రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

ముద్దంటే చేదా ఇపుడా వుద్దేశ్యం లేదా


ప్రేమను వ్యక్తీకరించడానికి తొలి సాధనం ముద్దుగా భావిస్తుంటారు. ప్రతి మనిషి శరీరంలో అనాయాసంగా జరిగే ప్రక్రియ ఇది. దీంతో తమ ప్రేమను మీకు ఇష్టమైనవారికి తెలియపరచవచ్చు. ఇది మీకు, మీ ఇష్టమైనవారికి ఓ తియ్యటి మందులాంటిది.

ముద్దు అనేది రకరకాలుగా ఉన్నాయంటున్నారు పరిశోధకులు. మనిషి శరీరంలోని వివిధ భాగాలలో చుంబించేందుకు గూఢార్థాలున్నాయంటున్నారు వారు. అవేంటో చూద్దాం...

బుగ్గలపై ముద్దులు : బుగ్గలపై ముద్దులు పెట్టే ప్రక్రియ స్నేహానికి ప్రతీకగా భావిస్తారు. కాని దీనికికూడా ప్రత్యేకమైన తర్ఫీదు ఉండాలంటున్నారు నిపుణులు. తొలుత మీరు ముద్దాడాలనుకునేవారి భుజాలపై చేతులువేసి వారిని మీ వైపుకు తిప్పుకోండి. ఆ తర్వాత వారి బుగ్గలపై ముద్దాడండి. దీంతో మీరు వారిని ఎంత ఇష్టపడుతున్నారనేది స్పష్టమౌతుంది.

బటర్ ఫ్లై కిస్ : ఏదైనా ఓ ఫంక్షన్‌లో మీకు నచ్చినవారిని ముద్దాడాలని అనిపిస్తే, అక్కడ ముద్దాడే అవకాశం రాదు. కాని బటర్ ఫ్లై కిస్‌తో మీకు నచ్చినవారికి ముద్దివ్వవచ్చు. దీనికి మీరు మీ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్‌ను తదేకంగా చూస్తూ ఉండండి.

ఆ తర్వాత మీ కను రెప్పలను టపటపలాడించండి. మీ కనులతో మాట్లాడే తీరు ఎదుటివారికి నచ్చినట్టైతే మీరు చేస్తున్న సైగ వారికి అర్థమౌతుంది. ఆవిధంగా మీరు వారికి బటర్ ఫ్లై కిస్ ఇవ్వవచ్చు. దీనినే బటర్ ఫ్లై కిస్ అంటారు.

ఫ్రెంచ్ కిస్ : ఫ్రెంచ్ కిస్ అనేది మీ రొమాంటిక్ మూడ్‌ను మీ పార్టనర్‌కు చేరవేసేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి ముద్దును ఆత్మీయ ముద్దు అని అంటారు.

ఇలాంటి ముద్దును మీరు తీసుకోవాలనుకుంటే‌ మీ పార్టనర్‌‌ను దగ్గరకు తీసుకుని మీ పెదాలను వారి పెదాలకు తాకించండి. ఇందులో ప్రదాన పాత్ర నాలుకదే. తమలోని రొమాంటిక్ మూడ్‌ను పెంపొందించుకునేందుకు చాలామంది ఈ పద్ధతిని కొనసాగిస్తూ, ఇందులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంటారు.

ఎస్కిమో కిస్ : ముద్దుల్లో ఈ పద్దతి కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ ముద్దు మీయొక్క ప్రేమతోపాటు మీమ్మల్ని మంచి మూడ్‌లోకి తీసుకువెళుతుంది. దీనికోసం మీ పార్ట్‌నర్ ముఖాన్ని మీ చేతుల్లోకి తీసుకొని వారి ముక్కును సుతిమెత్తగా స్పృశించండి. దీంతో మీకు అదోరకమైన అనుభూతి కలుగుతుంది. ఈ అనుభూతిని మీరు బాగా ఆస్వాదించగలగాలి.

ఫ్రీజ్/మెల్ట్ కిస్ : ఇలాంటి తరహాలో ముద్దాడుతుంటే అస్సలు మూడ్‌లోంచి బయటకు రావాలనిపించదు. ఫ్రీజ్ లేదా మెల్ట్ కిస్ అనేది రొమాంటిక్ మూడ్‌ను వృద్ధి చేస్తుంది. ఇది మీ రొమాన్స్‌లో కాస్త మజాగా ఉంటుంది. దీనికి మీరు చేయవలసిందల్లా ఒక్కటే... మీ నోట్లో మంచుముక్కను వేసుకోండి.

ఆ తర్వాత మీ పార్ట్‌నర్ ముఖాన్ని దగ్గరకు తీసుకొని కిస్ చేస్తూ ఆ మంచు ముక్కను వారి నోట్లోకి జొప్పించండి. ఈ క్రియను ఇరువురు కలిసి చేసుకుంటుంటే ఆ థ్రిల్లే వేరంటున్నారు ముద్దుల్లో ఆరితేరిన నిపుణులు. ఇదో కొత్త తరహా ఫ్రెంచ్ కిస్. ఇలా మళ్ళీ చేయాలనిపిస్తుంది మీకు.

ఇయర్‌లోబ్ కిస్ : ఇయర్‌లోబ్ అంటే చెవులపై భాగం. మీరుకనుక మీ పార్ట్‌నర్ యొక్క చెవుల‌పై భాగంలో సుతిమెత్తగా స్పృశిస్తూ...ముద్దాడుతే వారిలో రొమాంటిక్ మూడ్‌ను రప్పించవచ్చు. కాని మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే...ఈ పద్ధతిలో కిస్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీ శ్వాసక్రియ మీ ఆధీనంలో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మీరు విడిచే శ్వాస కాస్త వేగంగా వస్తే మీకు, మీ పార్ట్‌నర్ యొక్క ఏకాగ్రత లోపిస్తుంది. దీంతో ముద్దాడే ఆనందాన్ని అనుభవించలేరు.

చేతులపై ముద్దులు : మీ పార్ట్‌నర్ చేతులు ముద్దాడితే వారిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో వారికి తెలుస్తుంది. దీనికి వారి కోమలమైన చేతులను మీ చేతుల్లోకి తీసుకోండి. ఆ తర్వాత మెల్లగా ముద్దాడండి. మీరు ముద్దాడే తీరు మీ ప్రేమకు పునాదులుగా మార్చివేస్తుందంటున్నారు విశ్లేషకులు.

నుదుటిపై ముద్దు : నుదుటిపై ముద్దాడే దానిని స్నేహపూరితమైన ముద్దు అనికూడా అంటారు. మీ పెదాలను గుండ్రంగా చేసి నుదిటిపై ముద్దాడండి.

ముద్దుల్లో రకాలు :

పాదాలపై ముద్దులు : ముద్దుల్లోని రకాలలో పాదాలపై ముద్దాడటంకూడా ఓ ఎత్తు. మీ పార్ట్‌నర్ పాదాలను మీవైపుకు తీసుకుని ముద్దాడండి. మీరు ముద్దాడే తీరు మీ పార్ట్‌నర్‌ను రొమాంటిక్ మూడ్‍‌లోకి తీసుకువెళుతుంది. ‌ ‌

మెడమీద ముద్దులు : మీ పార్ట్‌నర్ ముఖాన్ని మీ చేతులలోకి తీసుకోండి. వారి మెడపై ముద్దులతో ముంచెత్తేయండి. దీంతో వారుకూడా రెచ్చిపోయి మిమ్మల్నికూడా ముద్దులతో ముంచెత్తేందుకు సిద్దమౌతారంటున్నారు నిపుణులు.

భుజాలపై ముద్దులు : భుజాలపై ముద్దాడడం సాధారణమైన ప్రక్రియ. కాని ఇది మాంఛి రొమాంటిక్ మూడ్‌లోకి తీసుకువెళుతుంది. మీ పార్ట్‌నర్ వెనుకవైపునుంచి చుట్టుముట్టి వారి భుజాలపై ముద్దాడండి. దీంతో మీ పార్ట్‌నర్‌కు అమితమైన ఆనందాన్ని ఇచ్చిన వారవుతారు.

ఉత్తరాల ద్వారా ముద్దులు : మీరు మీ పార్ట్‌నర్‌కు దగ్గరలో ఉన్నప్పుడు మీరు మీ భావాలను ఎదుటివారికి వ్యక్తీకరిస్తుంటారు. అదే మీరు దూరంగా ఉన్నప్పుడు...?

దీనికి పెద్దగా చింతించాల్సిన పనిలేదు. దీనికికూడా ఓ తియ్యటి గుర్తుంది. అదేంటంటే "X". మీ ప్రియతములకు ఉత్తరం రాసి అందులో మీరు ఈ ముద్రను పొందుపరిస్తే వారికి అర్థమయ్యేలా ఉంటుంది లేదా మీరు పెదాల బొమ్మలనుకూడా మీ ఉత్తరం ద్వారా పంపవచ్చు.

సిప్ కిస్ : ముద్దుల్లో రకరకాల ముద్దులున్నాయి. అందులో సిప్ కిస్ ఒక రకమైన ముద్దు. ఇది ఓ కొత్త పద్ధతి. మీకు ఇష్టమైన ఓ పానీయాన్ని సేవించండి. ఇందులో కాసింత మిగలబెట్టి మీ నోట్లో ఉంచుకోండి. ఆ తర్వాత మీ పార్ట్‌నర్‌ను ముద్దాడుతూ...(ఫ్రెంచ్ కిస్‌లా) మీ నోట్లోని పానీయాన్ని పార్ట్‌నర్ నోట్లోకి జొప్పించండి.

ఇలా చేయాలనుకునేటప్పుడు మీ పార్ట్‌నర్‌కు ఎలాంటి ఏఅసౌకర్యం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోండి. లేకుంటే మీకు, మీ పార్ట్‌నర్‌కు మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఫ్రూటీ కిస్ : వావ్! ఇట్స్ సో రొమాంటిక్...! నిజమేనండి, ఇది ఓ రొమాంటిక్ మూడ్‌లోకి తీసుకువెళుతుంది. ఏదైనా పండ్లు లేదా మిఠాయి ముక్క మీ పెదాల మధ్యలో ఉంచుకుని పండు లేదా మిఠాయిని సగం సగం తుంచుకుంటు మీ పార్ట్‌నర్‌కు కిస్‌ ఇస్తూ... ఆ సమయంలో మీ నోట్లోనున్న మిఠాయి లేదా పండును వారి నోట్లోకి జొప్పిస్తూ కిస్ చేయండి.


వాక్యూమ్ కిస్ : మీ పార్ట్‌నర్ ముఖాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. ఆ తర్వాత మీ నోట్లో గాలిని నింపుకోండి. మెల్లగా వారి ముఖంపై ఊదండి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోను ఎక్కువ గాలిని మాత్రం మీ నోట్లో నింపుకోకండి. ఇలా ఇరువురు కలిసి చేయండి. దీంతో ఇద్దరిలోను ఓ రకమైన అనుభూతి కలుగుతుంది.

పిక్‌నిక్ కిస్ : సాధారణంగా పిక్‌నిక్‌లకు వెళ్ళినప్పుడు మీ భాగస్వామితో కలిసి ఉంటారు. కేవలం మీరిరువురు మాత్రమే ఉండే ప్రదేశాన్ని వెతుక్కోండి. అలా రొమాంటిక్ మూడ్‌లోకి వచ్చి రొమాంటిక్‌గా ముద్దాడటమంటే చాలామందికి ఎంతో సరదాగా ఉంటుంది.

మీ పార్ట్‌‌నర్‌ను ఏదైనా దట్టమైన పొదలమాటుకు తీసుకువెళ్ళండి. అక్కడ మాట్లాడుతూ ఒక్క ఉదుటన పెదాలతో పెదాలు కలిపి ముద్దాదడండి. దీంతో వారిలోకూడా మూడ్ వచ్చి మీకు మాంఛి ముద్దులిస్తారంటున్నారు నిపుణులు.

ఉత్తేజాన్నిచ్చే ఈ ముద్దు మీ ఇరువురిలోను రొమాన్స్‌ను మరింత పెంచుతుంది. ఇలాంటి ముద్దులను మీరుకూడా పొందాలనుకుంటే మీ పార్ట్‌నర్‌ను మీ కౌగిలిలో బంధించి వారి పెదాలను మీ పెదాలతో ముద్దాడి ఆ తర్వాత మెలమెల్లగా నమిలేటట్టు చేయండి. ఇలా చేసే ప్రక్రియలో మీరు కాస్త జగ్రత్తలు పాటిస్తే చాలా మంచిదంటున్నారు సెక్సాలజిస్టులు.

టైగర్ కిస్ : టైగర్ కిస్‌లో కాస్త ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటుంది. మీ పార్ట్‌నర్‌ను తొలుత భయపెట్టండి. అదికూడా కాస్త రొమాంటిక్‌గా ఉండాలి. మీ పార్ట్‌నర్‌ వీపు మీకు ఎదురుగా ఉండేలా చూసుకోండి. మీరు వచ్చేది వారికి తెలియకపోతే వారి వెనుకవైపుకు వెళ్ళి వారి మెడపై(పులిలా గాండ్రిస్తూ)మెల్లగా కొరకండి. ఆ తర్వాత వారిని ముద్దుల్లో ముంచెత్తండి. మీరు ముద్దాడే తీరు వారిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది.

మాటల్లో ఉంటూనే ముద్దులు : ముద్దనేది ఓ మధురాతి మధురమైన ప్రక్రియ. దానిని అనుభవిస్తేనే అందులోనున్న తీయదనం తెలుస్తుంది. మీరిరువురే ఉన్నప్పుడు మెల్లగా పలకరించుకోండి. ఆ మాటలు తేనెలొలికేలా ఉండాలి. అలా రొమాంటిక్‌గా మాట్లాడుతూనే మీ పార్ట్‌నర్‌ను ముద్దుల్లో ముంచెత్తండి.

టంగ్ సకింగ్ : టంగ్ సకింగ్ అంటే ఫ్రెంచ్ కిస్‌కు పర్యాయపదం ఈ టంగ్ సకింగ్. మీ పార్ట్‌నర్‌ను ముద్దాడుతూనే పెదాలతో పెదాలను కలపండి. అలా ముద్దాడుతూనే తన నోట్లో నాలుకను ముద్దాడండి. ఇక్కడకూడా మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

హికీ కిస్ : హికీ కిస్ అంటే దంతక్షతాలన్నమాట. అంటే పంటితో కొరకడం. ఇక్కడకూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కాస్త ఎక్కువగా కొరికితే గాట్లు పడే అవకాశాలున్నాయి. దీంతో రక్తం వచ్చే అవకాశాలుకూడా అధికంగా ఉంటుంది.

ఇలాంటి దంతక్షతాల కారణంగా ప్రియుడు/ప్రియురాలు ఒకరినొకరు తాము గడిపిన మధుర స్మృతులను స్మరించుకుంటుంటారు. ఈ గుర్తులున్నంతవరకు మీకు మీ పార్ట్‌నర్ లేదా మీ పార్ట్‌నర్‌కు మీరు నిత్యం గుర్తుకొస్తుంటారంటున్నారు నిపుణులు.

క్వికీ కిస్ : మీరు పని తొందరలో లేదా ప్రయాణపు తొందరలోనున్నట్లైతే క్వికీ కిస్‌ను ఆస్వాదించొచ్చు. ఇందులో మీ పార్ట్‌నర్‌ను మీ వైపుకు తిప్పుకుని వారి ముక్కుకు మీ ముక్కును స్పర్శించి అలా కాసేపు రుద్దండి. దీనినే క్వికీ కిస్ అని అంటున్నారు నిపుణులు.