దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు తప్పనిసరిగా నోటికి, ముక్కుకు గుడ్డ లేదా టిష్యూ పేపర్ అడ్డుపెట్టుకోండి. ఆ వెంటనే టిష్యూ పేపర్ పారెయ్యాలి. గుడ్డ అయితే ఉతకటానికి వేడినీటిలో వేసెయ్యాలి. చి చేతులు, వేళ్లు తరచుగా కళ్లు, ముక్కులు, నోటికి తగలకుండా చూసుకోండి. చిజలుబు లక్షణాలున్న వారి దగ్గరకు వెళ్లద్దు. ఎవరైనా తుమ్ముతున్నా, దగ్గుతున్నా.. వారి మనసుకు కష్టం కలగకుండానే.. ఓ మీటరు దూరంలో ఉండటం మేలు. చి ఫ్లూ జ్వర లక్షణాలు కనబడుతుంటే వెంటనే డాక్టరుకు చూపించుకోవటం అవసరం. మీ లక్షణాల గురించి ముందే ఆసుపత్రి సిబ్బందికి చెబితే.. మిమ్మల్ని త్వరగా చూసి అక్కడి నుంచి పంపేస్తారు. చి ఇంట్లోనూ, ఆఫీసులోనూ కూడా చేతులను తరచుగా సబ్బుతో కడుక్కోండి. ముఖ్యంగా దగ్గు, తుమ్ము తర్వాత తప్పనిసరిగా కడుక్కోండి. ముక్కు చీదిన ప్రతిసారీ చేతులు కడుక్కోవాలి. చి చుట్టుపక్కల ఎవరికి ఫ్లూ లక్షణాలున్నా తరచుగా చేతులు కడుక్కోవటం, మాస్కులు పెట్టుకోవటం.. ఈ రెండు చర్యలతోనే ఫ్లూ జ్వరాల వ్యాప్తిని చాలా సమర్థంగా అడ్డుకోవటం సాధ్యపడుతోందని అధ్యయనంలో తేలింది.
తీవ్రతలోనే తేడా
ఫ్లూ జ్వరానికీ, స్వైన్‌ఫ్లూ జ్వరానికీ ఆరంభ లక్షణాల్లో పెద్దగా తేడా ఉండదు. కాకపోతే మొదలైన తర్వాత.. సాధారణ ఫ్లూ జ్వరం దానంతట అదే క్రమేపీ తగ్గిపోయే రకం అయితే.. స్వైన్ ఫ్లూ మాత్రం చాలా వేగంగా ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. ఊపిరితిత్తుల్లోని కణజాలం దెబ్బతినటంతో పాటు లోపలంతా నీరు చేరిపోయే ప్రమాదం ఎక్కువ. దీంతో వేగంగా మరణం ముంచుకొస్తుంది. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో గొంతునొప్పి, తలనొప్పి, జ్వరం వంటి ఫ్లూ లక్షణాలు కనబడితే దాన్ని నిర్లక్ష్యం చెయ్యటానికి లేదు. తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.
నివారణ సాధ్యమే ముక్కుకు గుడ్డ కట్టుకోవటం, చేతులను తరచూ కడుక్కోవటం- ఈ రెండు చర్యల ద్వారానే ఫ్లూ, స్వైన్‌ఫ్లూలను నివారించుకోవటం సాధ్యమని తాజాగా రెండు అధ్యయనాలు స్పష్టంగా తేల్చి చెప్పాయి. ప్రస్తుతం జ్వరాలు వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రోగులను ఆసుపత్రుల్లో చేర్చి, పూర్తిగా అందరికీ దూరంగా ఉంచటం సాధ్యం కాకపోవచ్చు. అందుకని ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే జాగ్రత్తలు తీసుకోవటం అవసరమని హాంకాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు సూచిస్తున్నారు. ఫ్లూజ్వర బాధితులున్న 154 ఇళ్లలో అధ్యయనాలు చేసిన వీరు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు.
లక్షణాలు
దగ్గు,
తుమ్ములు
గొంతు నొప్పి
ముక్కు కారటం
వికారం,
నీళ్ల విరేచనాలు
తీవ్ర జ్వరం
తలనొప్పి
తీవ్రమైన బడలిక,
నిస్సత్తువ
విపరీతమైన ఒళ్లు నొప్పులు