నెహ్రూ గారి మాటలు
రాష్ట్రపతి ఓ కాలేజీని సందర్శించి అక్కడి విద్యార్ధులతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో వాళ్ళేమి కావాలనుకుంటున్నారో అడిగి తెలుసుకుంటున్నారు."నేను డాక్టర్‍ని అయ్యి పేదలకు ఉచితంగా వైద్యం చేస్తా" అన్నడు రమణ."నేను ఇంజినీరునై దేశాన్ని అభివృద్ది పధంలోకి తీసుకెళ్తా" చెప్పాడు గోవింద్"నేను మంచి తల్లినవుతా. చదువుకున్న బాధ్యతాయుతమైన తల్లి వల్లనే పిల్లలు మంచి పౌరులుగ రూపొంది దేశం బాగుపడుతుందన్నారు నెహ్రూ గారు " అంది దీప."మరి నువ్వో?" మౌనంగా ఉన్న హరిని అడిగారు రాష్ట్రపతి"నెహ్రూగారి మాటలను నిజం చేసేందుకు నా వంతు సహకారం అందిస్తా" దీపకేసి ఓరగా చూస్తూ చెప్పాడు హరి.
Labels:
వినోదం