రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

లెమన్‌ నూడుల్స్

కావలసిన పదార్థాలు :
చైనీస్ రైస్ నూడుల్స్... అర కేజీ
నిమ్మరసం... రెండు టీ.
ఆవాలు... ఒక టీ.
మినప్పప్పు... మూడు టీ.
శెనగపప్పు... మూడు టీ.
పసుపు... అర టీ.
కరివేపాకు... ఒక కట్ట
జీడిపప్పు... గుప్పెడు
పచ్చిమిర్చి... నాలుగు
ఉప్పు... తగినంత
కొబ్బరితురుము... రెండు టీ.

తయారీ విధానం :
నూడుల్స్‌ను మరిగించిన నీళ్లలో వేసి ఓ ఐదు నిమిషాలు ఉడికించి తీసి చిల్లుల మూకుడులో వేసి తడిలేకుండా ఆరనివ్వాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. పప్పులు వేగాక జీడిపప్పు కూడా వేసి ఉప్పు, నిమ్మరసం, కొబ్బరి వేయాలి. తరువాత ముందుగానే ఉడికించి ఆరనిచ్చిన నూడుల్స్‌ కూడా వేసి కలపాలి. అంతే టేస్టీ టేస్టీ లెమన్ నూడుల్స్ సిద్ధమైనట్లే..!