రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

చెలీ... ఏదీ నీ చిరునామా... ?

చెలీ... నీవే లోకంగా...
నీ తలపే ధ్యాసగా... నీతోటిదే ప్రపంచంగా...
నీవుంటేనే మధురంగా... నీవంటూ లేకుంటే విరహంగా...
నీకోసమే (నే) పుట్టాననే భావంగా... నీకై నేను వేచివున్నా...
చెంతకు చేరి కరుణిస్తావో... రానంటూ వేధిస్తావో... నీ ఇష్టం.

కష్టం నా చుట్టమైనా... కన్నీళ్లతోటిదే నాపయనమైనా...
ఏనాటికైనా నువొస్తావని... చితి మంటలపై చేరిన జీవితాన్ని చేతుల్లోకి తీసుకుంటావని...

వీడిపోని ఆశతో... ఆగిపోని శ్వాసతో ఎదురు చుస్తున్నా... లోకం కాదన్నా...
ఎవరెన్ని అనుకున్నా... నీకోసం పలికే ఈ నా మౌనరాగం ఏనాటికీ ఆగిపోదు సుమా...

సముద్రాలే ఇంకిపోయినా... నింగిలోని నక్షత్రాలన్నీ నేలమీదకు జారిపోయినా... భూగోళం బ్రద్ధలైనా...
సప్త లోకాలు ఏకమైనా... ఏమూలో మిగిలిన ప్రాణంతో... నిను చూడాలనే ఆశ చావని చూపులతో అను నిత్యం నీకోసం ఎదురు చూస్తూనే ఉంటా.