రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

తిరుమలలో 40 రొజులకు


తిరుమల, న్యూస్‌టుడే: వర్షాభావ పరిస్థితులతో తిరుమలలో జలవనరులు అడుగంటిపోతున్నాయి. ప్రస్తుతం అకాశగంగ పూర్తిగా ఎండిపోయింది. గోగర్భం డ్యాం కూడా వట్టిపోయే దశకు చేరుకుంది. పాపవినాశనం డ్యాంలో మాత్రం కొంత నీరు ఉంది. తిరుమలలో ప్రస్తుతం రోజుకు 30 నుంచి 35 లక్షల గ్యాలన్ల నీరు వినియోగం అవుతోంది. పాపవినాశనం డ్యాంలో 2,260 లక్షలు, గోగర్భంలో 335 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులో ఉంది. ఈ మొత్తం నీటిలో 908 లక్షల గ్యాలన్లు అవిరవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇక మిగిలే నీరు 1,687 లక్షల గ్యాలన్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పాంచజన్యం, సన్నిధానం అతిధి భవనాలు భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి తితిదే చర్యలు చేపట్టింది. దీంతో రోజు వారీగా నీటి వినియోగం 40 లక్షల గ్యాలన్లకు చేరుకుంటుందని అంచనా. ఫలితంగా అందుబాటులో ఉన్న 1,687 లక్షల గ్యాలన్ల నీరు 40 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోనుంది. వచ్చే నెలలో శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో నీటి ఇబ్బందులు తీవ్రంగానే ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి.