"పాప్ కింగ్" మైకేల్ జాక్సన్ మృతి
పాప్ కింగ్ మైకేల్ జాక్సన్ గుండెపోటుతో మృతి చెందారు. పాప్ సంగీత ప్రపంచాన్ని కొన్నేళ్లపాటు శాసించిన మైకేల్ జాక్సన్ (50) శుక్రవారం వేకువజామున స్థానిక కాలమానం ప్రకారం 2.26 గంటల సమయంలో మృతి చెందారని అమెరికా అధికారిక వర్గాలు వెల్లడించాయి.
జాక్సన్‌కు గతరాత్రి గుండెపోటు రావడంతో లాస్ ఏంజెలెస్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికే ఆయనలో చలనం లేదని లాస్ ఏంజెలెస్ కౌంటీ కార్నర్స్ కార్యాలయ ప్రతినిధి ఫ్రెడ్ కారల్ సీఎన్ఎన్ ఛానల్‌తో చెప్పారు. రాత్రి 12.30 గంటల సమయంలో జాక్సన్‌కు గుండెపోటు వచ్చింది.
ఈ విషయాన్ని లాస్ ఏంజెలెస్ అగ్నిమాపక శాఖ వైద్య సిబ్బందికి సమాచారం అందింది. ఆ సమయంలోనే జాక్సన్ శ్వాస తీసుకోవడం లేదు. అనంతరం ఆయనను వైద్య సిబ్బంది రోనాల్డ్ రీగన్ యూసీఎల్ఏ మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఆస్పత్రికి తీసుకెళ్లిన తరువాత వైద్యులు ఆయన మృతి చెందినట్లు ధృవీకరించారు. మైకేల్ జాక్సన్‌కు అంతిమ నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఆస్పత్రి వద్ద, ఆయన నివాసం వద్ద గుమిగూడారు.
Labels:
సంగతులు