రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

శివాలయాల్లో ప్రదక్షిణ


అన్ని దేవాలయాలలో చేసే ప్రదక్షిణ వేరు, శివాలయంలో చేసే ప్రదక్షిణ వేరు. శివాలయాల్లో ఏ విధంగా ప్రదక్షిణ చేయాలో, అలా చేయడం వలన ఎలాంటి ఫలితాలు పొందవచ్చో పురాణాల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

శివాలయం ధ్వజస్తంభం దగ్గర నుంచి మనకు ఎడమ పక్కగా బయలుదేరి గర్భాలయానికి వెనుక ఉన్న సోమసూత్రం( శివుని అభిషేక జలం బయటకు పోయే మార్గం) వరకూ వెళ్లి వెనుతిరగాలి. కానీ సోమసూత్రం దాటరాదు.

అక్కడ నుంచి వెనుదిరిగి అప్రదక్షిణంగా మళ్లీ ధ్వజ స్తంభాన్ని చుట్టుకుని సోమసూత్రం వరకూ రావాలి. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ ముగిసినట్లు. ఈ విధమైన ప్రదక్షిణలు శివునికి భక్తులు బేసి సంఖ్యలో వచ్చే విధంగా 3,5,7,9 ప్రదక్షిణలు చేయవచ్చు.

శివప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదన్నది ప్రధాన నియమం. అలాచేస్తే ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ఒక ప్రదక్షిణ కిందకే వస్తుందంటుంది శాస్త్రం.