రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

కేరట్‌ హల్వా


కావలసిన పదార్థాలు :
కేరెట్‌... పావుకిలో
పంచదార... 200 గ్రా
నెయ్యి... అర్థపావుకిలో
జీడిపప్పు... 10 బద్దలు
కిస్‌మిస్‌... కావలసినన్ని

ఇలా చెయ్యండి :
ఒక స్టీల్‌ గిన్నెలో సగం నెయ్యి పోసి జీడిపప్పు, కిస్‌మిస్‌‌లు వేసి వేయించాలి. తరువాత కోరి ఉంచిన కేరెట్‌ కోరులో పంచదార పోసి సన్నని సెగమీద, నెయ్యివేస్తూ గరిటకు చుట్టుకు వచ్చేదాక ఉడకనివ్వాలి. దించబోయే దాంట్లో ముందు ఏలకులు పొడి చేసి వెయ్యాలి. ఒక పళ్ళానికి నెయ్యిరాసి ఈ కేరెట్‌ హల్వా పళ్లెంలో వెయ్యాలి. ఆపై అది ఆరిపోకముందే కావాల్సిన ఆకారంలో ముక్కలు కోసుకోవాలి.