రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

రాజశేఖర్‌రెడ్డి దేవాలయం

రూ. కోటితో తిరుపతిలో రాజశేఖర్‌రెడ్డి దేవాలయం
దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టరు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దేవాలయాన్ని తిరుపతిలో నిర్మించనున్నామని తుడా ఛైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్థానికంగా మంగళవారం ప్రకటించారు. తన కుటుంబ పెద్దల అనుమతితో రూ. కోటి వ్యయంతో దేవాలయం, సమావేశ మందిరం, ఇటీవల తాను రాజశేఖర్‌రెడ్డిపై చేసిన పీహెచ్‌డీ పరిశోధక వ్యాసాలను గ్రంథాలయంగా ఏర్పాటు చేసేందుకు సంకల్పించానన్నారు. పార్టీలకు అతీతంగా నిర్మించే ఈ దేవాలయాన్ని తన సొంత స్థలంలో 3నెలల కాలంలో పూర్తిచేస్తామన్నారు. దేవాలయంలో రాజశేఖర్‌రెడ్డి పాలరాతి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. రాజశేఖర్‌రెడ్డికి సంబంధించిన సీడీలు, ఫొటోలు ఏ సమాచారం ఉన్నా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తుడా ఛైర్మన్‌, తుడా కార్యాలయం, తిరుపతి చిరునామాకు పంపాలన్నారు. 098495 45556 సంప్రదించవచ్చన్నారు.