రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

పురంధేశ్వరి కుమార్తె వివాహ రిసెప్షన్‌


విశాఖపట్నం, న్యూస్‌టుడే: కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కుమార్తె నివేదిత వివాహ రిసెప్షన్‌ సోమవారం రాత్రి విశాఖలోని వాల్తేరు క్లబ్‌లో జరిగింది. విశాఖకు చెందిన అరుణ్‌తో నివేదిత వివాహం ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. రిసెప్షన్‌కు సినీ హీరో బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధరలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాలకృష్ణ సోదరుడు జయకృష్ణ, తారకరత్న, కేంద్రమంత్రి పల్లంరాజు, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి, మాజీమంత్రి కొణతాల రామకృష్ణ, మేయరు జనార్దనరావు, డి.ఐ.జి సౌమ్యమిశ్రా, కలెక్టర్‌ శ్యామలరావు, జీవీఎంసీ కమిషనర్‌ శ్రీధర్‌, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, అధికారులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.