రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

వరలక్ష్మీ వ్రతం



మహిళలకు అత్యంత ముఖ్యమైన వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఆచరించాలి. వీలుకాని వారు, శ్రావణ మాసంలోని ఏ శుక్రవారమైనా ఆచరించవచ్చు.

వరలక్ష్మీ పూజా విధానంలో ముఖ్యంగా... పూజామందిరంలో గానీ, ఇంట్లో పూజచేయ దలచిన చోటగానీ మండపాన్ని ఏర్పాటు చేసుకుని కలశాన్ని ప్రతిష్టించి, వరలక్ష్మీ దేవినీ అందులోనికి ఆవాహనం చేసుకుని, గణపతి పూజ, వరలక్ష్మీ పూజలను చేసి తొమ్మిది ముడులతో తోరాన్ని తయారు చేసుకుని...

"బధ్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభ ప్రదం"
"పుత్రపౌత్రాభివృద్ధంచ సౌభాగ్యం దేహి మే రమే" - అనే శ్లోకాన్ని పఠిస్తూ చేతికి తోరమును కట్టుకోవాలి. ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. శక్తి కొద్దీ నైవేద్యం సమర్పించి, వరలక్ష్మీ వ్రత కథను పఠించి, అక్షితలు వేసి నమస్కరించాలి.