20 వేల హెచ్1బీ వీసాలు ఖాళీ
వాషింగ్టన్:భారతీయులు తీవ్రంగా పోటీపడే అమెరికా వీసాల్లో ఈసారి బోలెడు ఖాళీలున్నాయి. హెచ్1బీ వీసాల్లో 20 వేలు మిగిలి ఉన్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబోతుండగా ఇన్నేసి ఖాళీలు ఉండటం ఇదే తొలిసారి. ఆగస్టు 7 నాటికి హెచ్1బీ వీసాల కోసం 49 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయని అమెరికా పౌరసత్వ, వలస సర్వీసుల విభాగం అధికారులు పేర్కొన్నారు. 2010 ఆర్థిక సంవత్సరానికి వీసాల జారీ కోసం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టారు. తొలి అయిదురోజుల్లో 42 వేల దరఖాస్తులు రాగా, ఆ తర్వాత నెలన్నర కాలంలో కేవలం 7 వేలే వచ్చాయి. నాలుగు నెలలుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నా, ఖాళీలు అలాగే మిగిలిపోయాయి. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మందగమనం, నిబంధనల్ని నిక్కచ్చి అమలు, పెద్దమొత్తంలో దరఖాస్తుల్ని తిరస్కరించటం కూడా ఈ పరిస్థితి తలెత్తటానికి కారణంగా భావిస్తున్నారు.
Labels:
ఇది సంగతి