కావలసిన పదార్థాలు :
మైదాపిండి... అరకేజీ
ఉల్లిపాయలు... 50 గ్రాములు
క్యాబేజీ... 100 గ్రాములు
పచ్చిబఠాణీలు... 50 గ్రాములు
కేరట్... 100 గ్రాములు
బీన్స్... 100 గ్రాములు
అల్లం, వెల్లుల్లి పేస్ట్... ఒకటిన్నర టీస్పూన్
బంగాళాదుంప... రెండు (సన్నగా తరిగినవి)
ఉల్లిపాయలు... రెండు (సన్నగా తరిగినవి)
టమోటోలు... రెండు (సన్నగా తరిగినవి)
కొత్తిమీర... పావు కట్ట (సన్నగా తరిగినది)
కరివేపాకు... 2 ఈనెలు (సన్నగా తరిగినది)
పుదీనా... పావు కట్ట (సన్నగా తరిగినది)
గరంమసాలా పొడి... పావు టీస్పూన్
కారంపొడి... అర టీస్పూన్
ధనియాలపొడి... అర టీస్పూన్
పసుపుపొడి... అర టీస్పూన్
ఉప్పు... తగినంత
నూనె... అరకేజీ
తయారీ విధానం :
మైదాపిండిలో వెన్న వేసి బాగా కలుపుకోవాలి. నీటిలో కాస్తంత ఉప్పు, చక్కెరను కలిపి కరిగిన తరువాత ఆ నీటిని మైదాపిండిలో పోసి బాగా మెత్తగా ముద్ద చేసుకోవాలి. మైదాపిండి ముద్దపై కాస్తంత నూనెను రాసి ఒక తడిగుడ్డను కప్పి ఉంచాలి. కుక్కర్‌లో నూనె వేసి కాగిన తరువాత ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టును వేసి బాగా వేయించాలి.
తరువాత పైన సన్నగా తరిగి ఉంచుకున్న పదార్థాలు, మిగిలిన పదార్థాలు అన్నింటినీ ఒకటి తర్వాత ఒక్కోటి వేస్తూ బాగా వేయించాలి. చివర్లో వీటికి టమోటో ముక్కలను కూడా కలిపి వేయించాలి. అందులోనే ధనియాలపొడి, మిరపపొడి, పసుపుపొడి, ఉప్పు లాంటివి వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. కావాల్సినంత నీటిని అందులో పోసి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనాలను వేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి, దించేయాలి.
పై పదార్థాలన్నీ ఉడికేలోపు కలిపి ఉంచుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీలాగా వత్తుకోవాలి. స్ర్పింగ్ రోల్స్ కొసలు మూసేందుకుగాను మైదాపిండి నీటిలో చిక్కగా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి.
కుక్కర్‌లో ఉడికించిన పదార్థాలను వత్తుకున్న పూరీలలో కొద్ది కొద్దిగా పెట్టి రోల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని పైన కలిపి ఉంచిన చిక్కటి మైదా పిండితో రోల్స్ కొసలను మూసేయాలి.
ఇలా పిండి మొత్తం రోల్స్ లాగా తయారు చేసుకున్న తరువాత వాటిని నూనెలో బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీయాలి. అంతే వెజ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. వీటిని ఏదైనా సాస్‌తో కలిపి వేడి వేడిగా అతిథులకు వడ్డించండి.