రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

ఆనంద నిలయాలు

శ్రీ వారి భక్తులకు శుభవార్త. వసతి గదుల కోసం అష్టకష్టాలు పడే రోజులు దూరం కానున్నాయి. భక్తులు కోరుకునే స్తాయిలో వసతి సౌకర్యం లభించే రోజులు దగ్గర పడుతున్నాయి. ఎలాంటి సిఫార్సులు లేకుండా కాటేజీలను పొందే అవకాశం భక్తులకు కలగనుంది. ప్రస్తుతం 35 వేలమందికి వసతి సౌకర్యం అందుబాటులో వుండగా మరో 20 వేల మందికి వసతి లభ్యం కానుంది. TTD కోట్లాది రూపాయలు వ్యచ్చించి భారిగా వసతి సముదాయాలు నిర్మిచింది. పాంచజన్యం, నందకం, గోకులం, గోగర్భం, హిల్ వ్యూ , ఆళ్వార్ ట్యాంక్ పేర్లతో భక్తులకు వసతి గృహాలు అందుబాటు లోకి రానున్నాయి. వీటితో పాటు ప్రైవేటు వారు నిర్మించిన 30 అతిథి గృహాలు నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయి. ప్రస్తుతం యాత్రీసదన్-2 వెనుక రూ. 17 కోట్ల వ్యయం తో 390 గదుల తో 'పాంచ జన్యం' పేరుతో అతిథి గృహం నిర్మాణం పూర్తి చేసుకుంది. త్వరలో ప్రారంభానికి ముస్తాబు ఆగుతోంది. ఈ సముదాయం ద్వారా రెండు వేల మంది భక్తులు బస చేయడానికి సౌకర్యం వుంటుంది. గరుడాద్రి నగర్ ప్రాంతంలో VIP లకు ఉపయోగకరంగా 'హిల్ వ్యూ' పేరుతో రూ. 18 కోట్ల వ్యయం తో పూర్తి అయింది.