రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

వరుణ యాగం


వచ్చేనెల July 2, 3, 4 తేదీల్లో హైదరాబాదులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున "వరుణ యాగం" నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పుష్కలంగా వర్షాలు కురవాలని కోరుతూ.. తిరుమల-తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ వరుణయాగం జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి విలేకరులతో తెలిపారు.

ఈ యాగం కోసం 108 హోమ గుండాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి అన్నారు. వేద పండితులు, రుత్వికులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని వెంకటరెడ్డి వివరాలందించారు. దీంతో పాటు రాష్ట్రంలోని వెయ్యి ప్రధాన దేవాలయాల్లో కూడా వరుణ జపాలు, సహస్ర ఘటాభిషేకాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు.

జూలై 2వ తేదీన హైదరాబాదులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభం కానున్న వరుణయాగం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రారంభిస్తారని, అలాగే ముగింపు రోజు కూడా సీఎం పాల్గొంటారని మంత్రి తెలియజేశారు.