Rajasekar - Jeevitha
తమిళ చిత్రాలతో తెరంగేట్రం చేసిన రాజశేఖర్, జీవితలు 'తలంబ్రాలు' చిత్రంలో తొలిసారిగా కలిసి నటించారు. తలంబ్రాలు సూపర్ హిట్ కావడంతో ఆ తరువాత వారిరువురు కలిసి నటించిన 'ఆహుతి', 'ఇంద్రధనస్సు', 'అంకుశం', 'మగాడు' చిత్రాలు మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. 'తలంబ్రాలు' చిత్రీకరణ సమయంలో వీరిరువురు ప్రేమలో పడ్డారు. అయితే వీరి ప్రేమను పెళ్లి పట్టాలపై చేర్చేందుకు అవసరమైన గ్రీన్ సిగ్నల్‌ను ఇచ్చేందుకు ఇరు కుటుంబాల పెద్దలు తొలుత తటపటాయించారు. 'మగాడు' సినిమా షూటింగ్ సమయంలో రాజశేఖర్‌కు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆసుపత్రిలో ఆయనకు జీవిత చేసిన సపర్యలు ఇరు కుటుంబాల పెద్దలను ఆకట్టుకున్నాయి. దాంతో రాజశేఖర్, జీవితలు ఒక ఇంటివారయ్యారు.
Labels:
Hit Pairs