రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

చైనా మీరాబాయి


ఆమె ఒంటరి. కానీ ఆ మాట అంటే ఒప్పుకోదు. తనకు తోడు కృష్ణుడు వున్నదంతుంది. ఆయన్ను ప్రేమిస్తుంది పూజిస్తుంది. అయితే , ఆమె మన మీరాబాయి కాదు. చైనా దేశస్తురాలు వెన్ కున్ రాంగ్. కలకత్తా లోని చైనా టౌన్ లో Restaurent ని నిర్వహిస్తున్న 54 ఏళ్ల కున్ రాంగ్ కు కృష్ణుడంటే అపారమైన ప్రేమ. దేశ దేశాలు తిరిగి ఎన్నో హావభావాల్లో వున్నా 20 వేల కృష్ణుడి ఫోటోలు, బొమ్మలను కుడా సంపాదించింది. అసలు హిందూ మతం గురించి తెలియని చైనా మహిళకు కృష్ణుడి తో అనుబందం ఎలా ఏర్పడిందో తెలుసా..... 20 ఏళ్ల వయసు లో కున్ రాంగ్ కు ఓ బెంగాలీ స్నేహితురాలు కృష్ణుడి బొమ్మను బహుమతిగా ఇచ్చిన దంట. దాన్ని చూసిన క్షణంలో ఆమెకు ఏదో తెలియని మధురానుభూతి . తరువాత ఆ కృష్ణుడే ఆమెకు జీవితమయ్యాడు. కృష్ణుడే ఎదురుగ వున్నట్లు గడిపేస్తుంది. కున్ రాంగ్ ఎవరైతే నేఁ ........ ప్రేమ ప్రేమే ..........