నా కనుల ఎదుట నీవు లేవు
కానీ నా కనుల ని౦డా నీవే
నా మాటలలో నీవు లేవు
కానీ నా ప్రతి పలుకూ నీ కొరకే
నా గమనము లో నీవు లేవు
కానీ నా ఊహల ప్రతి అడుగు నీ తోనే
నా వ్రాతలలో నీవు లేవు
కానీ నా ప్రతి భావన నీదే
నా ఆలోచనలో నీవు లేవు
కానీ నా ప్రతి తలపూ నీదే
వీలయితే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ