భద్రం బీ కేర్ ఫుల్ సిస్టర్, భార్యగ మారకు ఓ సిస్టర్
షాదీ మాటే ఒద్దు చెల్లీ, సోలో బతుకే సో హ్యాపీ
మెడలో తాడుని కట్టాడు అని ఆనందించే ఆడోళ్ళు
ఆ తాడే తమ ఉరితాడన్నది ఆలోచించక చెడతారు
భార్యయ్యే ముహూర్తమే ఆడోళ్ళ సుఖాల ముగింపు చాప్టరు భద్రం
రక్షణకి భర్తెందుకులే లేడీ హాస్టళ్ళే చాలు
పిల్లలకై ఒకటా రెండా క్లోనింగ్ సెంటర్లు
కోతికి ఉందా కోడికి ఉందా ఈ పెళ్ళాచారం
జంటలు కట్టే జంతువులెరుగవు వెడ్డింగ్ విడ్డూరం
ఎందుకు మనకీ గ్రహచారం భద్రం
చచ్చి చెడీ డే అండ్ నైట్ చాకిరి చేస్తావు
చేసినది మావారంటూ నోట్లో ముద్దలు పెడతావు
రూపాయి కోసం పాపాయి లాగా దేహీ అంటావు
అన్నీ తెలిసీ అమాయకంగా బ్రతుకీడుస్తావు
కుక్కిన పేనై ఉంటావూ భద్రం
ఇల్లు అనీ వాకిలనీ తెగ ఫీలైపోతావు
పండగలొస్తే వంటలు చేసి మూలన పడతావు
మొగుడుకి ఉందా మొగాడి కుందా ఈ ప్రేమావేశం
రోగం వస్తే విరామముందా ఏమీ విడ్డూరం
ఎందుకు నీకీ ఆరాటం భద్రం