ఇక ఏడాదికి రెండు ఐపీఎల్‌లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వన్ తర్వాత.. టూ కూడా సూపర్ హిట్ కావడంతో బీసీసీఐ రెట్టింపు ఆనందంతో ఉంది. ఇకపై ఏడాదికి రెండు టోర్నమెంట్‌లు ఉండొచ్చని ఐపీఎల్ ఛైర్మన్ లలిత్‌మోడీ సూచనప్రాయంగా తెలిపారు. అయితే.. పూర్తిస్థాయిలో నిర్వహించే టోర్నీ మాత్రం మనదేశంలోనే జరుగుతుంది. ఇక తక్కువ మ్యాచ్‌లతో నిర్వహించే సెకండ్ టోర్నీ మాత్రం విదేశాల్లో నిర్వహించాలన్న ఆలోచనలో మోడీ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. విదేశాల్లోనూ ఐపీఎల్‌కు మంచి డిమాండ్ ఉందని దక్షిణాఫ్రికాలో నిర్వహిస్తున్న ఐపీఎల్ టు రుజువుచేసింది. ఎన్నికల కారణంగా పూర్తి స్థాయి భద్రతను ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో.. టోర్నీ నిర్వహణను దక్షిణాప్రికాకు బీసీసీఐ తరలించింది.
Labels:
మీకు తెలుసా