రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

మాంద్యం తరుణంలో ఎస్‌బీఐ


ఇంటర్మీడియట్‌ అర్హతతోనే బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకోవటానికి ఇప్పుడో మంచి అవకాశం వచ్చింది. డిగ్రీ, పీజీలు పూర్తిచేసినవారు కూడా దీనికి పోటీ పడటం సహజం. ఈ పోటీ ఎంతన్నది ఆలోచించకుండా చిత్తశుద్ధితో అవిరళంగా కృషి చేస్తే బ్యాంకులో పాగా వేయటం అసాధ్యమేమీ కాదు!
ఎక్కడ చూసినా ఉద్యోగాల కోత వార్తలే. మాంద్యం తరుణంలో ప్రతిష్ఠాత్మకమైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోబోవటం విశేషమే. ఆర్థిక మందగమనం వెంబడిస్తున్నా చెక్కుచెదరక, చక్కని ఫలితాలు సాధించిన ‘అత్యుత్తమ' బ్యాంకు ఎస్‌బీఐ.
అందుకే... 11 వేల క్లర్కుల నియామకం కోసం ఎస్‌బీఐ తాజాగా నోటిఫికేషన్‌ వెలువరించింది. ఇందులో మన రాష్ట్రానికి 900 ఖాళీలున్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబరు 15. ‘ఆన్‌లైన్‌' ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. (ఇందుకోసం అభ్యర్థులకు ఈ-మెయిల్‌ ఐడీ తప్పనిసరిగా ఉండాలి). పరీక్ష తేదీలు నవంబరు 8, 15.

విద్యార్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత లేదా 40 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
వయసు: 18 నుంచి 28 సంవత్సరాల మధ్య.
వెబ్‌సైట్‌:www.sbi.co.in email: crpd@sbi.co.in

సమీప ఎస్‌బీఐ బ్రాంచిలో రూ. 250 డిపాజిట్‌ స్లిప్‌ ద్వారా చెల్లించి రిసీట్‌ పొందాలి. ఈ వివరాలను ఆన్‌లైన్‌ దరఖాస్తులో వివరించాలి.

ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షా కేంద్రాలు
1.హైదరాబాద్‌ 2. తిరుపతి, 3. విజయవాడ 4. విశాఖపట్టణం
అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా జరుగుతుంది.
ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉండే రాత పరీక్షలో 5 విభాగాలు ఉంటాయి.
1. జనరల్‌ అవేర్‌నెస్‌ 2. జనరల్‌ ఇంగ్లిష్‌ 3. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 4. రీజనింగ్‌ ఎబిలిటీ 5.మార్కెటింగ్‌ ఆప్టిట్యూట్‌/కంప్యూటర్‌ నాలెడ్జి

రాత పరీక్షకు కనీస క్వాలిఫైయింగ్‌ మార్కులు 40 శాతంగా నిర్ణయించారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ- రెండింటిలో ఉమ్మడిగా వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్‌ లిస్టు రూపొందిస్తారు.
ఎలా సిద్ధమవ్వాలి?
విభాగాల వారీగా ప్రిపరేషన్‌ విషయానికి వస్తే.. మొదటిది జనరల్‌ అవేర్‌నెస్‌.
అత్యధిక మార్కుల సాధనకు అవకాశం ఉన్న ఈ విభాగపు ప్రిపరేషన్‌ విషయంలో అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కరెంట్‌ అఫైర్స్‌ విభాగంలో ఎక్కువభాగం ప్రశ్నలు ఆర్థిక రంగ అంశాలపైనే ఉంటాయి. వీటితోపాటు బ్యాంకింగ్‌, కొత్త పుస్తకాల విడుదల, విదేశాంగ పరమైన అంశాలు కూడా ప్రాధాన్యం కలిగి ఉంటాయి.

జనరల్‌ అవేర్‌నెస్‌ ప్రిపరేషన్‌లో ఎప్పటికప్పుడు అంశాలను ‘అప్‌డేట్‌' చేసుకుంటూ ఉండాలి. ప్రతి రోజూ న్యూస్‌ పేపర్‌ చదవడంతో పాటుగా ‘బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ క్రానికల్‌', ‘కాంపిటీషన్‌ సక్సెస్‌ రివ్యూ' లాంటి ప్రామాణిక మ్యాగజీన్‌లను అభ్యర్థులు క్రమం తప్పకుండా చదవాలి.

ఇంగ్లిష్‌ ప్రిపరేషన్‌లో అత్యంత ముఖ్యమైన విభాగాలు గ్రామర్‌, ఒకాబులరీ. ఫండమెంటల్‌ గ్రామర్‌ పై పూర్తి అవగాహన పెంచుకోవడం, ఒకాబులరీ పెంపొందించుకోవడం ద్వారా ఇంగ్లిష్‌ విభాగంలో ఎక్కువ మార్కులు స్కోరు చెయ్యడానికి అవకాశం ఉంది.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలో శాతాలు, సరాసరి, నిష్పత్తి- అనుపాతం, లాభం- నష్టం, వడ్డీ, భాగస్వామ్యం వంటి టాపిక్స్‌ ముందుగా ప్రిపేర్‌ అవ్వడం ద్వారా డాటా ఇంటర్‌ప్రిటేషన్‌ను త్వరగా, కచ్చితంగా చెయ్యడం సాధ్యపడుతుంది.

అలాగే, క్లరికల్‌ పరీక్షలకు మరో ముఖ్యమైన అంశం సూక్ష్మీకరణ. ప్రాథమిక గణిత సమీకరణాలను బాగా సాధన చెయ్యాలి. దీనితోపాటు permutation and combination, Number series మొదలైనవి అభ్యాసం చేయాలి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగం ఎక్కువ సమయం పట్టే విభాగం. అందువల్ల ఈ విభాగాన్ని చివరగా ప్రారంభించడం ద్వారా సమయం వృథా కాకుండా చూడవచ్చు.

రీజనింగ్‌ విభాగంలో ప్రశ్నలకు లాజికల్‌ ధింకింగ్‌ ద్వారానే ఎక్కువ సమాధానాలు చెయ్యడం సాధ్యం అవుతుంది. ఇచ్చిన ప్రశ్నలను క్షుణ్ణంగా పరిశీలించి ‘లాజిక్‌' పట్టెయ్యటం ముఖ్యం.
నాన్‌ వెర్బల్‌ ప్రశ్నలకు సైతం ప్రశ్నను క్షుణ్ణంగా పరిశీలిస్తే సమాధానం గుర్తించడం తేలిక.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ రీజనింగ్‌ విభాగాలకు సంబంధించి సాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత సులువుగా సాల్వ్‌ చేయడానికి వీలవుతుంది.

గత పరీక్షల పేపర్లు, ప్రాక్టీసు పేపర్ల మెటీరియల్‌ విస్తృతంగా లభ్యం అవుతుంది. అందువల్ల వీలయినన్ని ఎక్కువ పేపర్లు ప్రాక్టీసు చేయడం ద్వారా ఈ విభాగాలలో బాగా మార్కులు పొందొచ్చు.

మార్కెటింగ్‌ ఆప్టిట్యూడ్‌, కంప్యూటర్‌ నాలెడ్జి రెండూ కలిపి ఒక విభాగంలో ఉంటాయి. మార్కెటింగ్‌ ప్రిపరేషన్‌ విషయంలో- ప్రస్తుత మార్కెటింగ్‌ విషయాలను పరిశీలన చేసి పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. అంటే మార్కెటింగ్‌ ప్రిపరేషన్‌ విషయంలో టెక్‌స్ట్‌ బుక్‌ ప్రిపరేషన్‌ పాత్ర తక్కువ. మార్కెటింగ్‌ మౌలిక అంశాల ప్రిపరేషన్‌ కోసం ప్రామాణిక పుస్తకాలను ప్రిపేర్‌ అయితే సరిపోతుంది.

బ్యాంకులకు సంబంధించిన ప్రొడక్ట్స్‌ మార్కెటింగ్‌ ఇన్సూరెన్స్‌ మొదలైన అంశాలపై అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్‌ నాలెడ్జి విషయంలో మౌలికాంశాల పట్ల అవగాహన అవసరం. చిన్న చిన్న విషయాలపై (సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, ప్యాకేజీ, లాంగ్వేజీ- వాటి మధ్య భేదాలు) ప్రశ్నలు వస్తుంటాయి. దాదాపుగా డిగ్రీలో అన్ని కోర్సులకూ కంప్యూటర్‌ ఒక పేపరుగా ఉంటుంది కాబట్టి, కంప్యూటర్‌ ప్రిపరేషన్‌ సులువే.

మార్కెటింగ్‌ ఆప్టిట్యూడ్‌, కంప్యూటర్‌ నాలెడ్జి విభాగంలో క్వాలిక్యులేషన్స్‌ వంటి సమయం ఎక్కువ పట్టే అంశాలు ఉండవు. కాబట్టి, తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు స్కోరు చేయడానికి అవకాశం ఉంది.
తప్పు సమాధానాలకు నెగిటివ్‌ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ 1/4 మార్కు కట్‌ అవుతుంది. సమాధానాలను గుర్తించేటప్పుడు వూహించి లేదా లాటరీ పద్ధతిలో సమాధానాలు గుర్తించడం సరైన పద్ధతి కాదు. కచ్చితమైన సమాధానాన్ని ధ్రువపర్చుకొని మాత్రమే ్చ్మ్మ్ఠ్ఝ్ప్మ చేయడం మంచిది.

ప్రిపరేషన్‌కు దాదాపుగా 3 నెలల సమయం ఉంది. కాబట్టి, చక్కని ప్రణాళికతో ప్రిపేర్‌ అవ్వొచ్చు.

చి ముందుగా క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ సబ్జెక్టుల ప్రాక్టీసు పేపర్లు వీలైనన్ని ఎక్కువగా సాధన చేయాలి.
చి మార్కెటింగ్‌ మౌలిక అంశాలు( ఫండమెంటల్స్‌) ముందుగా ప్రిపేర్‌ అయి తర్వాత ప్రస్తుత మార్కెటింగ్‌ అంశాలపై పరిశీలనాత్మక పరిజ్ఞానం (Observation of present marketing conditions) పెంపొందించుకొని చక్కటి నోట్సు తయారు చేసుకోవాలి.
చి జనరల్‌ అవేర్‌నెస్‌కు సుమారుగా 6 నెలల కరెంట్‌ అఫైర్స్‌ ప్రిపేర్‌ అయి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా పేపర్‌ చదవడం అవసరం.
చి ఇంగ్లిష్‌ సబ్జెక్టుకు గ్రామర్‌, ఒకాబులరీ ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టాలి.

అభ్యర్థి ఆత్మవిశ్వాసం, నిజాయితీ, ఆశావహ దృక్పథంలాంటి లక్షణాల పరిశీలనకు ఉద్దేశించిన వ్యక్తిత్వ పరీక్షే ఇంటర్వ్యూ.

ఎక్కువ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వచ్చినందున అభ్యర్థులు ప్రణాళికాబద్ధమైన ప్రిపరేషన్‌తో ఎస్‌బీఐ ఉద్యోగం సాధించవచ్చు.
3 నెలల ప్రిపరేషన్‌ ప్రణాళిక
జి.ఎస్‌. గిరిధర్‌
డైరెక్టర్‌ ళితిదిని ఇన్‌స్టిట్యూట్‌
ఎస్‌బీఐ నుంచి వచ్చిన భారీ నోటిఫికేషన్‌ నిస్సందేహంగా నిరుద్యోగులకు వరం లాంటిది. ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి శక్తివంచన లేకుండా శ్రమించాలి. పరీక్ష కోసం ఎలా సన్నద్ధం కావాలో, ఏ విధంగా సాధన చేస్తే విజయం వరిస్తుందో చూద్దాం.
‘చక్కని ప్రారంభంతో సగం పని పూర్తయినట్లే'నని నానుడి. కాబట్టి, మరో 3 నెలల సమయంలో జరగబోయే ఎస్‌బీఐ క్లరికల్‌ పరీక్ష రాసేవారు ఏవిధంగా సన్నద్ధంగా ఉండాలో ముందే ఒక అవగాహనకు రావాలి.

మొదట పరీక్ష విధానం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఎన్ని సబ్జెక్టులుంటాయి? వాటి సిలబస్‌ ఏమిటి? ఏ సబ్జెక్టుకు ఎంత సమయం కేటాయించాలి? లాంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి.

చిపరీక్షలో ఉండే ఐదు సబ్జెక్టుల్లో మొత్తం సిలబస్‌ కవరయ్యేలా పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ సేకరించాలి. ఇంతకుముందు పరీక్ష రాసిన అభ్యర్థుల, నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.
చిరోజుకు కనీసం 5-6 గంటలకు తక్కువ కాకుండా సమయం కేటాయించుకోవాలి. ప్రతి రోజూ అన్ని సబ్జెక్టులు కవర్‌ అయ్యేవిధంగా చూసుకోవాలి.
చి అన్నింటికీ ఒకేవిధమైన సమయాన్ని కాకుండా దాని క్లిష్టతను బట్టి కేటాయించడం సరైనది. Quantitative Aptitude, (Q.A.) Reasoning అధిక వ్యవధి పడుతుంది. కాబట్టి వాటికి ఎక్కువ సమయం కేటాయించాలి.

ప్రాథమికాంశాలపై పట్టు
అన్ని సబ్జెక్టుల సిలబస్‌ను పరిశీలించి దాని ప్రకారం ఆయా సబ్జెక్టుల్లో ఉండే అంశాలపై మంచి పట్టు సాధించాలి. శీ.తి.లో ఉండే అంకగణితం తిri్మ్త్ఝ్ఠ్మi్ఞలోని ప్రతి అంశంపై బాగా అవగాహన ఉండాలి.

చి గత ప్రశ్నపత్రాల్లో ఎక్కువ ప్రశ్నలు ఏ అంశాల నుంచి వస్తున్నాయో గమనించి, వాటిపై ఎక్కువ శ్రద్ద వహించాలి.
చి ఈ మధ్య కాలంలోని పరీక్ష పత్రాలను గమనిస్తే... ప్రస్తారాలు- సంయోగాలు (పర్మ్యుటేషన్స్‌ అండ్‌ కాంబినేషన్స్‌) నుంచి ప్రశ్నలు అధికంగా వస్తున్నాయి.
చి పరీక్షకు మూడు నెలల సమయం ఉంది కాబట్టి, అంకగణితంలోని అన్ని అంశాలలోని ప్రతి ప్రశ్నను కనీసం నాలుగైదు సార్లు సాధించేలా చూసుకోవాలి.
లెక్కలంటే బెరుకా?
గణితాన్ని ఇంటర్లో, డిగ్రీలో సబ్జెక్టుగా చదవని విద్యార్థులు లెక్కలంటే గాభరా పడాల్సిన పనిలేదు. ముందుగా తేలికపాటి ప్రశ్నలను సాధిస్తూ సన్నద్ధం కావాలి. తర్వాత క్లిష్టతను పెంచుకుంటూ వెళ్లాలి. వీరు మిగిలిన వారికంటే కంటే ఎక్కువ సమయం సాధనకు కేటాయించాలి. రోజూ కనీసం 4-5 గంటలైనా లెక్కలు అభ్యాసం చేయాలి.

చి శీతిప్రాక్టీస్‌ చేసేప్పుడు సాధారణ పద్ధతిలో కాకుండా ఇంకా సులభంగా చేయెచ్చునేమో గమనించాలి. దీంతో షార్ట్‌కట్‌ పద్ధతులు తెలుస్తాయి. కొన్ని ప్రశ్నలను సాధించకుండానే ఆప్షన్స్‌ను చూసే సరైన జవాబు గుర్తించవచ్చు. ప్రశ్నలో కండిషన్స్‌ ఇస్తే వాటికి ఈ పద్ధతి వర్తిస్తుంది. కొన్ని తరహా ప్రశ్నలు పరీక్షలో తరచుగా వస్తుంటాయి. వాటికి సూత్రాలు గుర్తుంచుకుంటే సరిపోతుంది.

అన్నింట్లోనూ...
చిఎస్‌బీఐ పరీక్షకున్న 3 నెలల సమయానికి ఒక టైమ్‌ టేబుల్‌ను రూపొందించుకోవాలి. ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులు కవర్‌ అయ్యేలా ప్రణాళిక వేసుకోవాలి. అన్నింటికిమించి ఆ టైమ్‌ టేబుల్‌కు కట్టుబడి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాక్టీస్‌ ఆపకూడదు.
చి బ్యాంకు పరీక్షలో విజయం సాధించాలంటే అన్ని సబ్జెక్టుల్లోనూ విడివిడిగా ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. కాబట్టి, అన్నింటికీ ప్రాధాన్యమివ్వాలి. సాధ్యమైనన్ని నమూనా పరీక్షలు (మాక్‌ టెస్ట్‌లు) చేయాలి. సమయం చూసుకుంటూ సాధన చేయాలి.
చి శీతి పేపర్‌ను 30 నిమిషాల్లో 40 ప్రశ్నలు సాధించేలా తయారవ్వాలి. క్లరికల్‌ పరీక్షలో చాలావరకూ ప్రాథమికాంశాల మీదనే ప్రశ్నలుంటాయి కాబట్టి ఆందోళన అనవసరం.
చి జనరల్‌ అవేర్‌నెస్‌ కోసం గత ఆరునెలల వర్తమాన అంశాల(కరెంట్‌ ఎఫైర్స్‌)పై అవగాహన ఉండాలి. ఇప్పటినుంచి పరీక్ష తేదీ వరకు ప్రతిరోజూ వార్తాపత్రికలను (ఈనాడు, ఎకనామిక్స్‌ టైమ్స్‌) కనీసం 2 గంటల పాటు పరీక్ష కోణంలో క్షుణ్ణంగా చదవాలి. ఎకానమీ వార్తలకు ప్రాధాన్యమివ్వాలి.
చి మార్కెటింగ్‌, కంప్యూటర్స్‌ సబ్జెక్టులపై చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఎంఎస్‌ ఆఫీస్‌ గురించి బాగా తెలిసి ఉండాలి. వాటి నుంచి ప్రశ్నలుంటాయి.
చి పరీక్ష సమయం వరకు అన్ని సబ్జెక్టులను కనీసం 2-3 సార్లు పునశ్చరణ అయ్యేలా చూసుకోవాలి. Mental calculations, Speed Maths బాగా ప్రాక్టీస్‌ చేయాలి.
మాదిరి ప్రశ్నపత్రాలను చేస్తున్నప్పుడు సబ్జెక్టుల క్లిష్టతను బట్టి సమయాన్ని కేటాయించుకోవాలి. తేలికపాటి ప్రశ్నలను ముందుగా చేసి ఆ తర్వాత కష్టమైన ప్రశ్నలను సాధించేలా సాధన చేస్తే పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు సాధించే వీలుంటుంది.

90 శాతం చేస్తేనే...
200 ప్రశ్నలుండే మాదిరి ప్రశ్నపత్రాల్లో 170-180 ప్రశ్నలను 90 శాతం ్చ్ఞ్ఞ్యr్చ్ఞ్వతో సాధించగలగాలి. అలా చేయగల్గినప్పుడే పరీక్షకు సరైనవిధంగా సిద్ధమైనట్లు. లేదంటే ప్రాక్టీస్‌ మరింత ముమ్మరం చేయాలి.

చి మాదిరి ప్రశ్నపత్రాలను చేస్తున్నప్పుడు సబ్జెక్టుల క్లిష్టతను బట్టి సమయాన్ని కేటాయించుకోవాలి. తేలికపాటి ప్రశ్నలను ముందుగా చేసి ఆ తర్వాత కష్టమైన ప్రశ్నలను సాధించేలా సాధన చేస్తే పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు సాధించే వీలుంటుంది.

పరీక్ష గదిలో...
ముందుగా జనరల్‌ అవేర్‌నెస్‌, మార్కెటింగ్‌, కంప్యూటర్‌ సబ్జెక్టులు, ఆ తర్వాత ఇంగ్లిష్‌ పూర్తి చేసి; మిగిలిన సమయంలో శీ.తి., ళ్ఠ్చ్బ్న్థిi్థ్ణ సబ్జెక్టులను చేస్తే సమయం కలిసొస్తుంది.

చి సాధారణంగా లెక్కలు చేస్తున్నప్పుడు ఎంత సమయం గడుస్తుందో తెలియదు. మిగిలిన సబ్జెక్టులపై ఆ ప్రభావం పడకుండా ఉండాలంటే లెక్కలను చివరలో చేయడం మంచిది.
చి ఏదైనా ప్రశ్నకు జవాబు వెంటనే స్ఫురణకు రాకపోతే దానిని వదిలేసి వేరొక ప్రశ్నకు వెళ్లడం మంచిది.
చి అన్ని ప్రశ్నలూ పూర్తిచేయలేకపోయామని ఆందోళన వద్దు. కానీ అన్ని సబ్జెక్టులలో కనీసం 80-90 శాతం ప్రశ్నలు చేసేలా జాగ్రత్త పడాలి.
ఈ సూచనలన్నింటినీ పాటిస్తే విజయం తప్పక లభిస్తుంది.