కావలసిన పదార్థాలు :
రాగిపిండి... అరకేజి
బియ్యం... రెండు కప్పులు
నీళ్లు... తగినన్ని
ఉప్పు... సరిపడా
తయారీ విధానం :
బియ్యంలో మామూలుగా పోసే రెట్టింపు కొలత కన్నా మరికాస్త ఎక్కువ నీళ్లు పోసి అన్నం ఉడికించాలి. అన్నం మూడువంతులు ఉడికిన తరవాత దించి గరిటెతో మెత్తగా మెదపాలి. తరవాత మళ్లీ స్టవ్‌మీద పెట్టి నెమ్మదిగా రాగిపిండి పోస్తూ తిప్పాలి. తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలియదిప్పి, మరికాసేపు ఉడికించాలి.
అన్నం మెత్తగా, బాగా దగ్గరగా ఉడికి ముద్ద చేసేందుకు అనువుగా తయారైనట్లు అనిపిస్తే, దించేసి చల్లార్చాలి. కాస్త వేడిగా ఉన్నప్పడే కొద్ది కొద్దిగా అన్నం తీసి చిన్న చిన్న ముద్దల్లాగా చేసి ఉంచుకోవాలి. అంతే సీమ స్పెషల్.. రాగి సంకటి తయారైనట్లే...!
ఇది వేడిగా ఉన్నప్పుడే... వేడి నెయ్యి, వేరుశెనగ పచ్చడితో లేదా... నాటుకోడి కూరతో కలిపి తింటే అద్భుతమైన రుచితో మిమ్మల్ని అలరిస్తుంది. కావాలంటే, మీరు కూడా ట్రై చేసి చూడండి మరి...!!