రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

పంజాబీ స్టైల్లో ఆలూ ప్రై


కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు... అర కిలో
నూనె... తగినంత
పెరుగు... కప్పు
నీళ్లు... తగినన్ని
మైదా... ఒక టీ.
కార్న్‌ఫ్లోర్... 3 టీ.
కరివేపాకు... అరకప్పు
కొత్తిమీర తురుము... ఒక టీ.
అల్లం వెల్లుల్లి తురుము... ఒక టీ.
కారం... ఒక టీ.
మిరియాలపొడి... ఒక టీ.
పచ్చిమిర్చి.. పది
ఉప్పు... తగినంత
ఫుడ్‌ కలర్... చిటికెడు

తయారీ విధానం :
బంగాళాదుంపలు ఉడికించి తొక్కతీసి ముక్కలుగా కోయాలి. ఓ గిన్నెలో కార్న్‌ఫ్లోర్‌, మైదా, కారం, మిరియాలపొడి, ఉప్పు, ఫుడ్‌కలర్‌, అల్లం-వెల్లుల్లి ముద్ద, పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి గుజ్జులా కలపాలి. ఇందులో బంగాళాదుంప ముక్కలు ముంచి తీయాలి. పది నిమిషాల తరవాత నూనెలో పకోడీల మాదిరిగా దోరగా వేయించాలి.

విడిగా ఓ కళాయి తీసుకుని రెండు టేబుల్‌స్పూన్ల నూనె పోసి కాయాలి. కరివేపాకు, పచ్చిమిర్చి ఓసారి కలిపి, వేయించిన ఆలూ ముక్కలు కూడా వేసి సన్నసెగమీద ఉంచాలి. కొద్దిగా నీళ్లు చల్లి బాగా వేగిన తరవాత కొద్దిగా కారం, కొత్తిమీర చల్లి దించాలి. అంతే ఘుమఘుమలాడే పంజాబీ స్టైల్ ఆలూ ప్రై రెడీ. దీన్ని స్నాక్స్‌గానూ, రొట్టెల్లోనూ లాగించేస్తే సరిపోతుంది. ఏమంటారు..?