బల్లిపడితే.........
బల్లి తలపై పడితే ఎలాంటి ఫలితాలు సంభవిస్తాయని జ్యోతిష్య నిపుణులు పేర్కొన్నారు. బల్లి పడిన వెంటనే శిరస్నానము చేసి, నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఇష్టదైవము దర్శనము చేసిన యెడల చెడు ఫలితములు కలుగవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. బల్లి పడితే ఎలాంటి ఫలితాలుంటాయని ఒకసారి పరిశీలిస్తే..
చెవిమీద - దుర్వార్త వినుట
కనుబొమ్మలమీద - ధనలాభము
కుడికన్నున - పరాజయము
ఎడమకన్నున - అవమానము
ముక్కుమీద - కార్యహాని
ముక్కుకొనయందు - పరాజయము
ముక్కుప్రక్కన - మిత్రలాభము
మీసముమీద - అధికారలాభము
పై పెదవిమీద - భూలాభము
క్రింది పెదవిమీద - సుభోజనము
నాలుకయందు - విద్యాలాభము
గడ్డముమీద - అపమృత్యుభయము
గడ్డము వెంట్రుకలమీద - గృహప్రాప్తి
వెనుకమెడయందు - మరణ భయము
ముందువైపు కంఠమందు - బుద్ధినాశనము, ఆత్మహత్య, భయము
గొంతె ఎముక మీద - ఉభయ సంకటములు
రొమ్మున - జయము
గుండెపైన - అధైర్యము
పైకడుపున - పుత్రలాభము
బొడ్డున - భయము
కడుపు ప్రక్కన - ఆరోగ్యము
భుజములయందు - సహాయము
అరచేతియందు - ద్రవ్యలాభము
మోచేతియందు - సహాయనాశము
మణిబంధమున - గర్వభంగము
గోళ్ళయందు - జంతుభయము
చంకలో - ప్రేతభయము
వెన్నుముకయందు - పిశాచభయము
ముంగురులమీద - హాని
కేశాంతమందు - మరణభీతి
జుట్టుమీద - కష్టము
జడమీద - భర్తృగండము
మిచ్చిలిగుంటలో - భారముమోయుట
పాదమందు - కళ్యాణము
పిరుదున - శయ్యాలాభము
తొడవెనుక - విషభయము
ముందొడమీద - సుఖము
మోకాలియందు - వాహనలాభము
మోకాలిసంధియందు - వాహన భ్రంశము
గండస్థలమందు పురుషులకు - బంధువులు
స్త్రీలకు చెవిదగ్గర, చెంపమీద - శుభము
మోకాలిక్రింద - వాతరోగము
మోకాలిక్రింద నరములయందు - రోగము, ధనవ్యయము
పిక్కలయందు - కార్యానుకూలము
మోకాలిక్రింద ఎముక - కార్యహాని
పాదసంధియందు - రోగము
పాదములవెనక - గృహప్రవేశము
పాదమున - ప్రయాణము
వ్రేళ్ళయందు - రోగము
అరికాలియందు - రాజ్యలాభము
తలమీద - లక్ష్మీకరము
నడినెత్తిమీద - రోగము
కుడినెత్తిమీద - సోదరునికి భయము
నెత్తివెనుక - తమ్మునికి అరిష్టము.. వంటివి జరుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
Labels:
మీకు తెలుసా