రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

మసాలా మహారాణి దాల్


కావలసిన పదార్థాలు :
కందిపప్పు.... పావు కేజీ
అల్లం... చిన్నముక్క
పచ్చికొబ్బరి... కాస్తంత
ఉల్లిపాయలు... రెండు
పచ్చిమిర్చి... ఆరు
వెల్లుల్లి రెబ్బలు... రెండు
టొమోటోలు... నాలుగు
నూనె... వంద గ్రా.
పసుపు... చిటికెడు
నెయ్యి... రెండు టీ.
జీలకర్ర... ఒక టీ.
ఆవాలు... ఒక టీ.
కరివేపాకు... రెండు రెమ్మలు
నిమ్మకాయ... ఒకటి
కొత్తిమీర... ఒక కట్ట

తయారీ విధానం :
కందిపప్పులో కొద్దిగా పసుపు వేసి సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి. అల్లం, వెల్లుల్లి, కొబ్బరిని కలిపి ముద్దగా నూరి ఉంచాలి. బాణలిలో నూనె పోసి కాగిన తరువాత, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, టొమోటో ముక్కలను కూడా వేసి వేయించాలి.

ఇప్పుడు విడిగా ఉడికించి ఉంచిన పప్పను ఇందులో వేసి కలపాలి. కాసేపటి తరువాత మసాలా ముద్దను కూడా వేసి బాగా కలిపి, ఉప్పు సరిజూడాలి. విడిగా మరో బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకుతో తాలింపు చేసి ఉడుకున్న పప్పులో కలపాలి. చివర్లో నిమ్మరసం పిండి, కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే ఘుమఘుమలాడే మసాలా మహారాణి దాల్ రెడీ...!!