ఎప్పుడొచ్చావు నా గుండెలోకి... చప్పుడైనా చేయకుండా...
ఏమి చెప్పావు నా మనసుకి... నాకేమాత్రం తెలియకుండా...
ఏ మంత్రం వేశావు నామదికి... నీవు తప్ప మరో ఆలోచన లేకుండా...
ఏ మాయ చేశావు నాలోని తలపులకి... నిత్యం నీ ధ్యాసే తప్ప మరేదీ రాకుండా...
అన్నీ నువ్వు చేస్తావు... కానీ నా మాట మాత్రం పట్టించుకోనంటావు...
ప్రేమంటే ఆట నీకు... కానీ నీతోటి ప్రేముంటేనే జీవితం నాకు...