రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

డిసెంబరులో శిల్పాశెట్టి పెళ్లి!


ముంబయి: పొడుగుకాళ్ల సుందరి.. బాలీవుడ్‌ భామ శిల్పాశెట్టి త్వరలోనే పెళ్లి కూతురు కానుంది. ప్రియుడు రాజ్‌కుంద్రాతో కలిసి ఏడడుగులు నడవనుంది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలనుకున్నా సాధ్యం కాలేదు. డిసెంబరులో లండన్‌లో ఆమె పెళ్లి జరగనుందనే విషయం బయటకు పొక్కింది. తన పాస్‌పోర్టు ఇప్పించాలని శిల్ప తండ్రి సురేంద్రశెట్టి సూరత్‌ కోర్టును ఆశ్రయించడంతో ఈ గుట్టు కాస్త రట్టయింది. లండన్‌లో జరిగే తన కూతురు వివాహా వేడుకలకు హాజరవ్వాలని అందులో సురేంద్ర పేర్కొన్నట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. దీంతో ప్రియుడు రాజ్‌కుంద్రాతో శిల్ప వివాహం ఎప్పుడనే విషయమై గత కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయింది. వివాహ అనంతరం శిల్ప లండన్‌లోనే స్థిరపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. చీరల వ్యాపారిపై బెదిరింపులకు దిగిన కేసులో 2003లో సురేంద్రశెట్టి పాస్‌పోర్టును కోర్టు స్వాధీనం చేసుకుంది.