలో ఉన్న యోగి పుంగవుడు, తన కన్నులు తెరచి చూడగా, పక్కనే ఉన్న మనిషిని చూసి ఓయీ! నీవు ఎవ్వరవు? ఎందుకు నిలబడ్డావు? అని ప్రశ్నించగా 'ఆర్యా! నేను మూషికమును. రాత్రి నేను ఆహారం కోసం ఈ దేవాలయములోకి ప్రవేశించగా ఇక్కడ కూడా ఏమీ తినడానికి దొరకనందున నెయ్యి వాసనలతో ఉండి ఆరిపోయిన వత్తిని తినాలన్న కోరికతో దాన్ని నోట కరచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా, అదృష్టముకొద్దీ ఈ వద్ది వెలుగటచే నా పాపాలు నశించి పూర్వ జన్మమెత్తాను. కానీ ఓ మహానుభావా! నేను ఎందుకీ ఎలుక రూపంలో పుట్టాను - దానికి గల కారణమేమిటో వివరించమని' కోరెను.
అంత యోగీశ్వరుడు ఆశ్చర్యంతో తన దివ్యదృష్టిచే మొత్తం తెలుసుకుని 'ఓయీ! కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లికుడని పిలిచేవారు. నీవు జైనమతవంశానికి చెందిన వాడవు. నీవు కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ, డబ్బుమీద ఆశతో దేవ పూజలు, నిత్యకర్మలు మరచి, చెడు స్నేహాల వల్ల నిషిద్ధాన్నము తింటూ, మంచివాళ్ళను, యోగ్యులను నిందిస్తూ పరుల చెంత స్వార్త చింతన కలవాడవై ఆడపిల్లలను అమ్ముతూ దాని వల్ల సంపాదించిన సొమ్మును దాస్తూ, అన్ని ఆహారాపదార్థాలను తక్కువ ఖరీదుకు కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్ముతూ అలా సంపాదించిన డబ్బుతో నీవు తినక, ఇతరులకు ఇవ్వక ఆ ధనమును భూ స్థాపితము చేసి పిసినారివై బ్రతికావు. నీవు చనిపోయిన తర్వాత ఎలుక రూపంలో పుట్టి వెనుకటి జన్మ పాపాలను అనుభవిస్తున్నావు. నేడు భగవంతుని వద్ద ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందుకు పుణ్యాత్ముడవైతివి. దానివలననే నీకు పూర్వజన్మ రూపాన్ని పొందావు. కాబట్టి నీవు నీ గ్రామానికి పోయి నీ పెరట్లో దాచిపెట్టిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో దానధర్మాలు చేసి భగవంతునిని పూజించి మోక్షమును పొందుము' అని నీతిబోధ చేసి పంపించెను.
పంచాదశాధ్యాయము పదిహేనో రోజు పారాయణము సమాప్తం.
Labels:
పండుగలు
కార్తీక పురాణం - 14
14వ అధ్యాయము
ఆబోతునకు అచ్చువేసి వదులుట
మరల వశిష్ఠులవారు జనకునిని దగ్గర కూర్చోబెట్టుకుని కార్తీకమాస మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన విషయాలను ఉత్సాహంతో ఇలా చెప్పసాగిరి.
ఓ రాజా! కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జన చేయుట, శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగున్న పుణ్యకార్యాల వల్ల వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములు నశించుటేగాక, వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందెవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదులునో అని ఎదురుచూస్తుందురు. ఎవడు ధనవంతుడై ఉండీ పుణ్యకార్యములు చేయక, దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినా చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును.
కాబట్టి, ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలదీ దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయంసమయమున శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసి ఆ రాత్రంతయూ జాగారముండి మరునాడు తమ శక్తికొలదీ బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహపరములందు స్వరసుఖాలను అనుభవింతురు.
కార్తీకమాసములో విసర్జింపలసినవి
ఈ కార్తీక మాసంలో పరాన్నభక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి తినరాదు, శ్రాద్ధా భోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు, తిలాదానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారములనాడు, సూర్యచంద్రగ్రహణపు రోజులలో భోజనం చేయరాదు. కార్తీక మాసములో నెల రోజులూ రాత్రులు భోజనం తినరాదు. విధవ వండినది తినకూడదు. ఏకాదశీ, ద్వాదశీ వ్రతములు చేయువారు ఆ రెండు రాత్రులూ తప్పనిసరిగా జాగారము ఉండవలెను.
కార్తీక మాసంలో ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలెను. ఈ మాసంలో నూనె రాసుకుని తల స్నానము చేయరాదు, పురాణాలు విమర్శించరాదు. కార్తీక మాసములో వేడినీటితో స్నానము చేసిన కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కాబట్టి వేడినీటితో స్నానం చేయరాదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడువకుండా కార్తీక మాసవ్రతమును చేయవలెనన్న కుతూహలము కలవారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అలా చేయువారు గంగా, గోదావరి, సరస్వతీ, యమున నదుల పేర్లను మనసులో తలచుకుని స్నానము చేయవలెను.
ఏది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాత: కాలమున స్నానము చేయవలెను. అలా చేయనిచో మహాపాపియై జన్మజన్మములు నరకకూపమున పడి కృశింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతిదగ్గర కానీ, చెరువు దగ్గర కానీ, లేక ఇంటిలోని పంపువద్ద కానీ చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.
శ్లో : గంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదా సింధుకావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు!!
అని చదువుకుంటూ స్నానం చేయాలి. కార్తీక మాసవ్రతం చేసేవారు పగలు పురాణ పటనం, హరికథాకాలక్షేపాలతో కాలం గడపాలి. సాయంత్రం పూట సంధ్యావందనాలు పూర్తి చేసి పూజామందిరంలో దీపాలు వెలిగించి, శివకేశవుల్ని అష్టోత్తరాలతో పూజ జేయాలి. ఈ ప్రకారం శివపూజ చేసివారు ధన్యజీవులు. పూజ తర్వాత తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో సత్కారము చేసి సంతోషపర్చవలెను. ఇలా చేసినవారు నూరు అశ్వమేథ యాగములు చేసిన పుణ్యం, వెయ్యి వాజిపేయ యాగములు చేసిన ఫలం పొందుతారు.
ఈ కార్తీక మాసము నెలరోజులూ బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని, నిత్యదీపారాధన, తులసికోటవద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసినవారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగుతుంది. చేయగల శక్తి ఉండి కూడా ఈ వ్రతాన్ని చేయలేనివారు నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక వంటి వివిధ జన్మలెత్తుతారు. ఈ వ్రతము శాస్త్రం ప్రకారం ఆచరిస్తే పదిహేను జన్మల పూర్వజ్ఞానము కలుగుతుంది. వ్రతం చేసినా, పురాణం చదివినా, విన్నాకూడా సకలైశ్వర్యములు కలిగి మోక్షాన్ని పొందుతారు.
చతుర్ధశాధ్యాయము పధ్నాలుగో రోజు పారాయణం సమాప్తం.
Labels:
పండుగలు
కార్తీక పురాణం - 13
13వ అధ్యాయం
కన్యాదన ఫలము
ఓ జనక చక్రవర్తీ! కార్తీక మాసంలో తప్పనిసరిగా చేయవలసిన ధర్మాలు చాలా ఉన్నాయి. వాటి గురించి వివరిస్తాను సావధానంగా విను.
కార్తీక మాసంలో నదీస్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారినికి ఉపనయనం చేయడం ముఖ్యం. ఒకవేళ ఉపనయనం చేయడానికి ఖర్చు భరించలేనప్పుడు మంత్రాక్షతలు, దక్షిణతాంబూలం, సంభావనలతో తృప్తి పరచినా ఫలితం కలుగుతుంది. ఇలా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనం చేస్తే మనం చేసిన ఎలాంటి పాపాలైనా తొలిగిపోతాయి. ఎన్ని దానధర్మాలు చేసినా కలగని పుణ్యం ఒక పేద బ్రాహ్మణుని బాలునికి చేసిన ఉపనయంతో కలుగుతుంది. మరో పుణ్యకార్యం కన్యాదానం. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేస్తే వారు తరించడమే కాకుండా, వారి పితృదేవతలను కూడా తరింపచేసినవాడవుతాడు. ఇందుకు ఒక ఉదాహరణ చెబుతాను వినమనెను.
సువీర చరిత్ర
ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన సువీరుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య పేరు రూపవతి. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడించబడి, భార్యతో కలసి అరణ్యంలోకి పారిపోయాడు. నర్మదా నదీ తీరంలో పర్ణశాలను నిర్మించుకుని అడవిలో దొరికే కందమూలాలు, పండ్లు తింటూ కాలం గడుపుచున్నాడు. కొన్ని రోజులకు అతని భార్య రూపవతి ఒక బాలికను ప్రసవించింది. ఆ బాలికను అతి గారాబంతో పెంచుతున్నారు. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలిక సరైన ఆహార సదుపాయాలు లేకపోయినా చూసేవారికి కనులపండుగగా, ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా ఉండేది. రోజులు గడిచే కొద్దీ, ఆ బాలిక పెరిగి పెండ్లి వయసుకు వచ్చింది.
ఒక రోజు వానప్రస్థుని కుమారుడు ఆమెను చూసి ఆమె అందానికి పరవశుడై ఆమెను తనకిచ్చి పెండ్లి చేయమని సువీరుడు కోరాడు. అందుకు ఆ రాజు 'ఓ మునిపుత్రా ప్రస్తుతం నేను చాలా బీద స్థితిలో ఉన్నాను. నా కష్టాలు తొలగడానికి నాకు కొంత ధనమిస్తే నా కుమార్తె నిచ్చి పెండ్లి చేస్తాను' అన్నాడు. తన చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో ఆ బాలికమీద మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరాన కుబేరుని గూర్చి ఘోరతపస్సు చేసి, కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాదించి, రాజుకు ఆ ధన పాత్రని ఇచ్చి ఆ బాలికను పెండ్లి చేసుకుని తీసుకువెళ్ళి తన తల్లితండ్రులకు నమస్కరించి అంతవరకూ జరిగిన వృత్తాంతమంతా చెప్పి భార్యతో సుఖముగా ఉన్నాడు.
ముని కుమారుడు ఇచ్చిన ధనపాత్రతో సువీరుడు స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉన్నాడు. మరి కొంతకాలానికి సువీరుడికి మరొక కుమార్తె జన్మించింది. ఆ బిడ్డకు కూడా యుక్తవయసు రాగానే మరలా ఎవరైనా ధనం ఇచ్చేవారికి అమ్మవచ్చనన్న ఆశతో ఎదురుచూడసాగాడు.
ఒకానొక రోజున ఒక సాధుపుంగవుడు నర్మదా నదీ తీరానికి స్నానం చేయడానికి వస్తూ దారిలో ఉన్న సువీరుడుని కలుసుకుని 'నువ్వెవ్వరిని. నిన్నుచూస్తుంటే రాజవంశస్తుడవలే ఉన్నావు? నువ్వు ఈ అరణ్యంలో ఉండటానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు.'
సువీరుడు 'మహానుభావా నేను వంగదేశానికి రాజుని. నా రాజ్యాన్ని శత్రవులాక్రమించారు. భార్యతో కలసి ఈ అడవిలో నివసిస్తున్నాను. దరిద్రం కంటే కష్టమైనది ఏదీ లేదు. నాకు ఇద్దరు కుమార్తెలు. నా మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి అతని వద్ద కొంత ధనమును తీసుకొన్నాను. దానితోనే ఇంతవరకూ నెట్టుకొస్తున్నాను అని చెప్పాను.'
అప్పుడు ఆ ముని 'ఓ రాజా నువ్వు ఎంత దరిద్రుడివైనా, ధర్మసూక్షమాలోచించకుండా కన్యను అమ్ముకున్నావు. కన్యావిక్రయం మహా పాపాలలో ఒకటి. కన్యను విక్రయించివారు 'అసిపత్రవన'మను నరకం అనుభవిస్తారు. ఆ ధనముతో దేవముని పితృదేవతా ప్రీత్యర్ధం ఏ వ్రతం చేస్తారో వారు నాశనం అయిపోతారు. అంతేకాకుండా కన్యా విక్రయం చేసేవారికి పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు. అలానే కన్యను ధనమిచ్చి పెండ్లాడినవారు చేసే గృహస్థ ధర్మాలు వ్యర్థమవుటయే గాక అతడు మహా నరకం అనుభవిస్తాడు. కన్యా విక్రయం చేసేవారికి ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదని పెద్దలు వక్కాణించి చెబుతున్నారు. కాబట్టి రాబోయే కార్తీకమాసంలో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలదీ బంగారు నగలతో అలంకరించి సదాచార సంపన్నుడు, ధర్మబుద్ధి కలవానికి కన్యాదానం చెయ్యి. అలా చేస్తే గంగాస్నానం చేసినంత ఫలం, అశ్వమేధ యాగం చేసినంత ఫలితం పొందుటయే కాకుండా, మొదట కన్యను అమ్మిన పాపం కూడా తొలిగిపోతుంది' అని రాజుకు హితవు చెప్పాడు.
అందుకారాజు చిరునవ్వు నవ్వి 'ఓ మునివర్యా! దేహసుఖం కంటే దానధర్మాల వలన వచ్చిన ఫలం ఎక్కువా? తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోను, సిరిసంపదలతోనూ సుఖంగా ఉండకుండా, చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ప్రస్తుతమున్న అవకాశం చేతులారా జారవిడవమంటారా? ధనమూ, బంగారం ఉన్నవారే ప్రస్తుతలోకంలో రాణింపగలరు. ముక్కూ, నోరు ముసుకుని బక్కచిక్కి శల్యమై ఉన్నవారిని ఈ లోకం గుర్తిస్తుందా?, గౌరవిస్తుందా? ఐహిక సుఖాలే గొప్ప సుఖాలు. కాబట్టి నేనడిగినంత ధనం ఎవరైతే నాకిస్తారో, వారికే నా రెండవ కుమార్తెను కూడా ఇచ్చి పెండ్లి చేస్తాను' అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు. మరికొన్ని రోజులకు సువీరుడు మరణించాడు. వెంటనే యమభటులు వచ్చి అతన్ని తీసుకుపోయారు. యమలోకములో అసిపత్రమనే నరకభాగంలో పడవేసి అనేక విధాలుగా బాధించారు. సువీరుని పూర్వీకుడైన సృతకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గంలో సర్వసుఖములు అనుభవిస్తున్నాడు. సువీరుడు చేసిన కన్యావిక్రయం వలన ఆ సృతకీర్తిని కూడా యమకింకరులు పాశాలతో బంధించి స్వర్గం నుండి నరకానికి తీసుకొచ్చారు.
అప్పుడు సృతకీర్తి 'నాకు తెలిసినంతవరకు దానధర్మాలు, యజ్ఞయాగాదులు చేసి, ఇతరులకు ఉపకారమే చేశాను. మరి నాకు ఇటువంటి దుర్గతి ఎలా కలిగింది?' అనుకుని నిండు సభలో కొలువుదీరియున్న యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి నమస్కరించి 'ప్రభూ! నీవు సర్వజ్ఞుడవు. ధర్మమూర్తివి. బుద్ధిశాలివి. ప్రాణకోటినంతటినీ సమంగా చూస్తావు. నేనెప్పుడూ ఏ పాపం చేయలేదు. నన్ను స్వర్గలోకం నుండి నరకలోకానికి తీసుకొచ్చిన కారణం ఏమిటి? దయచేసి తెలియజేయండి' అని ప్రాధేయపడ్డాడు.
యమధర్మరాజు సృతకీర్తిని చూస్తూ 'సృతకీర్తి నువ్వు న్యాయమూర్తివి. ధర్మజ్ఞుడవు. నువ్వు ఎటువంటి దురాచారాలు చేయలేదు. కానీ నీ వంశస్తుడు అయిన సువీరుడు తన పెద్ద కుమార్తెను ధనానికి ఆశపడి అమ్ముకున్నాడు. కన్యను అమ్ముకొన్నవారి ఇటు మూడు తరాలు, అటు మూడు తరాలువారు ఎంతటి పుణ్యపురుషులైనా నరకాన్ని అనుభవించడమే కాకుండా నీచజన్మలెత్తవలసి వస్తుంది. నీవు పుణ్యాత్ముడవని, ధర్మాత్ముడవని తెలుసు. కాబట్టి నీకొక ఉపాయం చెప్తాను. నీ వంశస్తుడు సువీరునికి మరొక కుమార్తె ఉంది. ఆమె నర్మదా నతీ తీరాన తల్లి వద్ద పెరుగుతోంది. నా ఆశీర్వాదం వల్ల నీవు మానవ శరీరం దాల్చి, అక్కడకు వెళ్ళి ఆ కన్యను వేదపండితుడు, శీలవంతుడు అయిన ఒక బ్రాహ్మణునికి కార్తీకమాసంలో సాలంకృత కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడవుతాడు. పుత్రికా సంతానం లేనివారు తమ ధనంతో కన్యాదానం చేసినా, విధి విధానంగా ఆబోతునకు అచ్చువేసి వివాహం చేసినా కన్యాదాన ఫలం లభిస్తుంది. కనుక నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి నేను చెప్పినవన్నీ చేసిరా. అలా చేయడం వల్ల నీ పితృగణం తరిస్తారు వెళ్ళిరమ్మని' యమధర్మరాజు పలికెను.
సృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరాన ఒక పర్ణకుటీరంలో నివసిస్తున్న సువీరుని భార్యను, కుమార్తెను చూసి సంతోషించి ఆమెతో విషయమంతా చెప్పి, కార్తీకమాసంలో సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదాలు చదివిన ఒక బ్రాహ్మణ కుమారునికిచ్చి అతి వైభవంగా వివాహం చేశాడు. అలా కన్యాదానం చేయడం వల్ల సువీరుడు కూడా పాపవిముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకున్నాడు.
కన్యాదనం వల్ల మహాపాపాలు కూడా నాశనమవుతాయి. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినా పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో కన్యాదానం చేయాలని దీక్షబూని ఆచరించివాడు విష్ణు సాన్నిధ్యం పొందుతాడు. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకానికి వెళతాడు.
త్రయోదశాధ్యాయము పదమూడో రోజు పారాయణం సమాప్తం.
Labels:
పండుగలు
కార్తీక పురాణం - 12
12వ అధ్యాయం
ద్వాదశీ ప్రశంస
మహారాజా! కార్తీకమాసములో, కార్తీక సోమవారమన కార్తీక ద్వాదశీ వ్రతమును గురించి, సాలగ్రామపు మహిలను గురించి వివరిస్తాను వినుమంటూ వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలిపెను. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేసి, శక్తి కొలదీ బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఆ రోజంతా ఉపవాసముండి, సాయంకాలం శివాలయానికి గానీ, విష్ణాలయానికి గానీ వెళ్ళి దేవుని పూజించి, నక్షత్ర దర్శనం చేసుకొన్న తర్వాత భోజనం చేయాలి. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలతో పాటు మోక్షం కూడా కలుగుతుంది. కార్తీకమాసంలో శనిత్రయోదశినాడు ఈ వ్రతమాచరిస్తే వంద రెట్లు ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ద ఏకాదశి రోజున ఉపవాసముండి ఆ రాత్రి విష్ణాలయానికి వెళ్ళి శ్రీ హరిని మనసారా ధ్యానించి, శ్రీహరి సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసి మరుసటి రోజు బ్రాహ్మణ సమారాధన చేసేనా కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం కలుగుతుంది. ఈవిధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగానదీ స్నానం చేసి కోటి మందికి బ్రాహ్మణలకు భోజనం పెడ్తే ఎంత పుణ్యం లభిస్తుందో దానికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది.
కార్తీక శుద్ధ ద్వాదశీ వ్రతమంటే విష్ణువుకు ఎంతో ప్రీతికరం. ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి, ఆవుకాళ్ళకు వెండి డెక్కలు తగిలించి, దూడతో సహా బ్రాహ్మణుమనికి దానిమిస్తే ఆ ఆవు శరీరం మీద ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గసుఖాల్ని అనుభవిస్తారని ప్రతీతి. కార్తీక మాసంలో వస్త్రదానం చేసినా గొప్ప ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవునెయ్యి పోసి దీపముంచినవారికి పూర్వ జన్మలో చేసిన సకల పాపాలూ తొలిగిపోతాయి. ద్వాదశి నాడు యజ్ఞోపవీతాలు బ్రాహ్మణునకు దానమిస్తే ఇహపర సౌఖ్యాలు పొందుతారు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టుగానీ, సాలగ్రామాన్ని గానీ బ్రాహ్మణునికి దానిస్తే నాలుగు సముద్రముల మధ్య నున్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగుతుంది.
సాలగ్రామ దాన మహిమ
పూర్వం గోదావరి నదీ తీరంలోని ఒక పల్లెలో ఒక వైశ్యుడు నివశించేవాడు. అతనికి ధనాన్ని కూడబెట్టడమే పని. తాను తినడు, ఇతరులకు పెట్టడూ, ఎవరకీ దానం చెయ్యడు. పైగా ఇతరులను చులకనగా చేస్తూ తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుతూ, ఎవరికీ ఉపకారం చేయకుండా పరుల దగ్గర నుండి సొమ్ము ఎలా కాజేయాలా అని చూస్తుండేవాడు. ఆ వైశ్యుడు తన పల్లెకు సమీపాన ఉన్న మరో పల్లెలో నివసించే ఒక బ్రాహ్మణునికి అధిక వడ్డీకి తన దగ్గరున్న ధనాన్ని అప్పుగా ఇచ్చాడు. కొంతకాలం గడిచిన తరువాత తన ధనం తిరిగి ఇచ్చేయమని అడిగాడు ఆ వైశ్యుడు. తనకి ఓ నెల రోజులు గడువు ఇవ్వమన్నాడు. ఈ జన్మలో అప్పు తీర్చలేకపోతే మరు జన్మలో మీ ఇంట ఏ జంతువుగానో అయినా పుట్టి మీ ఋణం తీర్చుకుంటానని ప్రాధేయపడ్డాడు.
ఆ మాటలకు ఆ వైశ్యుడు పండిపడి 'అలా వీలు కాదు. నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వమని లేకపోతే నరికివేస్తాను' అంటూ ఆవేశంతో ముందూ, వెనుకా ఆలోచించక తన మొలలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని కంఠాన్ని కోశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు. ఆ కోమటి భయపడి అక్కడే ఉంటే రాజభటులు వచ్చి పట్టుకుంటారని తలచి తన గ్రామానికి పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహా పాపం కనుక, అప్పటి నుండి ఆ వైశ్యునికి కుష్టువ్యాధి సోకి నానా బాధలు పడుతూ మరి కొన్నాళ్ళకు మరణించినాడు. వెంటనే యమదూతలు అతనిని తీసుకొని పోయి నరకకూపంలో పడేశారు. ఆ వైశ్యునికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు ధర్మవీరుడు. పేరుకు తగినట్టే తండ్రి సంపాదించిన ధనాన్ని దానధర్మాలు చేస్తూ, పుణ్యకార్యాలు చేస్తూండేవాడు. నీడకొరకు చెట్లు నాటిస్తూ, నీటి కొరకు నూతులు, చెరువులు త్రవ్విస్తూ మంచి కీర్తిని పొందాడు. కొంతకాలానికి త్రిలోక సంచారియగు నారదులవారు యమలోకమును దర్శించి, భూ లోకానికి వచ్చి ధర్మవీరుని ఇంటికి వెళ్ళెను. ధర్మవీరుడు నారదులవారికి సాష్టాంగ దండప్రాణాలాచరించి, విష్ణుదేవునిగా భావించి, ఆర్ఘ్యపాద్యాది విధులచే సత్కరించి, చేతులు జోడించి 'మహానుభావా! నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుడను. నా జన్మ తరించింది. నా ఇల్లు పావనమైంది. శక్తి కొలదీ నేను చేసే సత్కార్యాలను స్వీకరించి, తమరు వచ్చిన కార్యాన్ని వివరించ'మని వినయంగా వేడుకున్నాడు.
నారదుడు చిరునవ్వు నవ్వి 'ఓ ధర్మవీరా! నేను నీకు ఒక హితవు చెప్పడానికి వచ్చాను. శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధద్వాదశి మహా ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్నాన, దాన, జపాదులలో ఏం చేసినా అత్యంత పుణ్యం లభిస్తుంది. నాలుగు జాతులలో ఏ జాతివారైనా స్త్రీ, పురుషులయినా, జారుడైనా, చోరుడైనా, పతివ్రత అయినా, వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశిలో ఉండగా స్నానమాచరించి, నిష్ఠగా పూజ చేసి ఉపవాసం ఉండి, సాలగ్రామ దానం చేస్తే పూర్వజన్మలోని పాపాలే కాకా ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగుతాయి. నీ తండ్రి యమలోకములో మహా నరకం అనుభవిస్తున్నాడు. అతన్ని ఆ నరకాన్నుండి తప్పించాలంటే నువ్వు సాలగ్రామ దానం చేయక తప్పదు. అలా చేసి నీ తండ్రి ఋణం తీర్చుకోమని' చెప్పాడు నారదమహర్షి. అప్పుడు ధర్మవీరుడు 'నారద మహర్షీ! నేను గోదానం, భూదానం, హిరణ్యదానం వంటి మహా మహా దానాలే చేశాను. అటువంటి దానాలు చేసినా నా తండ్రికి మోక్షం కలగలేదు. అటువంటప్పుడు ఈ 'సాలగ్రామ'మనే రాతిని దానం చేసినంత మాత్రాన ఆయనకి ఎలా విముక్తి కలుగుతుంది. దీని వలన ఆకలిగొన్న వానికి ఆకలి తీరదు, దాహం గొన్నవారికి దాహం తీరదు. అటువంటి దానాలు చేసినా నా తండ్రికి విముక్తి గలుగుతుంది. అందువల్ల ఈ దానం ఎందుకు చేయాలి' అని అడిగాడు.
ధర్మవీరుని ఉద్దేశించి నారద మహర్షి 'ధర్మవీరా సాలగ్రామమంటే శిలా ప్రతిమ కాదు. శ్రీహరియొక్క ప్రతిరూపం. అన్ని దానలకంటే సాలగ్రామ దానం చేస్తే కలిగే ఫలితం గొప్పది. కాబట్టి నీ తండ్రిని నరకబాధలనుండి విముక్తి పొందటానికి ఈ దానం కంటే మరే మార్గం లేదు' అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు.
ధర్మవీరుడు ధనబలం కలవాడై ఉండీ, దానధర్మాలు చేసినా సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలానికి అతను చనిపోయాడు. నారదుని మాట పెడచెవిన పెట్టడంతో మరణానంతరం ఏడు జన్మలందు పులిగా, మూడు జన్మలందు వానరమై, అయిదు జన్మలందు ఎద్దుగా, మరో పది జన్మలు పందిగా జన్మించాడు. అలా జరిగిన తరువాత ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వనకాలం రాగానే ఒక విద్వాంసునికి ఇచ్చి పెండ్లిచేశారు. పెండ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు.
చిన్నతనమందే ఆమెకు అష్టకష్టాలు రావడంతో ఆమె తల్లితండ్రులు, బంధువులు చాలా దు:ఖించారు. తండ్రి ఆమెకు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయో దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమెతో సాలగ్రామ దానం చేయించి 'నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వ జన్మ పాపము నశించుగాక' అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ధారపోయించాడు. ఆ రోజు కార్తీక సోమవారం కావడంతో ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించాడు. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యాలతో జీవించి, మరణానంతరం స్వరాగానికి వెళ్ళారు. మరి కొంతకాలానికి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా జన్మించి నిత్యం సాలగ్రామ దానం చేస్తూ ముక్తి పొందాడు. కావున ఓ జనకా! కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసినా దాని ఫలం ఎంతో ఘనమైంది. కాబట్టి నీవు కూడా ఆ సాలగ్రామ దానం చేయమని చెప్పను.
ద్వాదశాధ్యాయం పన్నెండో రోజు పారాయణం సమాప్తం.
Labels:
పండుగలు
కార్తీక పురాణం - 11
11వ అధ్యాయము
మంధరుడు - పురాణ మహిమ
ఓ జనక మాహారాజా! ఈ కార్తీక మాస వ్రత మహాత్మ్యం గురించి ఎన్ని ఉదాహరణలు చెప్పినా తనివితీరదు. ఈ మాసములో విష్ణువును అవిసెపూలతో పూజిస్తే చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణు పూజ తర్వాత పురాణపఠనం చేసినా, చేయించినా, విన్నా, వినిపించినా వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. దీనికొక ఇతిహాసము చెప్తాను. శ్రద్ధగా ఆలకించమమని వశిష్ఠులవారు ఇలా చెప్పసాగిరి.
పూర్వము కళింగ దేశమున మంధరుడను విప్రుడు ఉండేవాడు. అతను ఇతరుల ఇండ్లలో వంటలు చేస్తూ అక్కడే భోజనము చేస్తూ, మద్యపానీయాలకు అలవాటు పడ్డాడు. అంతే కాక తక్కువ జాతి వారితో స్నేహము వలన స్నాన, జప, దీపారాధన వంటి ఆచారాలను కూడా పాటించక దురాశాపరుడై ఉండెను. అతని భార్య మహా గుణవంతురాలు. శాంతిమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనా పతినే దైవముగా భావించి విసుక్కోక సకల ఉపచారాలను చేస్తూ, పతివ్రతా ధర్మమును పాటించసాగెను.
మంధరుడు ఇతరుల ఇండ్లలో వంటవానిగా పనిచేయుచున్ననూ, ఇల్లు గడవక చిన్న వ్యాపారాన్ని కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్టగడవక పోవడం వల్ల దొంగతనములు చేస్తూ, దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద ఉన్న డబ్బును, వస్తువులను అపహరించి జీవించసాగెను. ఒక రోజు ఓ బ్రాహ్మణుడు అడవిదారిన పోతున్నప్పుడు అతన్ని భయపెట్టి, కొట్టి అతని దగ్గరున్న డబ్బును లాక్కుంటున్నప్పుడు అక్కడికి మరొక కిరాతకుడు వచ్చి డబ్బును చూడగానే వారిద్దరినీ చంపి ఆ డబ్బును మూటగట్టుకునెను. అంతలో దగ్గరలో ఉన్న గుహనుండి పులి వొకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకున్ని చంపుటకు ప్రయత్నించగా కిరాతకుడు దానిని చంపెను. కానీ ఆ పులి కూడా అతనిపై పంజా విసరడం వల్ల ఆ దెబ్బలకు చనిపోయెను. ఈ విధంగా ఒకే కాలమున నలుగురూ నాలుగు విధాలుగా మరణించినారు. ఆ నలుగురూ యమలోకములో అనేక శిక్షలు అనుభవిస్తూ, రక్తము గ్రక్కుచూ బాధపడుచుండిరి.
మంధరుడు చనిపోయిన దగ్గర నుండి అతని భార్య నిత్యమూ హరినామస్మరణ చేస్తూ భర్తను తలచుకొని దు:ఖించుచూ కాలము గడుపుచుండెను. కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషి వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యాదులచే పూజించి 'స్వామీ! నేను దీనురాలను. నాకు భర్తగానీ, సంతతి గానీ లేరు. నేను సదా హరినామస్మరణ చేస్తూ జీవిస్తున్న దాన్ని. కాబట్టి నాకు మోక్షమార్గాన్ని ఉపదేశించమని ప్రార్థించెను.'
ఆమె వినయానికి, ఆచారానికి ఆ ఋషి సంతోషించి 'అమ్మా ఈ రోజు కార్తీక పౌర్ణమి. చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు వృధాగా పాడుచేసుకొనవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు. నేను నూనె తీసుకువస్తాను. నీవు ప్రమిదను, వత్తిని తీసుకుని రమ్మని చెప్పెను. దేవాలయములో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీవు పొందవచ్చని చెప్పగానే ఆమె సంతోషముతో వెంటనే దేవాలయానికి వెళ్ళి శుభ్రము చేసి, గోమమయముచే అలికి ముగ్గులు పెట్టి, తానే స్వయంగా రెండు వత్తులను చేసి, ఋషి తెచ్చిన నూనెను ప్రమిదలో పోసి దీపారాధన చేసింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారికల్లా ఆ రోజు రాత్రి ఆలయం దగ్గర జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను.
ఆమె కూడా ఆ రాత్రంతయూ పురాణము వినెను. ఆ రోజు నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచూ కొంతకాలానికి మరణించెను. ఆమె పుణ్యాత్మురాలు అగుటవల్ల విష్ణు దూతలు వచ్చి ఆమెను విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో కలిసి ఉండడం వల్ల కొంత దోషం వల్ల మార్గ మధ్యమమున యమలోకమునకు తీసుకొని పోయిరి. అక్కడ నరకమందు మరి ముగ్గురితో బాధపడుతున్న తన భర్తను చూసి 'ఓ విష్ణుదూతలారా! నా భర్తా, మరి ముగ్గురు నరకబాధలు అనుభవిస్తున్నారు. కాబట్టి నా యందు దయతలచి వారిని కాపడమని' వేడుకొనెను.
అంత విష్ణుదూతలు 'అమ్మా నీ భర్త బ్రాహ్మణుడైనప్పటికీ స్నాన, సంధ్యావందనాలు మాని పాపాత్ముడైనాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైననూ అతడు కూడా ధనాశచే స్నేహితుడ్ని చంపి డబ్బు కాజేసెను. ఇక మూడవవాడు పులి. నాల్గవ వాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై పుట్టినా అనేక అత్యాచారాలు చేసి, ద్వాదశి రోజున కూడా తైల లేపనము, మద్యమాంస భక్షణ చేసినాడు కావున పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురూ నరక బాధలు అనుభవిస్తున్నారని వారి చరిత్రలు చెప్పెను.'
అందుకామె చాలా విచారించి 'ఓ పుణ్యాత్ములారా! నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురుని కూడా రక్షించమని ప్రార్థించగా, అందుకు విష్ణు దూతలు అమ్మా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును పులికి, ప్రమిద ఫలమును కిరాతకునకు, పురాణము వినుట వలన కలిగిన ఫలము విప్రునకు, ధారపోసినచో నీ భర్తతో పాటు వారికీ మోక్షము కలుగుతుందని చెప్పగా ఆమె అలానే ధారపోసెను. ఆ నలుగురూ ఆమె దగ్గరకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి'. కాబట్టి 'ఓ రాజా! కార్తీక మాసములో పురాణము వినుట వలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలమును పొందవచ్చునో తెలుసుకున్నావు' కదా అంటూ వశిష్ఠులవారు ఇలా చెప్పసాగిరి.
ఏకదశాధ్యాయము పదకొండో రోజు పారాయణం సమాప్తం.
Labels:
పండుగలు
బజ్జీ మిర్చి ఫ్రై
కావలసిన పదార్థాలు :
బజ్జీ మిర్చీ - వంద గ్రాములు
శనగపిండి - వంద గ్రాములు
ఉల్లిపాయ -ఒకటి
జీలకర్ర - ఒక టీస్పన్
వామ - ఒక టీస్పన్.
ఉప్పు - తగినంత
కరివేపాకు - నాలుగు రెమ్మలు
కొత్తిమీర -చిన్న కట్ట
నూనె - వేయించడానికి సరిపడా
తయారు చేయువిధానం : ముందుగా బజ్జీ మిర్చి మిరపకాయలను కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. వాటిని మధ్యలోకి చీరి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలను, కొత్తిమీర, కరివేపాకులను సన్నగా కట్ చేసుకోవాలి. శనగపిండిని దోరగా వేయించి దానిలో ఉల్లి, కొత్తిమీర, కరివేపాకు తరుగు, నీళ్ళు పోస్తూ గట్టిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మధ్యకి చీరుకున్న బజ్జీ మిర్చి కాయల్లో కూరాలి. తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి కాగిన తర్వాత స్టఫ్ చేసిన మిరపకాయలను వేసి బజ్జీల్లాగో దోరగా వేయించుకోవాలి. ఇవి వేడి వేడి పప్పన్నంలోకి, విడిగా తిన్నా చాలా రుచిగా ఉంటాయి.ఇవి వేడి వేడిగా విడిగా తిన్నా, పప్పన్నంలోకి సైడ్ డిష్ గా తిన్నా చాలా రుచిగా ఉంటాయి.
Labels:
ఎంత రుచి రా
కార్తీక పురాణం - 10
10వ అద్యాయము
అజామిళుని పూర్వ జన్మ వృత్తాంతము
జనకుడు వశిష్ఠులవారితో మునిశ్రేష్ఠా! ఈ అజామిళుడు ఎవడు? పూర్వజన్మలో ఎట్టిపాపములు చేసియుండెను? ఇప్పుడీ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకువెళ్ళిన తర్వాత ఏమి జరిగెనో వివరించమని ప్రార్థించెను. అంత ఆ మునిశ్రేష్ఠుడు జనకమహారాజుతో ఇట్లు పలికెను.
జనకా! అజామిళునిని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకువెళ్ళిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు వద్దకు వెళ్ళి ప్రభూ! తమ ఆజ్ఞ ప్రకారం అజామిళుడుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అక్కడకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిళుడిని విమానమెక్కించుకొని వైకుంఠమునకు తీసుకొనిపోయిరి. మేము చేయునది లేక చాలా విచారిస్తూ వచ్చాము అని భయపడుతూ చెప్పిరి.
'ఔరా! ఎంత పని జరిగెను? ఎప్పుడూ ఇలా జరగలేదే? దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి యుండవచ్చును' అని యమధర్మరాజు తన దివ్యదృష్టితో అజామిళుని పూర్వ జన్మ వృత్తాంతమును తెలుసుకొని 'ఓహో! అదియా సంగతి! తన అవసాన కాలమున 'నారాయణా' అని వైకుంఠవాసుని నామస్మరణ చేసినందులకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి. తెలిసిగానీ, తెలియకగాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదరో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. గనుక, అజామిళునకు వైకుంఠ ప్రాప్తి కలిగను కదా!' అని అనుకొనెను.
అజామిళుడు పూర్వ జన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగానుండెను. అతడు అపురూపమైన అందం చేతను, సిరిసంపదల చేతను, బలము చేతను గర్విష్టియై, వ్యభిచారియై శివారాధన చేయక, శివాలయము యొక్క ధనమును అపహరించుచూ, శివాలయమలో ధూపదీప నైవేద్యాలను పెట్టక, దుష్టసహవాసములను చేస్తూ తిరుగుచుండెడివాడు. ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరుని కెదురుగా పాదములుంచి పరుండెడివాడు. ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో సంబంధము పెట్టుకొనెను. ఆమె కూడా అందమైనదగుటచే చేయునది లేక ఆమె భర్త చూచియూ, చూడనటుల ప్రవర్తించుచూ భిక్షాటనకై ఊరూరా తిరుగుతూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు.
ఒకనాడు పొరుగూరికి వెళ్ళి యాచన చేసి పెద్దమూటతో బియ్యము, కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి ఈ రోజు నేను ఎంతో అలసిపోయాను, నాకు ఈ రోజు ఆకలి ఎక్కువగా ఉన్నది. త్వరగా వంటచేసి పెట్టుము అని భార్యతో అనెను. అందులకామె చీదరించుకొనుచూ నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్ళు కూడా ఇవ్వక, అతని వంక కన్నెత్తైనను చూడక విటునిపై మనస్సు కలదై భర్తను తూలనాడడం వల్ల భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాదెను. అంత ఆమె భర్త నుండి చేతికర్రను లాక్కొని భర్తను రెండింతలుగా కొట్టి బైటకు తోసి తలుపులు మూసివేసెను. అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలచి దేశాటనకు వెళ్ళిపోయెను.
భర్త ఇంటినుండి వెళ్ళిపోయెను కదా అని సంతోషించిన ఆమె ఆ రాత్రి బాగా అలంకరించుకొని వీధి అరుగుపై కూర్చుని ఉండగా ఒక చాకలి వాడు ఆ దారిని పోవుచుండెను. అతనిని పిలిచి 'ఓయీ నీవీ రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు' రమ్మని కోరెను. అంత ఆ చాకలి 'తల్లీ! నీవు బ్రాహ్మణ పడతివి. నేను నీచకులస్తుడను. చాకలి వాడునూ. మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు. నేనిట్టి పాపపుపని చేయజాలను' అని బుద్ధి చెప్పి వెడలిపోయెను. ఆమె ఆ చాకలి వాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కలసి తన కామవాంచ తీర్చమని పరిపరివిధముల బ్రతిమాలి ఆ రాత్రంతయూ అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి 'అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టితిని? అగ్ని సాక్షికా పెండ్లాడిన భర్తను ఇంటినుండి వెడలగొట్టి, క్షణికమైన కామవాంఛలకు లోనై మహాపరాధము చేసితిని' అని పశ్చాత్తాపమొంది ఒక కూలివానిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసిందిగా పంపెను.
కొన్ని రోజులు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా అతనిపాదములపై బడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి ఆమె మంచి నడవడికవల్ల భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను. కొంత కాలమునకు ఏదియో వ్యాది సంక్రమించి దినదినమూ క్షీణించుట చేత మరణించెను. అతడు రౌరవాది నరక కూపమన పడి నానాబాధలు అనుభవించి మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై, కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసినందువలన ఏడు జన్మముల పాపములు నశించుటచేత అజామిళుడై పుట్టెను. ఇప్పటికి తన అవసాన కాలమున 'నారాయణా' అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠముకు పోయెను.
బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. ఆమె యమయాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాసి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. దాంతో మాలవాడా శిశువుని తీసుకొని పోయి అడవి యందు వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవుచూ పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామిళుడు ప్రేమించెను. అదీ వారి పూర్వజన్మ వృతాంతము అని తెలిపెను.
నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దానధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటివారైననూ మోక్షమును పొందగలరు. కాన కార్తీక మాసమందు వ్రతములు, పురాణశ్రవణములు చేసివారు ఇహ, పర సుఖములను పొందగలరు.
దశమాధ్యాయము పదవ రోజు పారాయణము సమాప్తము.
Labels:
పండుగలు
కార్తీక పురాణం - 9
9వ అధ్యాయం
విష్ణుదూతల, యమభటుల వివాదము
ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలం. వైకుంఠమునుండి వచ్చాము. మీ ప్రభువు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మన్నారో తెలిపమని ప్రశ్నించిరి.
దానికి బదులుగా యమదూతలు 'విష్ణుదూతలారా! మానవులు చేయు పాపపుణ్యాలను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనుంజయాది వాయువులు, రాత్రీ పగలూ, సంధ్యాకాలము సాక్షులుగా ప్రతిదినం మా ప్రభువు వద్దకు వచ్చి తెలుపుతారు. మా ప్రభువు వారి కార్యకలాపాలను చిత్రగుప్తునిచే తెలుసుకుని ఆ మానవుని చివరిదశలో మమ్ము పంపించి వారిని రప్పించెదరు. పాలులెటువంటివారో వినండి... వేదోక్త సదాచారములను వీడి, వేదశాస్త్రములను నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపాలను చేసినవారునూ, పరస్త్రీలను కామించినవారు, పరాన్నభుక్కులు, తల్లితండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని చీదరించుకునేవారు, జీవహింస చేయువారు, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను బాధించువారు, శిశుహత్య చేయువారు, శరణన్నవారిని సైతం బాధించేవారు, చేసిన మేలును మరచిపోయేవాడు, పెండిండ్లు, శుభకార్యాలు జరగనివ్వక అడ్డుతగిలే వారూ పాపాత్ములు. వారు మరణించగానే తన వద్దకు తీసుకువచ్చి దండించమని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. '
కాబట్టి అజామిళుడు బ్రాహ్మణుడై పుట్టి చెడు సావాసాలకు లోనై, కులభ్రష్టుడై జీవహింసలు చేస్తూ, కామాంధుడై వావి వరసలు లేని పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎలా తీసుకుపోదురు? అంటూ యమభటులు ప్రశ్నించిరి.
అంతట విష్ణుదూతలు 'ఓ యమకింకరులారా! మీరు ఎంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మాలు తెలియవు. ధర్మ సూక్ష్మాలు ఎటువంటివో చెప్తాను వినండి. మంచివారితో స్నేహము చేయువారు, తులసి మొక్కలను పెంచువారు, బావులు, చెరువులు త్రవ్వించువారు, శివ కేశవులను పూజించేవారు, సదా హరినామాన్ని కీర్తించువారు, మరణ కాలమందు 'నారాయణా' అని శ్రీహరిని గాని, 'శివ శివా' అని పరమేశ్వరుణ్ని గానీ తలచినచో తెలిసిగాని, తెలియకగాని మరే రూపమునగాని శ్రీహరి నామ స్మరణ చెవినబడిన వారు పుణ్యాత్ములు! కాబట్టి అజామిళుడు ఎంత పాపాత్ముడైనా మరణకాలమున 'నారాయణా' అని పలుకుచూ చనిపోయెను. కాబట్టి మేము వైకుంఠానికే తీసుకుని వెళ్తామని పలికెను.
అజామిళుడు విష్ణు, యమదూతల సంభాషణలు విని ఆశ్చర్యం పొంది 'ఓ విష్ణుదూతలారా! పుట్టిన నాటి నుండి చనిపోయేవరకూ నేను శ్రీమన్నారాయణుని పూజగాని, వ్రతములు గాని, ధర్మములు గానీ చేయలేదు. నవమాసములు మోసి కనిపెంచిన తల్లితండ్రులకు కూడా నమస్కారం చేయలేదు. వర్ణాశ్రమాలు విడిచి కులభ్రష్టుడనై, నీచకుల స్త్రీలతో సంసారము చేసి... నా కుమారునిపై ఉన్న ప్రేమతో 'నారాయణా' అని అన్నంత మాత్రమున నన్ను ఘోర నరక బాధలనుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోతున్నారు. ఆహా నేనెంతటి అదృష్టవంతుడ్ని. నా పూర్వ జన్మ సృకృతము. నా తల్లి తండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అంటూ సంతోషముగా విమానెక్కి వైకుంఠమునకు' వెళ్ళెను.
కాబట్టి ఓ జనక చక్రవర్తీ! తెలిసిగానీ, తెలియకగానీ నిప్పును తాకితే బొబ్బలెక్కి ఎంత బాధ కలిగించునో, అటులనే శ్రీహరిని తెలిసీ తెలియకో స్మరించినంతనే సకల పాపాలనుండి విముక్తి పొందుటయే కాక మోక్షాన్ని కూడా పొందుతాము. ఇది ముమ్మాటికీ నిజం.
తొమ్మిదవరోజు తొమ్మిదవ అధ్యాయం సమాప్తం.
Labels:
పండుగలు
కార్తీక పురాణం - 8
8వ అధ్యాయము
శ్రీ హరినామస్మరణ సర్వపలప్రదము
వశిష్ఠుడు చెప్పిన విషయాలను విని 'మహానుభావా! మీరు చెప్పిన ధర్మములను శ్రద్ధగా విన్నాను. అందు ధర్మము బహు చిన్నదైనా పుణ్యము అధికంగా కలుగుతుంది. అదీ నదీ స్నానము, దీపదానము, పండుదానం, అన్నదానం, వస్త్రదానము వలన కలుగుతుందని చెబుతున్నారు. ఇట్టి చిన్న చిన్న ధర్మములవలన మోక్షము లభిస్తుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు నిర్వహిస్తే గానీ పాపములు తొలగవని మీవంటి శ్రేష్టులే చెప్పెను కదా. మరి మీరు ఇది సూక్ష్మములో మోక్షముగా చెబుతున్నందుకు నాకు ఎంతో ఆశ్చర్యము కలుగుతుంది. దుర్మార్గులు కొందరు ఆచారాలను పాటించక, వర్ణ సంకరులై మహా పాపములను చేసివారు ఇంత తేలికగా మోక్షాన్ని పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిదికాదా! కావున దీని మర్మమును తెలిపమని కోరెను.'
వశిష్ఠులవారు చిరునవ్వు నవ్వి జనకమహారాజా! నీవు అడిగిన ప్రశ్న నిజమైనదే. నేను వేదవేదాంగములను కూడా పఠించాను. వానిలో కూడా సూక్ష్మమార్గాలున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అనే ధర్మాలు మూడు రకాలు. సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్యమను గుణము పుట్టి ఫలమంతయును పరమేశ్వరునికి అర్పించి, మనస్సునందు ధర్మాన్ని పాటించిన ఆ ధర్మము ఎంతో మేలు చేస్తుంది. సాత్విక ధర్మము సమస్త పాపాలను తొలగించి పవిత్రులను చేసి దేవలోక, భూలోక సుఖాలను సమకూర్చును.
ఉదాహరణకు తామ్రపర్ణి నది యందు స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు నీరు పడినచో ధగాధగా మెరిసి, ముత్యమగు విధంగా సాత్వికత వహించి, సాత్విక ధర్మాన్ని ఆచరించుచూ గంగా, యమునా, గోదావరి, కృష్ణానదుల పుష్కరాలు మొదలగున్న పుణ్యకాలాలలో దేవాలయాలలో వేదాలు పఠించి, సదాచారపరుడైన, గృహస్థుడైన బ్రాహ్మణునకు ఎంత చిన్న దానము చేసినా, లేక ఆ నదీ తీరమందున్న దేవాలయాలలో జపతపాదుల్ని చేసినా విశేష ఫలాన్ని పొందుతారు. రాజస ధర్మమమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త ధర్మాలను వీడి చేసిన ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలను కలిగిస్తుంది.
దేశకాల పాత్రములు సమకూడినప్పుడు తెలిసో, తెలియకో ఏ చిన్న ధర్మాన్ని చేసినా గొప్ప ఫలాన్ని ఇస్తుంది. అనగా పెద్ద కట్టెల గుట్టలో చిన్న మంట ఏర్పడినా మొత్తం భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామాన్ని తెలిసిగానీ, తెలియకగానీ తలచినచో వారి సకల పాపాలు పోయి ముక్తి పొందుతారు. దానికి ఓ చిన్న కధ కలదు.
అజామీళుని కథ
పూర్వ కాలంలో కన్యాకుబ్జమను నగరంలో నాలుగు వేదాలు చదివిన ఓ బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి ఎంతో గుణవంతురాలైన హేమవతి అనే భార్య కలదు. ఆ దంపతులు ఎంతో ఆదర్శంగా నిలిచి అపూర్వ దంపతులని పేరు పొందారు. వారికి చాలా కాలానికి లేకలేక ఓ కుమారుడు జన్మించాడు. వారు అతడిని ఎంతో గారాభంగా పెంచుతూ అజామీళుడని పేరు పెట్టారు. ఆ బాలుడు పెరుగుతూ అతి గారాభం వల్ల పెద్దల మాటను కూడా వినక, చెడు స్నేహాలు చేస్తూ, చదువును నిర్లక్ష్యము చేసి, బ్రాహ్మణ ధర్మాలను పాటించక తిరుగుచుండెను.
కొంతకాలానికి యవ్వనము రాగా కామాంధుడై, మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతమును వీడి, మద్యము తాగుచూ, ఒక ఎరుకల జాతి స్త్రీని మోహించి ఆమెతోనే కాపురం చేయుచుండెను. ఇంటికి కూడా పోకుండా ఆమె ఇంటనే భోజనం చేయుచుండెను. అతి గారాభం ఎలా చెడగొట్టిందో వింటివా రాజా! తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నా చిన్ననాటి నుండి సక్రమంగా పెంచకపోతే ఈ విధంగానే జరుగుతుంది. కాబట్టి అజామీళుడు కులాన్ని వీడడంతో అతని బంధువులు అతడిని విడిచి పెట్టారు.
అందుకు అజామీళుడు కోపంతో వేట వలన పక్షులను, జంతువులను చంపుచూ కిరాతక వృత్తిలో జీవిస్తున్నాడు. ఒకరోజున ఈ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుచూ కాయలను కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనె పట్టును తీసుకోబోతుండగా కొమ్మ విరగడంతో ఆమె చనిపోయింది. అజామీళుడు ఆ స్త్రీపై పడి కొంత సేపు ఏడ్చి, తరువాత అక్కడే ఆమెను దహనం చేసి ఇంటికి వెళ్ళెను. ఆ ఎరుకల దానికి అంతకుముందే ఓ కూతురు ఉంది. కొంత కాలానికి ఆ బాలిక పెరిగి పెద్దైనాక కామాంధకారముచే కన్ను మిన్ను కానక అజామీళుడు ఆ బాలికతో కాపురం చేయుచుండెను.
వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగారు. ఆ ఇద్దరు పుట్టగానే చనిపోయారు. మరల ఆమె గర్భము ధరించి ఒక కొడుకును కన్నది. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచూ ఒక్క క్షణమైనా విడువక, ఎక్కడికి వెళ్ళినా వెంట తీసుకుని వెళ్తూ, నారాయణ, నారాయణ అని ప్రేమతో పెంచుకుంటున్నారు. కాని నారాయణ అని తలచినంతనే ఎటువంటి పాపాలైనా తొలగి పుణ్యాన్ని పొందవచ్చని వారికి తెలియదు. ఇలా కొంత కాలము జరిగిన తర్వాత అజామీళుడు అనారోగ్యంతో మంచం పట్టి చావుకు సిద్ధంగా ఉండెను.
ఒకనాడు భయంకర రూపాలతో, పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైనారు. వారిని చూచి అజామిళుడు భయంతో కొడుకుపై ఉన్న ప్రేమతో నారాయణా, నారాయణా అంటూ ప్రాణాలను వదిలెను. అజామిళుని నోట నారాయణా అన్న మాట వినగానే యమ భటులు గజగజ వణకసాగిరి.
అదే సమయానికి దివ్యమంగళాకారులు, శంకచక్ర గదాధారులైన శ్రీమన్నారాయణుని భటులు కూడా విమానంలో అక్కడకు వచ్చారు. ఓ యమ భటులారా వీడు మావాడు. మేము ఇతన్ని వైకుంఠమునకు తీసుకువెళ్తాం అని చెప్తూ అజామిళుడుని విమానమెక్కించి తీసుకొని పోవడానికి సిద్ధమవ్వగా, యమదూతలు అయ్యా! మీరు ఎవరు? అతడు దుర్మార్గుడు. ఇతన్ని నరలోకానికి తీసుకువెళ్ళడానికి మేము వచ్చాము. కాబట్టి మాకు వదలమని కోరగా, విష్ణుదూతలు ఇలా చెప్పసాగెను.
ఎనిమిదో అధ్యాయం ఎనిమిదోరోజు పారాయణం సమాప్తం.
Labels:
పండుగలు
కార్తీక పురాణం - 7
7వ అధ్యాయము
శివకేశవార్చనా విధులు
వశిష్ఠులవారు జనకునకు ఇంకనూ ఇటుల బోధించిరి. 'ఓ రాజా! కార్తీకమాసము గురించి, దాని మహత్య్మము గురించి ఎంత చెప్పినా, వినిననూ తనివి తీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్రకలశములతో పూజించినవారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. తులసీ దళములతో గానీ బిల్వ పత్రములతో గానీ సహస్రనామ పూజ చేసినవారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసమునందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామముంచి భక్తితో పూజించినచో కలుగు మోక్షమింతింత కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వపాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు, దీపారాధనలు చేయలేని వారు ఉదమయున, సాయంకాలమున యే గుడికైననూ వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైననూ చేసినా వారి పాపములు నశించును.'
సంపత్తి గలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, దానధర్మములు చేసినచో అశ్వమేథ యాగము చేసినంత ఫలము దక్కుటయే గాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమునగాని, విష్ణాలయము నందుగాని జెండా ప్రతిష్టించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా, పెనుగాలికి ధూళిరాసులెగిరిపోయినట్లే కోటి పాములైననూ పటాపంచలైపోవును.
ఈ కార్తీక మాసములో తులసికోటవద్ద ఆవుపేడతో అలికి, వరి పిండితో శంఖు, చక్ర ఆకారములతో ముగ్గులు వేసి నువ్వులు, దాన్యము పోసి వాటిపై ప్రమిద నిండా నువ్వుల నూనె పోసి, వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నందా దీపమందురు. ఈ విధముగా చేసి, నైవేద్యము పెట్టి, కార్తీక పురాణమును చదినచో హరిహరాదులు సంతసించి కైవల్యమొసంగెదరు.
అటులనే కార్తీక మాసములో ఈశ్వరుడుని జిల్లేడు పూలతో అర్చించిన ఆరోగ్యం సిద్ధించును. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి, తులసీదళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనముండీ కార్తీక మాసమందు పూజాదులను చేయడో ఆ మానవడు మరు జన్మలో శునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము నెలరోజులూ పూజలు చేయలేనివారు ఒక్క సోమవారమైననూ చేసి శివకేశవులను పూజించినా మాస ఫలము కలుగును.
కనుక 'ఓ రాజా! నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము' అని వశిష్ఠులవారు చెప్పెను.
సప్తమాధ్యాయము ఏడవ రోజు పారాయణము సమాప్తము.
Labels:
పండుగలు
కార్తీక పురాణం - 6
6వ అధ్యాయము
దీపదాన మహాత్య్మం
ఓ రాజశ్రేష్ఠుడా! ఏ మానవుడు కార్తీక మాసము నెలరోజులూ పరమేశ్వరుడిని, శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించిన వారికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయూ దేవలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును.
దీపదానుము చేయుట యెట్లనగా పైడిప్రత్తి తానే స్వయముగా తీసి, శుభ్రపరచి, వత్తులు చేయవలెను. వరిపిండితో గానీ, గోధమపిండితో గాని ప్రమిద వలే చేయవలెను. ఆ ప్రమిదలో ఆవునేతితో తడిపిన వత్తులు వేసి, దీపమును వెలిగించి దానిని బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసమునందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి, బంగారముతో వత్తిని చేయించి, ఆవునెయ్యి నిండుగా పోసి రోజూ చేస్తున్న ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపమును వెలిగించి ఈనెల రోజులూ దానమిచ్చిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమివ్వాలి. ఇలా చేసిన యెడల సకలైశ్వర్యములు కలుగుటయేకాక మోక్షప్రాప్తి కూడా సిద్ధించును.
దీప దానము చేయువారు ఇట్లా వచింపవలెను.
శ్లో: సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ
అని స్తోత్రం చేసి దీపదానము చేయవలెను. దీని అర్థమేమనగా, అన్ని విధముల జ్ఞానం కలుగుజేయునదియు, సకల సంపదల నిచ్చునదియు అగు ఈ దీపదానమును చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక! అని అర్థము.
ఈ విధముగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తిలేని యెడల పదిమంది బ్రాహ్మణులకైననూ భోజనమిడి దక్షిణ తాంబూలములను ఇవ్వవలెను. ఈ విధముగా పురుషులు గానీ, స్త్రీలు గానీ, ఏ ఒక్కరు చేసినా సిరిసంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి కలిగి సంతోషముగా ఉందురు. దీని గురించి ఒక ఇతిహాసము కలదు. దానిని వివరించెదను ఆలకింపమని వశిష్టుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను.
లుబ్ద వితంతువు స్వర్గమున కేగుట
పూర్వకాలమున ద్రవిడ దేశమునందొక ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెళ్ళి అయిన కొద్ది కాలానికే భర్త చనిపోయెను. సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుతే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయుచూ, వారి ఇండ్లలోనే భుజించుచూ, యజమానులు సంతోషముతో ఇచ్చిన వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచూ ఆ విధముగా వచ్చిన సొమ్మును అధిక వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బు కూడబెట్టుకొనెను. దొంగలు తీసుకువచ్చిన దొంగ వస్తువులను తక్కువ ధరలకు కొని ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముచూ కూడా ధనమును కూడబెట్టుకొనుచుండెను. ఈ విధముగా కూడ బెట్టిన ధనమును వడ్డీలకిస్తూ, శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ, తన మాటలతో వారిని మంచిచేసుకొని జీవించుచుండెను.
ఎంత సంపాదించినా ఏమి? ఆమె ఒక్క రోజు కూడా ఉపవాసము గాని, దేవుడుని మనసారా ధ్యానించుట గాని చేసి యెరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థ యాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి, యే ఒక్క బిచ్చగానికీ పిడికెడు బియ్యము పెట్టక, తాను తినక ధనమును కూడబెట్టుచుండెడిది. అటుల కొంత కాలము జరిగెను.
ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీ రంగనాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గ మధ్యమున ఈ స్త్రీ యున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచిచెడ్డలను తెలుసుకొని, ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె వద్దకు వెళ్ళి 'అమ్మా! నా హితవచనము ఆలకింపుము. నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకించుము. మన శరీరములు శాశ్వతము కావు. నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు. పంచభూతములు, సప్తధావులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము, మాంసము కుళ్ళి, దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడి దురాలోచన.
తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడుత దానిని దినేద్దామని భ్రమించి, దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో బడి నశించుచున్నాడు. కాన, నా మాటలాలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా ఆర్జించిన ధనమును ఇప్పుడైనా పేదలకు దానధర్మము చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతి రోజూ శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాదికములు చేసి మొక్షమును పొందుము. నీ పాప పరిహారార్ధముగా, వచ్చే కార్తీక మాసమంతయూ ప్రాత:కాలమున నదీ స్నానమాచరించి, దానధర్మాలు చేసి, బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములను పొందగలవు' అని ఉపదేశమిచ్చెను.
ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దానధర్మములు చేయుచూ కార్తీక మాసం వ్రతం ఆచరించుటచే జన్మరాహిత్యమై మోక్షమును పొందెను. కావు కార్తీక మాస వ్రతములో అంత మహాత్మ్యం ఉన్నది.
షష్ఠాధ్యాయం ఆరవ రోజు పారాయణము సమాప్తము.
Labels:
పండుగలు
కార్తీక పురాణం - 5
5వ అధ్యాయము
వనభోజన మహిమ
ఓ జనకమహారాజా! కార్తీక మాసములో స్నాన దాన పూజానంతరము శివాలమునందు గాని, విష్ణ్వాలయము నందుగానీ శ్రీ భగవద్గీత గీతా పారాయణం తప్పక చేయవలయును. అట్లు చేసిన వారి స్వర పాపములు నివృత్తి అగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించినను వారికి విష్ణులోకము ప్రాప్తించును. కడకు అందలి శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థమొనరించిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరి కాయలతో నిండివున్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యధోచితముగా పూచింజి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరి చెట్టు నీడన భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టుకిందనే భోజనము పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించవలయును. వీలునుబట్టి పురాణ కాలక్షేపము చేయవలయును. ఈ విధముగా చేసిన బ్రాహ్మణపుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగెను అని వశిష్టులువారు చెప్పిరి.
అది విని జనకరాజు మునివర్యా! ఈ బ్రాహ్మణ యువకునికి నీచజన్మేల కలిగెను? దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా, వశిష్టులవారు ఈ విధముగా చెప్పనారంభించిరి.
రాజా! కావేరీ తీరమందొక చిన్న గ్రామమున దేశవర్మ అను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. అతని పేరు శివశర్మ. శివశర్మ చిన్నప్పటి నుండి భయభక్తులు లేక అతి గారాబముగా పెరుగుటవ వలన నీచసహవాసములు చేసి దురాచారపరుడై పెరుగుచుండెను. అతని దురాచారములను చూచి ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి, 'బిడ్డా! నీ దురాచారములకు అంతలేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుచూ నేను నలుగురిలో తిరగలేకపోవుచున్నాను. కాన, నీవు కార్తీక మాసమున నదిలో స్నానము చేసి, శివ కేశవులను స్మరించి, సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన యెడల, నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. కాన నీవు అటుల చేయుము' అని బోధించెను.
అంతట కుమారుడు 'తండ్రీ! స్నానము చేయుట ఒంటి మురికి పోవటకే కానీ వేరు కాదు! స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా! దేవాలయములో దీపము వెలిగించిన లాభమేమి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా?' అని వ్యతిరేకార్థముతో పెడసరిగా సమాధానమిచ్చెను.
కుమారుని సమాధానము వుని తండ్రి 'ఓరి నీచుడా! కార్తీక ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన, నీవు అడవిలో రావి చెట్టు తొఱ్ఱయందు ఎలుక రూపములో బ్రతికెదువు గాక' అని కుమారునిని శపించెను.
ఆ శాపముతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై, భయపడి తండ్రి పాదములపై పడి 'తండ్రీ! క్షమింపుము. అజ్ఞానాందకారములో పడి దైవమును, దైవకార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహించలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకు శాపవిమోచనము ఎపుడు, ఏ విధంగా కలుగునో తెలుపుమని' ప్రాధేయపడెను.
అంతట తండ్రి 'బిడ్డా! నా శాపమును అనుభవించుచూ మూషికమువై పడివుండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహ స్థితి కలిగి ముక్తినొందుదువు' అని కుమారుడిని ఊరడించెను.
వెంటనే శివశర్మ ఎలుక రూపమును పొంది అడవికిపోయి, ఒక చెట్టు తొఱ్ఱలో నివసించుచూ, ఫలములను తినుచూ జీవించుచుండెను. ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున ఉండుటచే స్నానార్థమైన నదికి వెళ్ళువారు ఆ పెద్ద వటవృక్షము నీడన కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనుచూ నదికి వెళ్ళుచుండెడివారు.
ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసములో ఒక రోజున మహర్షియగు విశ్వామిత్రులవారు శిష్యసమేతముగా కావేరీ నదీ స్నానార్థం బయలుదేరి ప్రయాణ బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షము క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వినిపించుచుండిరి. ఈ లోగా చెట్టు తొఱ్ఱలో నివసించుచున్న మూషికము తినేందుకు ఏమైనా వస్తువు దొరుకుతుందేమోనని బైటకు వచ్చి చెట్టు మొదట నక్కి యుండెను.
అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని వీరు బాటసారులై ఉందురు. వీరివద్ద ఉన్న ధనము, అపహరించవచ్చుననే తలంపుతో వారి వద్దకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనసు మారిపోయినది. వారికి నమస్కరించి 'మహానుభావులారా! తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శనముతో నా మనస్సుకు చెప్పరాని ఆనందము కలుగుచున్నది గాన, వివరింపుడు' అని ప్రాధేయపడెను.
అంత విశ్వామిత్రులవారు 'ఓయీ కిరాతకమా! మేము కావేరీ నదీ స్నానముకై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణము పఠించుచున్నాము. నీవును ఇచట కూర్చుని శ్రద్ధగా వినమని' చెప్పిరి.
అటుల కిరాతకుడు కార్తీకమహత్యమును శ్రద్ధగా వినుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతము గుర్తుకు వచ్చినది. పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను.
అటులనే ఆహారమునకై చెట్టు మొదల దాగివుండి పురాణమంతయూ విన్న ఎలుకకు కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపముపొంది 'మునివర్యా! ధన్యోస్మి. తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని' అని తన వృత్తాంతమంతయూ చెప్పి వెడలిపోయెను.
కనుక ఓ జనకా! ఇహములో సిరిసంపదలు, పరలోకమున మోక్షము కోరు వారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి, ఇతరులకు వినిపించవలయును.
పంచమాధ్యాయం ఐదవ రోజు పారాయణము సమాప్తము.
Labels:
పండుగలు
Sudhakar Yarasu
May your marriage be Blessed with
Love, joy And companionship
For all the years of your lives !!!
Happy Anniversary
Labels:
శుభాకాంక్షలు
TABU
పరిచయం....
టబు బాలీవుడ్ నటి . హిందీ లోనే కాకుండా ... తమిళ్, తెలుగు , మలయాళం , బెంగాలీ భాషలలో నటించారు . ఒక అమెరికన్ ఇంగ్లీష్ ఫిలింలో కూడా నటించారు.
ప్రొఫైల్....
* పేరు : టబు పూర్తిపేరు 'తబస్సుమ్ హాష్మి'
* పుట్టిన తేది : 04 నవంబర్ 1970,
* పుట్టిన ఊరు : హైదరాబాదు లో పుట్టి ముంబై లో స్థరపడిన సినిమా నటి.
* తండ్రి : జమాల్ హష్మి ,
* తల్లి : రిజవాన -స్కూల్ టీచర్ ,- టబు పుట్టిన తరువాత తన తల్లి దండ్రులు విడిపోయారు .
* తోబుట్టువు : నటి ఫరాహ్ చెల్లెలు, మరియు నటి సభాన అజ్మి కి మేనకోడలు (నైస్)
కెరీర్....
* నటి దివ్యభారతి యొక్క స్నేహితురాలు. దివ్యభారతి ద్వారా దర్శకుడు రాఘవేంద్రరావుకు పరిచయం కాబడి తద్వారా కూలీ నెంబర్ వన్ చిత్రంతో తెలుగుతెరపై తెరంగేట్రం చేసింది. మొదటిగా 15 సం. వయసు లో " Hum Naujawan(1985) లో దేవానంద్ కూతురు గా నటించారు .,
టాబు నటించిన తెలుగు చిత్రాలు
* కూలీ నంబర్ 1
* నిన్నే పెళ్లాడుతా
* ఆవిడా మా ఆవిడే
* సిసింద్రీ (ప్రత్యేక నృత్యం)
* పలనాటి బ్రహ్మనాయుడు
* అందరివాడు
* ఇదీ సంగతి
* పాండురంగడు
Labels:
సినిమా
నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్
నువ్వంటే ప్రాణమనీ, నీతోనే లోకమనీ,
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకనీ,
ఎవరికీ చెప్పుకోను నాకు తప్ప,
కన్నులకి కలలు లేవు నీరు తప్ప.
మనసూ వుంది, మమతా వుంది,
పంచుకునే నువ్వు తప్ప,
ఉపిరి వుంది, ఆయువు వుంది,
వుండాలనే ఆశ తప్ప.
ప్రేమంటే శాశ్వత విరహం అంతేనా,
ప్రేమిస్తే సుదీర్గ నరకం నిజమేనా.
ఎవరిని అడగాలి నన్ను తప్ప,
చివరికి ఏమవ్వాలి మన్ను తప్పా.
వేంటోస్థానన్నావు వెళ్లోస్తనన్నావు,
జంటై ఒకరి పంటై వెళ్లావు.
కరునిస్తానన్నావు, వరమిస్తానన్నావు,
బరువై మెడకు వురివై పోయావు.
దేవత లోను ద్రోహం వుందని తెలిపావు,
దీపం కూడా దహియిస్తుందని తేల్చావు.
ఎవరిని నమ్మాలి నన్ను తప్ప,
ఎవరిని నిందిచాలి నిన్ను తప్ప.
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకనీ,
ఎవరికీ చెప్పుకోను నాకు తప్ప,
కన్నులకి కలలు లేవు నీరు తప్ప.
మనసూ వుంది, మమతా వుంది,
పంచుకునే నువ్వు తప్ప,
ఉపిరి వుంది, ఆయువు వుంది,
వుండాలనే ఆశ తప్ప.
ప్రేమంటే శాశ్వత విరహం అంతేనా,
ప్రేమిస్తే సుదీర్గ నరకం నిజమేనా.
ఎవరిని అడగాలి నన్ను తప్ప,
చివరికి ఏమవ్వాలి మన్ను తప్పా.
వేంటోస్థానన్నావు వెళ్లోస్తనన్నావు,
జంటై ఒకరి పంటై వెళ్లావు.
కరునిస్తానన్నావు, వరమిస్తానన్నావు,
బరువై మెడకు వురివై పోయావు.
దేవత లోను ద్రోహం వుందని తెలిపావు,
దీపం కూడా దహియిస్తుందని తేల్చావు.
ఎవరిని నమ్మాలి నన్ను తప్ప,
ఎవరిని నిందిచాలి నిన్ను తప్ప.
Labels:
Lyrics
నవరతాన్ కుర్మా
కలిఫ్లోవేర్-1౦౦గ్రమ్స్,
కార్రోట్-1౦౦గ్రమ్స్,
బఠాణీ-1౦౦గ్రమ్స్,
బీన్సు-100గ్రమ్స్,
ఆలు-౧౦౦గ్రమ్స్,
క్యాప్సికం-1౦౦గ్రమ్స్.
ఉల్లిపాయలు ఉడికించినవి కానీ లేక పచ్చివికని ఈవిధంగనిన కానీ మిక్సీలో పేస్టు చేయవలెను.
జీడిపప్పు-౩౦గ్రమ్స్ తెసుకొని పేస్టు చేయవలెను.
పచ్చ్చిమిర్చి చిన్న తరుగు సరిపడా తెసుకోవలెను.
కర్బుజ గింజలు(పినపిల్),గసగసాలు కలిపి పేస్టు చేసి పెట్టుకోండి.
పిన
చెప్పిన వేగితబ్లేస్లో కలిఫ్లోవేర్,కార్రోట్,బఠాణీ,బీన్సు,ఆలు అన్నికొంచెం ఉడికించి చల్లని
waterlo కొంచెం సేపు ఉంచి పక్కనకి తెసుకోవాలి,freshga ఉండటం కోసం waterloలోకి తీసుకుంటాం
. -ముందుగ ఆయిల్-75ml బాణలిలో తెసుకోండి.
తరువాత ముందుగ పెట్టిఉంచుకున్నఉల్లిపాయలు పేస్టు oillo వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చి స్మెల్ పోయేంతవరకు తరువాత
అల్లం,వెల్లుల్లి పేస్టు వన్ స్పూన్ వేసి ఇంకా కొంచెం ఫ్రై చేసి తరువాత జీడిపప్పు పేస్టు కొంచెం ఫ్రై చేసి , కర్బుజ గింజలు(పినపిల్),గసగసాలు పేస్టు కొంచెం ఫ్రై చేసి, ఫ్రై చేసేకొద్దీ ఆయిల్ కొంచెం కొంచెం పిన కనిపిస్తూ ఉంటుంది అంత ఫ్రై అయినాక,క్యాప్సికం పచ్చిది ముక్కలుగా కట్చేసి బాణలిలో వేసి కలిపి తగినంత నిరు పోసి మూత పెట్టాలి 5-10 నిముషాలు ముతపెత్తవలెను.తరువాత
ఉప్పు తగినంత,కరం కోసం తెల్ల మిరియాల పౌడర్,ఫ్రెష్ క్రీం,చల్లటి నేతిలో ఉంచిన vegitables వేసి కలిపి తగినంత నిరు పోసి మూత పెట్టాలి. అంత అయినాక కిస్మిస్,కొత్చిమెర,చేర్రీస్ వేసి గార్నిష్ చేసుకుంటే రుచిగా ఉండే నవరతాన్ కుర్మా రెడీ
.
కార్రోట్-1౦౦గ్రమ్స్,
బఠాణీ-1౦౦గ్రమ్స్,
బీన్సు-100గ్రమ్స్,
ఆలు-౧౦౦గ్రమ్స్,
క్యాప్సికం-1౦౦గ్రమ్స్.
ఉల్లిపాయలు ఉడికించినవి కానీ లేక పచ్చివికని ఈవిధంగనిన కానీ మిక్సీలో పేస్టు చేయవలెను.
జీడిపప్పు-౩౦గ్రమ్స్ తెసుకొని పేస్టు చేయవలెను.
పచ్చ్చిమిర్చి చిన్న తరుగు సరిపడా తెసుకోవలెను.
కర్బుజ గింజలు(పినపిల్),గసగసాలు కలిపి పేస్టు చేసి పెట్టుకోండి.
పిన
చెప్పిన వేగితబ్లేస్లో కలిఫ్లోవేర్,కార్రోట్,బఠాణీ,బీన్సు,ఆలు అన్నికొంచెం ఉడికించి చల్లని
waterlo కొంచెం సేపు ఉంచి పక్కనకి తెసుకోవాలి,freshga ఉండటం కోసం waterloలోకి తీసుకుంటాం
. -ముందుగ ఆయిల్-75ml బాణలిలో తెసుకోండి.
తరువాత ముందుగ పెట్టిఉంచుకున్నఉల్లిపాయలు పేస్టు oillo వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చి స్మెల్ పోయేంతవరకు తరువాత
అల్లం,వెల్లుల్లి పేస్టు వన్ స్పూన్ వేసి ఇంకా కొంచెం ఫ్రై చేసి తరువాత జీడిపప్పు పేస్టు కొంచెం ఫ్రై చేసి , కర్బుజ గింజలు(పినపిల్),గసగసాలు పేస్టు కొంచెం ఫ్రై చేసి, ఫ్రై చేసేకొద్దీ ఆయిల్ కొంచెం కొంచెం పిన కనిపిస్తూ ఉంటుంది అంత ఫ్రై అయినాక,క్యాప్సికం పచ్చిది ముక్కలుగా కట్చేసి బాణలిలో వేసి కలిపి తగినంత నిరు పోసి మూత పెట్టాలి 5-10 నిముషాలు ముతపెత్తవలెను.తరువాత
ఉప్పు తగినంత,కరం కోసం తెల్ల మిరియాల పౌడర్,ఫ్రెష్ క్రీం,చల్లటి నేతిలో ఉంచిన vegitables వేసి కలిపి తగినంత నిరు పోసి మూత పెట్టాలి. అంత అయినాక కిస్మిస్,కొత్చిమెర,చేర్రీస్ వేసి గార్నిష్ చేసుకుంటే రుచిగా ఉండే నవరతాన్ కుర్మా రెడీ
.
కార్తీక పురాణం - 4
4వ అధ్యాయం
దీపారాధనా మహిమ
ఈ విధముగా వశిష్టుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా జనకుడు 'మహాతపస్వీ! తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివితీరకున్నది. కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయవలెనో, ఎవరినుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడూ అని కోరగా, వశిష్టులవారు ఇట్లు
చెప్పదొడగిరి.
జనకా! కార్తీక మాసమునందు సర్వ సత్కారములు చేయవచ్చును. దీపారాధనము అందు అతి ముఖ్యము. దీని వలన మిగులు ఫలమునొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్ధము శివాలయమున కానీ, విష్ణాలయమునందు కానీ దీపారాధనము చేయవచ్చును. సూర్యాస్తమయమందు, అనగా, సంధ్య చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధిని కానీ, ప్రాకారమునందు కానీ
దీపం ఉంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠప్రాప్తినొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ, ఏదీ దొరకనప్పుడు ఆముదముతో కానీ దీపమును వెలిగించి వుంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగా అగుటయే గాక అష్టైశ్వర్యములు కలిగి శివసన్నిధి కేగుదురు. ఇందుకొక కథ కలదు, వినుము.
శతృజిత్కథ
పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి, తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్టతో తపమాచరించుచుండగా నచ్చటకు పిప్పలాదుడను ముని పుంగవుడొచ్చి 'పాంచాల రాజా! నీవు ఎందులకింతటి తపమాచరించుచున్నావు? నీ కోరికయేమి?' అని ప్రశ్నించగా, 'ఋషి పుంగవా! నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపదలు వున్ననూ, నా వంశము నిలుచుటకు పుత్రసంతానము లేక, కృంగి, కృశించి యీ తీర్థ స్థానమున తపమాచరించుచున్నానూ అని చెప్పెను. అంత మునిపుంగవుడు 'ఓయీ! కార్తీక మాసాన శివసన్నిధిన శివ దేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన యెడల నీ కోరిక నెరవేర గలదూ అని చెప్పి వెడలిపోయెను.
వెంటనే పాంచాల రాజు తమ దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తికై అతి భక్తితో కార్తీక మాసము నెలరోజులూ శివాలయమున కార్తీక దీపారాధన చేయించి, దానధర్మాలతో నియమానుసారముగా, వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచూ, విడువకుండా నెలదినములు అటుల చేసెను. తత్పుణ్యకార్యము వలన నా రాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కనెను. రాజ కుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సావం చేయించి, బ్రాహ్మణులకు దానధరమములు జేసి, ఆ బాలునకు 'శతృజిత్తూ అని నామకరణం చేయించి అమిత గారాబముతో పెంచుచుండిరి.
కార్తీకమాస దీపారాధన వలన పుత్రసంతానము కలిగినందువలన తమ దేశమంతటను ప్రతి సంవత్సరం కార్తీకమాస వ్రతములు, దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాకుమారుడు శతృజిత్తు దినదిన ప్రవర్ధమానుడగుచూ సకల శాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తి సాము మొదలుగునవి నేర్చుకొనెను. కాని, యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను, తల్లిదండ్రుల గారాబము చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచూ, ఎదిరించిన వారిని దండించుచూ, తన కామవాంఛ తీర్చుకొనుచుండెను.
తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుడని చూసీచూడనట్లు, వినీవిననట్టు ఉండిరి. శతృజిత్తు ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డుజెప్పు వారను నరుకుదునని కత్తిపట్టుకొని ప్రజలను భయకంపితులను జేయుచుండెను. అటుల తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య. మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధునికైననూ శక్యము గాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మ వలె నిశ్చేస్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామ వాంఛ తెలియజేసెను. ఆమె కూడా ఆతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడచి అతని చేయి బట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని బోయి భోగములను అనుబవించెను.
ఇట్లొకరికొకరు ప్రేమపరవశులగుట చేత వారు ప్రతి దినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచూ తమ కామ వాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటుల కొంతకాలము జరిగెను. ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి, పసిగట్టి భార్యను, రాజకుమారుని ఒకేసారి చంపవలెనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను.
ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురును శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకొని, ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటులనో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరునూ గుడిలో కలుసుకొని గాఢాలింగనమొనర్చుకొను సమయమున చీకటిగా ఉన్నది దీపముండిన బాగుండును గదా, అని రాజకుమారుడనగా, ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిరువురూ మాహానందముతో రతిక్రీడలు సలుపుటకు వుద్యుక్తులగుచుండగా, అదే అదునుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను, ఆ రాజకుమారుడిని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను.
వారి పుణ్యము కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి, సోమవారమగుటవలన, ఆ రోజు ముగ్గురునూ చనిపోవుట వలనను శివదూతలు ప్రేమికులనిరువురినీ తీసుకొనిపోవుటకును, యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడికి వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు 'ఓ దూతలారా! నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరేల వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేల? విచిత్రముగా వున్నదే!' అని ప్రశ్నించేను.
అంత యమకింకరులు 'ఓ బాపడా! వారెంతటి నీచులైననూ, ఈ పవిత్రదినమున, అనగా, కార్తీక పౌర్ణమి, సోమవారపు దినమున, తెలిసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిని దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నియూ నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారూ అని చెప్పగా యీ సంభాషణంతయు వినుచున్న రాజ కుమారుడు 'అలా ఎన్నటికినీ జరుగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురమునూ ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించితిమి. కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే' అని, తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రహ్మణునికి దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానమెక్కించి శివసాన్నిధ్యమునకు జేర్చిరి.
వింటివా రాజా! శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపము పోవుటయే గాక, కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన, కార్తీక మాసములో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్యమొందుదురు.
చతుర్థాధ్యాయం నాలుగవ రోజు పారాయణము సమాప్తం
Labels:
పండుగలు
కార్తీక పురాణం - 3
3వ అధ్యాయం
కార్తీక స్నాన మహిమ
జనకమహారాజా! కార్తీక మాసమున యే ఒక్క చిన్న దానము చేసిననూ, అది గొప్ప ప్రభావము కలది. అట్టి వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే గాక మరణానంతరము శివసాన్నిధ్యమును చేరుదురు. కాని, కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడువలేక, కార్తీక స్నానములు చేయక, అవినీతిపరులై, భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలను పొందుదురు. అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునయినను స్నాన, దాన, జపతపాదులు చేయకపోవుటవలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసము ఒకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము.
బ్రహ్మ రాక్షసులకి ముక్తి కలుగుట
ఈ భరత ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహావిద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు 'తత్వనిష్టుడూ అను బ్రాహ్మణుడొకడుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఓ మహా వటవృక్షంపై భయంకరమైన ముఖముతోను, దీర్ఘ కేశములతోనూ, బలిష్టములైన కోరలతోను, నల్లని బానపొట్టల తోనూ, చూచు వారికి అతి భయంకర రూపాలతో ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివసించుచూ, ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి, వారిని భక్షించుచూ ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి.
తీర్థ యాత్రకై బయలుదేరి, అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతనిని చంపబోవు సమయమున, బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములు జూచి, గజగజ వణుకుచూ యేమియు తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచూ 'ప్రభో! ఆర్తత్రాణ పరాయణ! అనాధ రక్షక! ఆపదలోనున్న గజేంద్రుని రక్షించిన విధము గానే యీ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి!' అని వేడుకొనెను.
ఆ ప్రార్ధనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయము కలిగి 'మహానుభావా! మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారయణ స్తుతి విని మాకు జ్ఞానోదయము కలిగింది. మహానుభావ! మమ్ము రక్షింపుడూ అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యము తెచ్చుకొని, 'ఓయీ! మీరెవరు? ఎందులకు మీకు రాక్షస రూపంబులు కలిగెను? మీ వృత్తాంతము తెలుపుడూ అని పలుకగా, వారు 'విప్ర పుంగవా! మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్ఠాపరులు, మీ దర్శనభాగ్యము వలన మాకు పూర్వజన్మమందలి జ్ఞానము కొంత కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపదా కలుగదూ అని అభయమిచ్చినవి.
అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను.
నాది ద్రవిడదేశము. బ్రాహ్మణుడను. నేను మహా పండితుడనని గర్వముగల వాడినైయుంటిని. న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలే ప్రవర్తించితిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్థుల వద్ద, దౌర్జన్యముగా ధనము లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యా, పుత్రాదులను సుఖపెట్టక, పండితుల నవమానపరుచుచూ, లుబ్ధుడనై లోకకంటకునిగా నుంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్ధ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను.
వచ్చిన పండితుని నేను దూషించి, కొట్టి అతని వద్ద నున్న ధనమును, వస్తువులను తీసుకొని యింటి నుండి గెంటివైచితిని. అందులకా విప్రునకు కోపమొచ్చి 'ఓరీ నీచుడా! అన్యాక్రంతముగా డబ్బు కూడబెట్టినది చాలక, మంచి చెడ్డాలు తెలియక, తోటి బ్రాహ్మణుడనని కూడా ఆలోచించక కొట్టి, తిట్టీ వస్తుసామగ్రిని దోచుకుంటివి గాన, నీవు రాక్షసుడవై నర భక్షకునిగా నిర్మానుష్య ప్రదేశంలో నుందువు గాకా అని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకొనవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా! కాన నా అపరాధమును క్షమింపుమని వానిని ప్రార్థించితిని. అందులకాతడు దయతలచి 'ఓయీ! గోదావరి క్షేత్రమందొక వట వృక్షము కలదు. నీవందు నివసించుచూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి, పుణ్యఫలమును సంపాదించి యుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నొందుదువు గాకా అని వెడలిపోయెను. ఆనాటి నుండి నేనీ రాక్షసరూపమున నరభక్షణము చేయుచుంటిని. కాన, ఓ విప్రోత్తమా! నన్ను, నా కుటుంబము వారను రక్షింపు డని మొదట రాక్షసుడు తన వృత్తాంతమును జెప్పెను.
ఇక రెండవ రాక్షసుడు, 'ఓ ద్విజోత్తమా! నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేనూ నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి, వారికి తిండి పెట్టక మాడ్చి అన్నమో రామచంద్రా అనునటుల చేసి, వారి ఎదుటనే నా భార్యబిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించుచుండెడివాడిని. నేను ఎట్టి దాన, ధర్మములను చేసి యెరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలే ప్రవర్తించితిని. కాన నాకీ రాక్షసత్వము కలిగినది అని చెప్పెను.
మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటుల తెలియజేసెను. 'మహాశయా! నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణ్వాలయంలో అర్చకునిగా వుంటిని. స్నానమైనను చేయక, కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండెడి వాడిని. భగవంతునికి ధూప, దీప, నైవేద్యములు అర్పించక, భక్తులు కొని దెచ్చిన సంభారములను నా ఉంపుడుగత్తెకు అందజేయుచూ మద్య, మాంసములను సేవించుచూ, పాపకార్యాలు చేసినందున, నా మరణాంతరమున ఈ రూపము ధరించితిని. కావున నన్ను కూడా పాప విముక్తుని కావింపుమని ప్రార్థించెను.
ఓ జనక మహారాజా! తపోనిష్ఠుడగు ఆ విప్రుడు రాక్షసుల దీనాలాపములాలకించి, 'ఓ బ్రహ్మరాక్షసులారా! భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకీ రూపము కలిగెను. నా వెంట రండు. మీకు విముక్తిని కలిగింతునూ అని వారినోదార్చి తనతో గొని పోయి ఆ ముగ్గురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని, తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి, స్నాన పుణ్యఫలమునా ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు ధారపోయగా, వారివారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకేగిరి.
కార్తీక మాసమున గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తినొంది, వారికి సకలైశ్వర్యములను ప్రసాదింతురు. అందువలన, ప్రయత్నించి అయినా సరే కార్తీకస్నానాలనాచరించాలి.
తృతీయాధ్యాయం మూడవ రోజు పారాయణము సమాప్తము
Labels:
పండుగలు
కరుణిస్తావో మరి కాటేస్తావో. . .
ఎదురుగ వచ్చావని పొంగిపోయి కళ్లు తెరచినవేళ
కళ్లముందు నిలిచింది స్వప్నమని తెలిసి మనసు చిన్నబోయింది
చెవులను సోకిన అడుగుల సవ్వడి నిదేనని తలచి వెనుదిరిగి చూసినవేళ
రాలిన ఆకులు చేసిన సవ్వడని తెలిసి హృదయం కలుక్కుమంది
ఎవరి స్వరం విన్నా అది నీదేనేమోనని మదికి తోచినవేళ
కాదని తెలిసి ఊరుకోమని చెబుతుంటే మది సైతం మొరాయిస్తోంది
కరుగుతున్న మంచులా కాలం కరిగిపోతున్నా నీకూ నాకూ మధ్య దూరం మాత్రం ఎందుకో నిత్యం పెరుగుతూనే ఉంది
ఎన్నాళ్లీ ఎదురుచూపులంటూ మనసు నిత్యం రోదిస్తుంటే... దానికేం చెప్పాలో తెలియక హృదయం తల్లడిల్లుతోంది.
కరుణించినా... కాదంటూ నన్ను కాటేసినా నీకోసం సాగిస్తున్న ఈ నిరీక్షణ మాత్రం ఆగిపోదు సుమా !!!
Labels:
చెలీ
స్లిమ్ బ్యూటీస్..
సన్నగా కనబడడానికి చాలామంది టీనేజ్ మహిళలు పడరాని పాట్లు పడుతున్నారు. జిమ్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బ్యూటీషియన్లకు వేలకు వేలు సమర్పించుకుంటున్నారు. ఇన్ని తిప్పలు పడినా ఫలితం ఆవగింజలో అరభాగం కూడా వుండడంలేదు. వీరి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.
స్లిమ్‌గా మారేందుకు రోజుల తరబడి కడుపు మాడ్చుకోవడం వలన జీర్ణక్రియ దెబ్బతింటుంది. దీని ప్రభావం కండరాల మీద పడుతుంది. చిన్న వయసులోనే కీళ్ళనొప్పులు, ఎక్కువ దూరం నడవలేకపోవడం వంటివి బాధిస్తాయి.
శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా తమ పని తాము చేసుకుపోవాలంటే అందుకు అవసరమైన ఆహారం తీసుకోవడం తప్పనిసరి. రోజంతా చురుకుగా పనిచేయాలంటే కేలరీలు తప్పనిసరి. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే కేలరీలు పొందడం సాధ్యమవుతుంది. కొన్ని రోజుల పాటు ఉపవాసాలు చేసి, ఆ తరువాత కేలరీల వినియోగం గణనీయంగా తగ్గిపోతుంది. కేలరీలు వినియోగం తగ్గినప్పుడు కొవ్వు వచ్చి చేరుతుంది.
ఎక్కువ తింటున్నాం కాబట్టి ఎక్కువసేపు వ్యాయామం చేయాలనుకోవటం పొరబాటని నిపుణులు అంటున్నారు. కొద్దిపాటి వ్యాయామాలతో అందంగా ఆరోగ్యంగా వుండడం సాధ్యమవుతుంది. కింద సూచించిన విధంగా మీ ఆహారపు అలవాట్లని మార్చుకున్నట్లయితే అందాన్ని పదికాలల పాటు కాపాడుకోవచ్చు.
ప్రతి మూడు లేదా నాలుగు గంటలకొకసారి ఆహారం తీసుకుంటూ వుండాలి (నిద్రపోయే సమయంలో తప్ప). కడుపును ఖాళీగా వుంచితే గ్యాస్ చేరే అవకాశం వుంది. కాబట్టి మూడు నాలుగు గంటలకు మించి కడుపును ఖాళీగా వుంచుకోకండి.
ఆహారంలో ఎక్కువ భాగం గింజలు వుండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. తీసుకొనే ఆహారాన్నే మూడు లేదా నాలుగు భాగాలుగా విభజించుకోవాలి.
ప్రొటీన్లు తీసుకోవడం తప్పనిసరి, ప్రొటీన్లు మిమ్మల్ని ఉత్సాహంగా, ఉల్లాసంగా వుంచుతాయి. గంటల తరబడి పనిచేసినా నీరసం రాకుండా ప్రొటీన్లు కాపాడతాయి.
తృణధాన్యాలు తీసుకొనేటప్పుడు ఫైబర్ అధికంగా వున్నవాటినే తీసుకోవాలి. దీనితోబాటు చక్కెర తక్కువ వున్నవాటినే ఎంపిక చేసుకోవాలి.
రోజుకు కనీసం ఐదు రకాల పండ్లన్నా తీసుకోవాలి. తాజా పండ్లు కూరగాయలలో విటమిన్లు, ఫైబర్ అధికంగా లభిస్తాయి.
60 నుంచి 70 శాతం ఆహారం తీసుకొని మిగతా 30 నుంచి 40 శాతం నీటిని తాగాలి. అంటే రోజుకి 12 గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి.
బేకరీ ఉత్పత్తులకు పూర్తిగా దూరం కాకుండా తీసుకొనే పరిమాణాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది. బేకరీ ఉత్పత్తులతో పాటు పళ్ళు కూరగాయలు తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్లు, పోషకాలు అందుతాయి.
శరీరాన్ని కష్టపెట్టే వ్యాయామాల కన్నా రోజూ కొంత సేపు నడిస్తే మంచిది. కనీసం అరగంటకి తక్కువ కాకుండా నడవడం అలవాటు చేసుకోవాలి. రోజు మొత్తంలో ఏ సమయంలోనైనా నడవచ్చు. అయితే తెల్లవారుజామున నడిస్తే ఫలితాలు మరింత మెరుగ్గా వుంటాయి.
మీ డైట్ ప్లాన్‌ను తరచూ మార్చకుండా కొన్ని వారాల పాటు కొనసాగించాలి. మూడు నాలుగు వారాలకొకసారి మాత్రమే డైట్ ప్లాన్‌ను మార్చాలి.
Labels:
మీకు తెలుసా
మగధీర 100 డేస్ సెంటర్స్
78 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రను తిరగరాసిన ఇండస్ట్ర్రీ హిట్
223కేంద్రాల్లో డైరెక్ట్ గా శతదినోత్సవం జరుపుకుంటూ...
ఆల్ టైం ఆల్‍ఇండియా రికార్డ్ సృష్టించి తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్
గుంటూరు జిల్లా
1.గుంటూరు -కృష్ణమహల్
2.గుంటూరు -బాలీవుడ్ (ఫస్ట్ టైం 2 థియేటర్లలో 100 రోజులు)
3.తెనాలి -సంగమేశ్వర
4.ఒంగోలు -శ్రీనివాస
5.చీరాల -సంగం
6.నర్సరావుపేట -శారధంబ
7.చిలకలూరిపేట -శ్రీనివాస
8.మంగళగిరి -అన్నపూర్ణ
9.రేపల్లె -బసవేశ్వర
10.పొన్నూరు -లక్ష్మి
11.సత్తెనపల్లి -లక్ష్మి
12.పిడుగురాళ్ళ -జయలక్ష్మి
13.వినుకొండ -సురేష్
14.అద్దంకి -సత్యన్నారాయణ
15.మాచర్ల -శ్రీనివాస
16.దాచేపల్లి -రామకృష్ (ఫస్ట్ టైం 100 డేస్ సెంటర్)
(గుంటూరు జిల్లాలో డైరెక్టర్ గా 16 కేంద్రాల్లో శరదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రం)
నెల్లూరు జిల్లా
17.నెల్లూరు -అర్చన
18.కావలి -మానస
19.గూడూరు -సంగం
20.వెంకటగిరి -జ్యోతి
21.నాయుడుపేట -సి.యస్.తేజ
22.సూళ్ళూరుపేట -లక్ష్మి
23.కోట -ఆర్ ఆర్ టి
24.బుచ్చిరెడ్డిపాలెం -రాజకిషోర్
25.కందుకూరు -ప్రశాంతి
26.దర్శి -శ్రీనివాస
27.పొదిలి -వెంకటేశ్వర
28.కనిగిరి -సుదర్శన్
29.ఆత్మకూరు -రామకృష్ణ
30.పామూరు -రవికళ
(నెల్లూరు జిల్లాలో డైరెక్ట్ గా 14 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న తొలిచిత్రం)
విశాఖపట్నం జిల్లా
31.వైజాక్ -శరత్
32.కంచరపాలెం -ఊర్వశి
33.గాజువాక -మొహిని75ఎంఎం
34.గోపాలపట్నం -మౌర్య
35.అనకాపల్లి -శ్రీ జగన్నాథ్
36.విజయనగరం -ఎస్.సి.ఎస్
37.శ్రీకాకుళం -సరస్వతిమహల్
38.పాయకరావుపేట -గౌతమ్
39.నర్సీపట్నం -శ్రీకన్య
40.చోడవరం -పూర్ణ
41.ఎలమంచిలి -సీతాచిత్రమందిర్
42.చిట్టివలస -సప్తగిరి
43.గజపతినగర్ -గంగరాజ్
44.బ్బొబ్బిలి -శ్రీవాసవి
45.పార్వతిపురం -పద్మశ్రీ
46.ఎస్.కోట -శ్రీవెంకటేశ్వర
47.చీపురపల్లి -రాధామాధవి
48.రాజం -సీతారామ
49.పొందూరు -బాలాజ (ఫస్ట్ టై 100 డేస్ సెంటర్)
50.రణస్థలం -రామంజనేయ (ఫస్ట్ టైం 100 డేస్ సెంటర్)
51.పాలకొండ -ఆంజనేయ
52.నరసన్నపేట -శ్రీవెంకటేశ్వర
53.పలాస -భాస్కరరామ
54.టెక్కలి -భవాని
55.కవిటి -మహాలక్ష్మి
పశ్చిమగోదావరి జిల్లా
56.ఏలూరు -విజయలక్ష్మీ
57.భీమవరం -పద్మాలయ
58.తణుకు -వెంకటేశ్వర
59.తాడేపల్లిగూడెం -లక్ష్మీనారాయణ
60.పాలకొల్లు -శ్రీతేజ
61.జంగారెడ్డిగూడెం -సౌభాగ్య
62.నిడదవోలు -వీరభద్ర
63.చింతలపూడి -శారద
64.నర్సాపురం -అన్నపూర్ణ
65.దేవరపల్లి -శ్రీరామ్‌నాథ్
66.ఆకివీడు -విజయ
67.కొణితివాడ -రామకృష్ణ
68.కొయ్యాలగూడెం -మహాలక్ష్మి (ఫస్ట్ టైం 100 డేస్ సెంటర్)
69.పెద్దేవం -శ్రీనివాస (ఫస్ట్ టైం 100 డేస్ సెంటర్)
కృష్ణా జిల్లా
70.విజయవాడ -అలంకార్
71.పాయకాపురం -శ్రీవెంకటేశ్వర
72.గుణదల -వినాయక
73.పోరంకి -శ్రీనివాస
74.కంకిపాడు -మయూరి
75.ఉయ్యూరు -దీపక్
76.గుడివాడ -శరత్
77.జగ్గయ్యపేట -కమల్
78.మచిలీపట్నం -శ్రీ వెంకట్
79.నందిగామ -లక్ష్మీప్రసన్న
80.మైలవరం -సంఘమిత్ర
81.విసన్నపేట -శ్రీరామ్
82.నూజివీడు -ద్వారక
83.చల్లపల్లి -సాగర్
84.కైకలూరు -మాగంటి
85.తిరువూరు -వెంకటరామా
86.అవనిగడ్డ -వెంకటేశ్వర
(కృష్ణాజిల్లాలో డైరెక్ట్ గా 17 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రం)
నైజాం
87.ఆర్‍టిసి క్రాస్ రోడ్ -సుదర్శన్
88.దిల్‍షుక్ నగర్ -కోణార్క్
89.కూకట్‍పల్లి -మల్లిఖార్జున
90.సికింద్రాబాద్ -ప్రశాంత్
91.ఎన్టీఆర్ గార్డెన్స్ -ప్రసాద్ మల్టీప్లెక్స్
92.ఆర్.సి.పురం -శ్రీదేవి
93.కాప్ర -రాధిక
94.మల్కాజ్‍గిరి -శ్రీరామ్
95.కర్మన్ ఘూట్ -ఇందిర
96.వనస్థలిపురం -సుష్మ
97.ఉప్పల్ -శ్రీనివాస
98.వరంగల్ -సునీల్
99.హనుమకొండ -అమృత
100.మహబూబాబాద్ -లక్ష్మి
101.జనగాం -దేవి
102.నర్సంపేట -జయశ్రీ
103.పరకాల -జయడీలక్స్
104.తొర్రూరు -రామకృష్ణ
105.మర్రిపెడ -వెంకటేశ్వర (ఫస్ట్ టైం 100డేస్ సెంటర్)
106.కరీంనగర్ -భరత్
107.గోదావరిఖని -రాజేష్
108.జగిత్యాల -నటరాజ్
109.జమ్మికుంట -అన్నపూర్ణ
110.సిరిసిల్ల -విమల్
111.పెదపల్లి -సంగీత్ (ఫస్ట్ టైం 100డేస్ సెంటర్)
112.హుజూరాబాద్ -అన్నపూర్ణ (ఫస్ట్ టైం 100డేస్ సెంటర్)
113.ఖమ్మం -వినోద
114.కొత్తగూడెం -దుర్గ
115.భద్రాచలం -ఉదయభాస్కర్
116.ఎల్లందు -సీతారామ (ఫస్ట్ టైం 100డేస్ సెంటర్)
117.సత్తుపల్లి -సాయిబాలాజీ
118.మధిర -శాంతి
119.అశ్వారావుపేట -వెంకటదుర్గ
120.నిజామాబాద్ -లలిత
121.కామరెడ్డి -ప్రియ
122.నల్గొండ -నటరాజ్
123.మిర్యాలగూడ -శ్రీనివాసా
124.సూర్యాపేట -తేజాసినీమాక్స్
125.కోదాడ -రంగ
126.హలియా -కళ్యాణ్ (ఫస్ట్ టైం 100డేస్ సెంటర్)
127.సిద్ద్దిపేట -బాలాజీ
128.సంగారెడ్డి -నటరాజ్
129.గజ్వేల్ -సంతోష్ (ఫస్ట్ టైం 100డేస్ సెంటర్)
130.జహీరాబాద్ -మహేశ్వరి
131.మహబూబ్‍నగర్ -వెంకటేశ్వర
132.షాద్ నగర్ -రామకృష్ణ
133.వనపర్తి -రంగ
134.నారాయణపేట -మనోహర్ (ఫస్ట్ టైం 100డేస్ సెంటర్)
135.కొత్తపేట -పరమేశ్వరి
136.జడ్చర్ల -శ్రీనివాసా (ఫస్ట్ టైం 100డేస్ సెంటర్)
137.అదిలాబాద్ -నతరాజ్ (ఫస్ట్ టైం 100డేస్ సెంటర్)
138.మంచిర్యాల -వెంకటేశ్వర
139.నిర్మల్ -తిరుమల (ఫస్ట్ టైం 100డేస్ సెంటర్)
140.బెల్లంపల్లి -రామకృష్ణ (ఫస్ట్ టైం 100డేస్ సెంటర్)
141.తాండూరు -శాంతిమహల్
(నైజాంలో డైరెక్ట్ గా55కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న తొలిచిత్రం)
సీడెడ్
142.కర్నూలు -ఆనంద్
143.నంద్యాల -ప్రతాప్
144.ఆదోని -ద్వారక
145.ఎమ్మిగనూరు -శివ
146.మర్కాపురం -విజయటాకీస్
147.గిద్దలూరు - నటరాజ్
148.డోన్ -రాజ్
149.నందికొట్కూర్ -శివశంకర్ టాకీస్
150.ఆత్మకూరు -రంగమహల్
151.ఆళ్ళగడ్డ -భవాని
152.బనగానపల్లి -శివరాం
153.కోయిలకుంట్ల -పాండురంగ
154.గూడూరు -అఖిల్
155.తిరుపతి -జయశ్యాం
156.మదనపల్లి -ఎఎస్ఆర్ మూవీలాండ్
157.మదనపల్లి -సిద్దార్థ (ఫస్ట్ టైం 2 థియేటర్లలో 100రోజులు)
158.చిత్తూరు -చాణక్య
159.శ్రీ కాలహస్తి -బలరాం
160.పలమనేరు -పద్మశ్రీ
161.పీలేరు -షుకూర్ పిక్చర్ ప్యాలెస్
162.పుత్తూరు -శాంతి
163.వి.కోట -భరత్
164.కలికిరి -ప్రసాద్ (ఫస్ట్ టైం 100డేస్ సెంటర్)
165.పాకాల -రామకృష్ణ డీలక్స్
166.నగరి -శ్రీనివాస
167.సత్యవేడు -మురగన్ టాకీసు
168.నిండ్ర -ఎస్.వి.టాకీస్ (ఫస్ట్ టైం 100డేస్ సెంటర్)
169.కుప్పం -మురగన్
170.పుంగనూర్ -తాజ్‍మహల్
171.అనంతపురం -గౌరి
172.హిందూపురం -లక్ష్మి
173.కదిరి -పరమేశ్వరి
174.తాడిపత్రి -విజయలక్ష్మి
175.ధర్మపురం -సిద్ధార్థ
176.కణ్యాలదుర్గం -వెంకటమ్మ చిత్రమందిర్
177.రాయదుర్గం -కె.బి.మూవీలాండ్
178.గుత్తి -కెపియస్ మూవీలాండ్
179.గుంతకల్ -వాసవి
180.ఉరవకొండ -బాలాజీ (ఫస్ట్ టైం 100డేస్ సెంటర్)
181.బళ్ళారి -రాధిక
182.హౌస్పేట్ -బాల
183.సిరిగుప్ప -ఆర్ ఆర్ థియేటర్ (ఫస్ట్ టైం 100డేస్ సెంటర్)
184.కడప -రవి
185 ప్రొద్దుటూరు -అరవేటి
186.పులివేందుల -మారుతి
187.రాజంపేట -పివైపిక్చర్ ప్యాలెస్
188.మైదుకూరు -విజయటాకీస్
189.జమ్మలమడుగు -సాయురాం
190.వేంపల్లి -వెంకటేశ్వర
191.బద్వేలు -నౌషద్
192.పోరుమామిళ్లు -దేశాయిమహల్ (ఫస్ట్ టైం 100డేస్ సెంటర్)
193.ఎర్రగుంట్ల -స్యామి వెంకటేశ్వర (ఫస్ట్ టైం 100డేస్ సెంటర్)
194.కోడూరు -సిద్దేశ్వర
195.రాయ్ చోటి -గౌతమ్
(సీడెడ్ లో డైరెక్ట్ గా 54 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రం)
తూర్పు గోదావరి జిల్లా
196.రాజమండ్రి -గీతా అప్సర (ఫస్ట్ టైం 2 థియేటర్లలో 100రోజులు)
198.కాకినాడ -దేవి మల్టిప్లెక్స్
199.కాకినాడ -శ్రీదేవి
200.అమలాపురం -వెంకట్రామ
201.మండపేట -సూర్యమహల్
202.తుని -శ్రీరామా
203.పిఠాపురం -శ్రీ సత్య
204.పెద్దాపురం -సత్య
205.సామర్లకోట -సత్యలక్ష్మీ
206.జగ్గంపేట -నాగేశ్వర
207.ఏలేశ్వరం -జయశ్రీ
208.రామచంద్రాపురం -అన్నపూర్ణ
209.ద్రాక్షారామం -శ్రీలక్ష్మి
210.రావులపాలెం -జగన్మోహిని
211.కొత్తపేట -సత్యచంద్ర
212.తాటిపాక -అన్నపూర్ణ
213.మల్కీపురం -పద్మజ
214.గొల్లలమామిడాడ -శ్రీనివాస
కర్నాటక
215.బెంగుళూరు -పల్లవి
216.బెంగుళూరు -సి.వి.ఆర్
217.బెంగుళూరు -వైష్ణవి
218.చీంతామణి -ఎస్.ఎల్.ఎన్
219.గౌరీబిదనూరు -శంకర్ టాకీస్
220.పావగడ -మారుతి
221.భాగేపల్లి -రాజేంద్ర
222.హూసూరు -రాఘవేంద్ర (ఫస్ట్ టైం 100డేస్ సెంటర్)
223. పర్లాకిమిడి - నటరాజ్
షిఫ్టింగ్ సెంటర్స్
224.పెనుకొండ -గణేష్
225.కోడుమూరు -నబి
226.బేంతచర్ల -వెంకటేశ్వర
227.కోరుట్ల -శివ
228.నాగర్ కర్నూల్ -రమణ
229.గణపవరం -స్వప్న
230.గోపాలపట్నం -సౌజన్య
231.సాలూరు -శ్రీష్మా
232.ఇబ్రహింపట్నం -స్వర్ణ
Labels:
సినిమా
Subscribe to:
Posts (Atom)