రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

మగధీర releasing on 31-07-2009


మెగాస్టార్ తనయుడు, చిరుత హీరో రామ్‌చరణ్ తేజ కథానాయకుడిగా రూపుదిద్దుకున్న భారీ బడ్జెట్ చిత్రం "మగధీర". ప్రస్తుతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 31వ తేదీన తెరపైకి రానుంది.

"చందమామ" ఫేమ్ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందించారు. గీతాఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం వహించారు.

పునర్జన్మ నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల మధ్య భారీ అంచనాలున్నాయి. ఒకవైపు చరణ్ అద్భుత నటన, మరోవైపు కాజల్ అగర్వాల్ అందాలు, రాజమౌళి దర్శకత్వం, గ్రాఫిక్స్ వంటి పలు అంశాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్లవుతాయని సినీ పండితులు అంటున్నారు.

ముందుగా ఈ నెల 29వ తేదీనే "మగధీర"ను చిత్ర యూనిట్ విడుదల చేయాలని భావించింది. కానీ అనివార్యకారణాల చేత విడుదల తేదీని 31కి వాయిదా వేసింది.

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలలోకి ప్రవేశించిన అనంతరం తొలిసారిగా మరోసారి వెండితెరపై కనిపించబోతున్నారు. "నాన్నను ఆ పాత్రలో నటించమని కనీసం వారం రోజులపాటు బతిమాలితే ఒప్పుకున్నారు" అని రామ్ చరణ్ తేజ చెపుతున్నాడు. పునర్జన్మ వృత్తాంత నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి 35 కోట్ల రూపాయల భారీబడ్జెట్‌ను ఖర్చు చేసిన సంగతి తెలిసిందే.

మెగా హంగులతో రూపొందిన ఈ చిత్రం జులై 31న ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలలో విడుదల కానుంది. ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మగధీరలో రామ్‌చరణ్ చేసిన సాహసోపేతమైన కత్తి యుద్ధాలు, గుఱ్ఱపు స్వారీలను వెండితెరపై చూడాల్సిందేనంటున్నారు దర్శకులు రాజమౌళి.

మరోవైపు ఎన్నాళ్లగానో చిరంజీవిని వెండితెరపై చూడాలనుకుంటున్న అభిమానుల కోరిక మగధీర ద్వారా నెరవేరనుంది.