తిరుమలేశునికి బంగారు గంగాళం
కలియుగ ప్రత్యక్షదైవం, తిరుమలేశునికి భక్తులు కానుకల వర్షం కురిపిస్తున్నారు. భక్తుల కొంగుబంగారంగా కోరిన వరాలను ప్రసాదించే ఆపదమొక్కులవాడికి సోమవారం రూ. 3కోట్ల విలువైన స్వర్ణ గంగాళం కానుకగా అందింది. ఢిల్లీకి చెందిన ఓ అజ్ఞాత భక్తులు దీన్ని వెంకన్నకు కానుకగా అందజేశారు.
అభిషేకం, తిరుమంజన సేవల్లో దీన్ని ఉపయోగించే దిశగా సుమారు 18 కిలోల బంగారంతో గంగళాన్ని తయారు చేసినట్లు టీటీడీ ఛైర్నన్ డీకే ఆదికేశవులనాయుడు అన్నారు.
ఈ గంగళాన్ని ఆ అజ్ఞాత భక్తుడు ఆదికేశవులనాయుడుకు అందజేస్తూ.. తాను గతంలో అభిషేక సేవలో పాల్గొన్నపుడు స్వామివారి సేవలో వెండి గంగాళాన్ని ఉపయోగించడం చూసి బంగారు గంగాళాన్ని కానుకగా అందించాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.
Labels:
హరే శ్రీనివాసా