రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

బఠాణీ భాజీ




కావాల్సిన పదార్థాలు:

ఉడికించిన బఠాణీలు : 2 కప్పులు
టొమాటో ముక్కలు : కప్పులు
సిమ్లా మిర్చి : 100 గ్రాములు
ఉల్లి ముద్ద : కప్పు
కొబ్బరి పొడి : 2 టీ స్పూన్స్
వెల్లులి రేకలు : రెండు
కొత్తిమీర : ఒక కట్ట
దనియాల పొడి : అర టీస్పూన్
జీలకర్ర పొడి : అర టీస్పూన్
పసుపు : చిటికెడు
ఉప్పు : రుచికి సరిపడా

తయారు చేయు విధానం : బఠాణీలను ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. మరుసటిరోజు నానిన బఠాణీలను కుక్కర్ లో వేసి ఒక్క విజిల్ రానివ్వాలి. దనియాలను, జీలకర్రను దోరగా వేయించుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీరను, ఉల్లిపాయలను విడివిడిగ శుభ్రంగా కడిగి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వెల్లులి రేకలు, ఉల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత పసుపు, కారం, దనియాలపొడి, జీలకర్ర పొడి, సిమ్లామిర్చి వేసి మరో అయిదు నిమిషాలు వేయించిన తర్వాత బఠాణీలను వేసి కలబెట్టాలి. తర్వాత కొత్తిమీర ముద్ద, ఉప్పు, కొబ్బరిపొడి వేసి రెండు కప్పుల నీళ్ళు పోసి మరి కొంచెం సేపు ఉడకనివ్వాలి. చివరగా టొమాటో ముక్కలు వేసి ఐదు నిమిషాలు సన్నటి సెగమీద మగ్గనించి దించేసుకోవాలి. ఈ బఠాణీ భాజీ రోటీలోకీ అన్నంలోకీ చాలా బాగుంటుంది.