ప్రేమాభిమానాలు,
పండు వెన్నెల దీవెనలు,
పున్నమి వెలుగుల దీపాలు,
పూసిన మల్లెల ఘుమఘుమలు,
పుడమి లోని అందాలు,
ప్రకృతి లోని పరువాలు,
పలికే చిలకల గీతాలు
పాడే కోయిల రాగాలు,
పుట్ట తేనె రసాలు,
ప్రతీది నీకు కానుకే....
అందుకో నా ప్రియ నేస్తమా!
వీలయితే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ