రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

గాయపడిన మనసు వ్యధ - జ్ఞాపకాల ప్రే మ క ధ


నీ అడుగులో అడుగెయ్యాలని
నీ వెనకే నిలుచున్నాను
నీ అడుగు మరో అడుగులో పడుతుందని
నా జీవితం మరోకరితో యేడడుగుల పయనం అని
ఆ నిమిషం తెలియలేదు

నీ మాటలే నా పలుకవ్వాలని
నా మాటలకి మౌనం నేర్పాను
నీ మాటలే కరువౌతాయని
నా పలుకు మూగబోతుందని
ఆ నిమిషం తెలియలేదు

నువు నాతో ఉంటే యే 'చిక్కు' ముడులై తే
నా దారికి అడ్డమేంటిలే అను కు న్నా
నీకు పడ్డ మూడు ముళ్ళలో
నా ఊపిరి చిక్కుకు పోతుందని
ఆ నిమిషం తెలియలేదు

అందుకే . . .

కనులకు కనబడకున్నా . . . కన్నీటితో కనిబెడుతున్నా . . .
రాయభారమే వద్దనుకున్నా . . . హృదయభారమే మోస్తున్నా . . .
విరహమై నను వేదిస్తున్నా . . . దూరమై నిను గమనిస్తున్నా . . .
ఈ బంధం కలువదని తెలుసున్నా . . . నీ ఆనందం చాలని బ్రతికేస్తున్నా  . . .



కాని ఒకటి మాత్రం ని జం . . .

ఒంటరితనపు వెన్నెలలో మనసు వేదనతో వణుకుతుంటే,
నీ మాటలు చలిమంటలై నునువెచ్చగ తాకిన సమయాన,
అరుణమై అస్తమిస్తున్న ఆశ కూడ ఊపిరందుకోని ఉదయిస్తుంది.
శిదిలమై జారిపోతున్న సంతోషం కూడ పెదవిపై పదిలమవుతుంది.
ఇరుమనసుల సంగమంలో చిరునవ్వు చిగురిస్తుంది.
చెలివలపుల తాకిడితో మదిలో తొలిప్రేమ మళ్ళి  చిగురిస్తుంది . . .