చెన్నై శ్రీవారికి 108 స్వర్ణ కమలాలు
చెన్నై, న్యూస్‌టుడే: చెన్నైలోని తిరుమల-తిరుపతి దేవస్థానం సమాచార కేంద్రంలోని శ్రీవారికి ఓ భక్తుడు 108 స్వర్ణ కమలాలు బహుకరించారు. గ్రానైట్ వ్యాపారి జేసీ నాయుడు వీటిని రూ.20 లక్షల వ్యయంతో చేయించారు. ఒక్కో బంగారు పుష్పం తయారీకి పది గ్రాముల బంగారం ఉపయోగించారు. మొత్తం కేజీకిపైగా బంగారు వాడారు. వీటిని స్వామివారి పాదాల ముందు అలకరించడానికి వెండి పీఠాన్ని కూడా తయారు చేసి బహుకరించారు. ‘జీఆర్‌టీ జ్యూవెలరీస్' ఈ పుష్పాలను తయారు చేసింది. రెండు రోజుల క్రితం ఈ పుష్పాలు తితిదే సమాచారం కేంద్రానికి చేరాయి. వీటిని వారం రోజుల్లో శుభముహూర్తాన స్వామివారికి సమర్పిస్తారు.
వజ్రకటి హస్తాలు: సమాచార కేంద్రంలోని శ్రీవారికి త్వరలోనే ఓ భక్తుడు వజ్రకచిత కటిహస్తాలను బహుకరించనున్నారు. కేంద్ర మంత్రి జగద్రక్షకన్ కుటుంబీకులు సుమారు రూ.50 లక్షల వ్యయంతో ఈ కటిహస్తాలను రూపొందించి బహుకరించడానికి అంగీకరించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. సింగపూరుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త ఇక్కడ స్వామి వారికి రూ.22 లక్షల వ్యయంతో స్వర్ణకాసుల హారాన్ని బహుకరించనున్నారు.
Labels:
హరే శ్రీనివాసా