రవ్వ పులిహోర
చింతపండు లేదా నిమ్మతో చేసే అన్నం పులిహోరకు ప్రత్యామ్నాయమిది
కావలసిన పదార్థాలు: బియ్యంరవ్వ- నాలుగుకప్పులు, చింతపండుగుజ్జు- -పావుకప్పు, నూనె-పావుకప్పు, పసుపు-పావుచెంచా.
తాలింపు కోసం: ఆవాలు - చెంచా, వేరుశెనగపప్పు - పావుకప్పు, పచ్చి శెనగపప్పు, మినపప్పు - రెండు చెంచాల చొప్పున, ఎండుమిర్చి - ఐదారు, కరివేపాకురెబ్బలు - నాలుగు, నిలువుగా తరిగిన పచ్చిమిర్చి-ఐదారు.
తయారీ: ముందుగా వెడల్పాటి పాత్ర తీసుకుని ఎనిమిది కప్పుల నీరుపోసి.. రెండుచెంచాల నూనె, పసుపు వేయండి. మరుగుతున్నప్పుడు బియ్యంపిండిని కలిపి సన్ననిమంటపై ఉడకనివ్వాలి. దీన్ని మరో పాత్రలోకి తీసుకుని ఆరనివ్వండి. బాణలిలో నూనె వేసి.. కరివేపాకు, పచ్చిమిర్చి, చింతపండుగుజ్జు తప్ప.. మిగిలిన పదార్థాలన్నీ వేయించండి. ఇందులో చింతపండు గుజ్జు తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు... వేసి.. ఉడకనివ్వండి. ఈ పులుసును నేరుగా బియ్యంరవ్వలో వేసి కలపాలి. అంతే.. రవ్వపులిహోర రెడీ. మరికాస్త రుచికోసం.. చిటికెడు మెంతపొడి, వేయించిన జీడిపప్పు పలుకులు కూడా చేర్చుకోవచ్చు.
Labels:
ఎంత రుచి రా