రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

రోటీలకు సూపర్ సైడ్‌డిష్ "పెసల సబ్జీ"


కావలసిన పదార్థాలు :
పెసర మొలకలు... అర కప్పు
ఉల్లిపాయలు... చిన్నవి రెండు
టొమోటోలు... రెండు
పచ్చిమిర్చి... రెండు
నూనె... మూడు టీ.
మంటినీరు... పావు లీ.

తయారీ విధానం :
పెసల్ని ముందురోజే నానబెట్టుకోవాలి. నీళ్లు వంపేసి బట్టలో కట్టి ఓ రోజు ఉంచితే మొలకలు వస్తాయి. ఉల్లిపాయను ముక్కలుగా కోయాలి. సగం ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు కలిపి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి.

తరువాత ఉల్లిముద్ద కూడా వేసి మూడు నిమిషాలు వేయించాక మొలకలొచ్చిన పెసల్ని కూడా వేయాలి. ఇప్పుడు మంచినీళ్లు పోసి మంట తగ్గించి సిమ్‌లో ఉంచి 5-10 నిమిషాలు ఉడికించి దించాలి. కిందికి దించేశాక కొన్ని పచ్చి ఉల్లిముక్కలు, కొత్తిమీరతో అలంకరించి వేడివేడి రోటీలతో పాటు వడ్డించాలి. అంతే రోటీలకోసం పెసర సబ్జీ సిద్ధమైనట్లే...!