రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఘోష

సాఫ్ట్ వేర్ ఇంజనీరు - నాడు
ఒకప్పుడు:
@ హోం టౌన్(సొంత ఊరు): చుట్టాలు/బంధువులు/స్నేహితులు: ఏంటి బాబు వీకెండ్ అని ఇంటికి వచ్చావా...సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నావటగా....?? బాగానే ఇస్తునట్టున్నారుగా.... ఇంకేంటి సెటిల్ ఐపోయావు కదా... పెళ్ళి సంగతి ఏంటి...?? ఎంతలో ఉన్నారు మీ అమ్మావాళ్ళు (కట్నం)..? సాఫ్ట్ వేర్ ఇంజనీరే కదా బాగానె ఉండుంటుందిలే నీ రేట్...

@ హైదరాబాద్: ఆటో డ్రైవర్: సాబ్ నమస్తే సార్....రండి సార్ కూర్చోండి కూర్చోండి...ఎక్కడికి వెళ్ళాలి... ఎక్కడికైనా మినిమం 50 రూపాయలు మీకేంటి సర్...నెలకి ఒక 25,000 వస్తాయి కదా... మాకు ఇచ్చే 50 ఏమి లెక్కలే మీకు...

ఇంటి ఓనర్: ఏంటీ సాఫ్ట్ వేర్ కంపెనీలొ పని చేస్తున్నావా..?? ఐతే రెంట్ 7,000/- ప్రతీ మూడు నెలలకి మీకు హైక్స్ (ఇంక్రిమెంట్లు) వస్తాయట కదా..అదే విధంగా మా ఇంటికి రెంట్ కూడా 3నెలలకి ఒకసారి 750 ఇంక్రిమెంట్ అన్నమాట.... ఐనా ఇవి అన్నీ మీకు ఒక లెక్కా పాడా.... మీకు 31 రాత్రికి ఒక 30,000 వస్తాయట కదా...

షాపు ఓనర్: సార్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయ్యి ఉండి ఇంకా 25 రూపాయలకి కేజీ బియ్యం వాడుతున్నారు ఏంటి సర్..... ఇదిగోండి సార్ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కోసం 42 రూపాయలకి కేజీ బియ్యం .... అసలు మీరు అటూ ఇటూ తిరగనవసరం లేదు ......తిన్న వెంటనె అదే డైజెస్ట్ ఐపోతుంది సార్...అసలే సాఫ్ట్ వేర్ వాళ్ళు ఎటూ తిరగకుండా ఒకే కుర్చీలో కూర్చుని ఉంటారంటకదా ....సార్ ఇంకా లేటెస్ట్ ఇంపోర్టెడ్ పెర్ఫ్యుం లు కూడా వచ్చాయి సార్..ఒకటి తీసుకొని వెళ్ళి ట్రై చెయ్యండి...తరువాత మీకు నచ్చిన ఫ్లేవర్స్ తీస్కొని వెళ్ళొచ్చు...ఐనా మీ దగ్గర డబ్బులు ఎక్కడికి పోతాయి సార్....
నేడు.........

@ హోం టౌన్(సొంత ఊరు): చుట్టాలు/బంధువులు/స్నేహితులు: ఏంటి బాబు ఇంటికి వచ్చావు....కొంప తీసి తీసేసారా ఏంటి..?? అహ అంటే ఏమి లేదు ఈ మద్య అందరిని తీసేస్తున్నారు కదా..అందుకని.. ఐనా ఎందుకు అయ్యా ఆ సాఫ్ట్ వేర్ జాబులు... ఎప్పుడు తీసేస్తారో తెలియదు,ఉంచుతారో తెలియదు... మీ జాబ్ కే సెక్యూరిటీ లేనప్పుడు ఇక మీరు పెళ్ళి చేసుకొని ఏమి ఉద్ధరిస్తారు... అసలు మీకు ముందు అమ్మాయిలను ఎవరు ఇస్తారులే...

ఆటో డ్రైవర్: సార్ మరీ, చీ..చీ వీడిని సార్ ఏంటి ఇంకా....ఇదిగొ చూడు తమ్ముడు ఈ ఆటో వెళ్ళదు కాని ముందుకు పొయ్యి బస్టాప్ లో నుంచో.. నేను అడిగినంత ఇచ్చే పరిస్థితిలో నువ్వు లేవులే కాని..లైట్ తీస్కో......

ఇంటి యజమాని: బాబు మేము ఇల్లు ఫామిలీస్ కి ఇద్దాం అనుకుంటున్నాము.... మీరు త్వరగా ఖాలీ చెయ్యండి... ఐనా బాచిలర్స్ కి ఇంత పెద్ద ఫ్లాట్ అవసరంలేదనుకుంటా....కొంచెం చిన్నరూంలు ఉంటే చూసుకొని...అర్జెంటుగా ఏమి కాదులే..ఒక 5, 6 రోజుల్లో ఖాళీ చెయ్యండి...

షాపు ఓనర్: అరెయ్ ఎవరు అక్కడ.... వచ్చిన వాడికి ఎన్ని కేజీల బియ్యం(25రూపాయలకు కేజీ వి) కావాలో చూసి ఇచ్చి పంపండి..డబ్బులు ఇస్తేనే ఇవ్వండి....అప్పులేదని చెప్పండి...

ఆఖరికి అమ్మాయిలు కూడా చూడండి తమ పెళ్ళిళ్ళకు ఎటువంటి నిబంధనలు విధించారో :( !!
పెద్దగా చూడడానికి కింది చిత్రం మీద క్లిక్ చెయ్యండి.




ఇదీ నేటి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితం...

సాఫ్ట్ వేర్ ఉద్యోగులా ..??? మీకేంటి కేక అని మాకు లేని పొగరు తెప్పించేది మీరే... ఇంకా మీ పని ఐపోయింది గా అని చులకన చేసి నవ్వేదీ మీరే... సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా నిన్నటి దాకా వేలకి వేలు జీతాలు ఇచ్చి ఈరోజు నుంచి ఇక రావొద్దని ఎందుకు చెప్తారో తెలీదు...భారతదేశంలో ఓ ఉద్యోగిని కారణం చెప్పకుండా తీసేస్తే వాళ్ళ ఉద్యోగుల యూనియన్లు ఊరుకుంటాయా? ఊరుకోవు... కేవలం సాఫ్ట్ వేర్ ఉద్యోగులకి ఒక యూనియన్ లేకపోవటమే దీనంతటికీ కారణమా..??