రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

మఖ్‌మల్‌పూరీ


ఏదో ఒక స్వీట్‌ కాకుండా... నట్స్‌తో చేసే వెరైటీ పూరీ ఇది.
కావలసిన పదార్థాలు: మైదా, బాదం, జీడిపప్పు, పిస్తా - కప్పు చొప్పున, పంచదార, బొంబాయిరవ్వ - ఒకటిన్నర కప్పు చొప్పున, యాలకుల పొడి- అరచెంచా, నెయ్యి- రెండుచెంచాలు, నూనె-వేయించేందుకు సరిపడా.
తయారీ: మైదాను నీరు ఆ తర్వాత నెయ్యితో పూరీపిండిలా కలిపి నాననివ్వాలి. బాదం, పిస్తా, జీడిపప్పు ఒక నిమిషం మిక్సీలో తిప్పి... ఆ తర్వాత పంచదార కలిపి.. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా పొడిచేయాలి. దీనికి యాలకులపొడి, వేయించిన బొంబాయిరవ్వ కలపాలి.
ఇప్పుడు మైదాపిండిని మరోసారి కలిపి.. చిన్నచిన్న ఉండల్లా చేయాలి. చేత్తోనే పూరీలా చేసి.. మధ్యలో ముందుగా సిద్ధం చేసిపెట్టుకున్న మిశ్రమాన్ని చెంచా వేసి.. చుట్టూ మూసేయాలి. పూరీ కాస్త మందంగానే వత్తి నూనెలో వేయించి తీయాలి. అంతే..మఖ్‌మల్‌పూరీ సిద్ధం.
చల్లారాక డబ్బాలో వేస్తే.. పదిరోజుల దాకా నిల్వ ఉంటాయివి.