రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

ప్రియుని ఆకట్టుకోవడానికి ప్రేయసి




ప్రేయసి చెప్పే తీయటి కబుర్లు, ఆమె నిత్యం పొగిడే పొగడ్తలకు ప్రేమికుడు "ప్లాట్" అయిపోవాల్సిందేనట. ఇంకా ప్రియుని ఆకట్టుకోవడానికి ప్రేయసి ఏం చేస్తుందో ఇలా చెప్పుకొచ్చారు.

కోకిల స్వరంతో ప్రేమికుడు "ప్లాట్":  ప్రేమికుడు చెప్పలేని బాధతో సతమతమవుతున్నప్పుడు ప్రేమ మైకాన్నంతా గొంతులో పూరించి తన "కోకిల" స్వరంతో తాజా మాటలతో అతడిని మహా మజా చేస్తుంది.

ఆకర్షించే దుస్తుల్లో "మనసంతా నువ్వే":  ప్రేమికునికి తెలియకుండా అతడికి ఇష్టమైన రంగులేమిటో తెలుసుకుని ఆ రంగు దుస్తులను ధరిస్తూ ప్రేమికుడి మనస్సును ఆక్రమిస్తుంది.

సాయంత్రపు సమావేశాల్లో "కిస్సింగ్స్":  సాయంత్రం వేళల్లో వీలున్నప్పుడల్లా అతడితో గంటల తరబడి సమావేశమవడానికి చొరవ చూపుతుంది. ఈ సమావేశంలో తీయని ప్రేమ కబుర్లు షురూ. మాటలమధ్యలో అప్పుడప్పుడు అతడికి ముద్దులు, కౌగలింతలు రుచి చూపిస్తుంది.

కళ్లలో కనిపించే ప్రేమ "కసి":  పొరపాటున ప్రేమికుడు పిలిచిన సమయానికి రాలేకపోయినప్పుడు సదరు ప్రియురాలిపై అలిగే అవకాశం ఉంది. ఆ సమయాల్లో మత్తెక్కించే అత్తరు చల్లుకుని అతడు తనపై కోపాన్ని ప్రదర్శించక మునుపే తన కనుల ద్వారా ప్రేమ మైకాన్ని నింపి చుట్టేస్తుంది.

మృదువైన చేతి స్పర్శ "తహ తహ":  ఇది అత్యంత మత్తెక్కించే ప్రేమ క్రియ. నడిచి వెళుతున్న సమయంలో ప్రేమికుని చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కుతూ... మధ్యమధ్యలో గారాలు పోతూ... అతడు ఆమెను వదల్లేని స్థితికి చేరుస్తుంది. ఆ అనుభవాన్ని చవిచూసిన ప్రేమికుడు తిరిగి ఆ స్పర్శకోసం ఎపుడు తెలవారుతుందా అని చూస్తాడు.

పూలు తెచ్చే ప్రేమ "మూడ్":  పరిచయమైన తొలి రోజుల్లో అన్ని రకాలు పుష్పాలను అలంకరించుకుంటుంది. వాటన్నిటిలో ఏదో ఒక రకమైన పుష్ప జాతులు అంటే తనకు ఇష్టమని ప్రియుడు చెపుతాడు. అతడు చెప్పిన ఆ పూల రకాలను ధరిస్తూ అతడి మదిని నిత్యం తన ఆలోచనలతో పిచ్చెక్కిస్తుంది.

లేత రంగు పెదవుల "ముద్ర":  నెలలో ఏదో ఒకరోజు... అతని ఎదుటే పెదవులకు రంగులద్ది తన తీయటి అధరాలను అందించి మత్తెక్కిస్తుంది. ఆ తీపి ముద్దు తాలూకు ముద్ర అతని ఎద లోతుల్లో అలా నిక్షిప్తమైపోతుంది. ఇక ప్రేయసిని మరువలేడతడు.