రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

Showing posts with label హరే శ్రీనివాసా. Show all posts
Showing posts with label హరే శ్రీనివాసా. Show all posts

Tirupati Laddu Facts


Laddu, or Ladoo, is one of the most important offering and prasadam given to devotees at the Tirumala Tirupati LordVenkateswara Temple. Tirupati Laddu is a spherical-shaped sweet made of flour and sugar. In fact, Tirupati and the huge laddus are synonymous. It is a customary duty of a devotee returning from Tirupati Balaji Temple to distribute ‘laddu’ as prasadam to his neighbors, friends and relatives.
Some quick facts about Tirupati Laddu
  • Around 150,000 laddus are made daily.
  • One laddu is given free to each devotee; the number of daily devotees that visit the temple is around 50,000.
  • A devotee can buy extra two laddus – a small laddu costs 25 rupees and big laddu costs 100 rupees.
  • The revenue from the sale of laddu annually is more than 11 million rupees.
  • Each laddu weighs around 100gms and is huge when compared with the normal laddu found in shops.
  • There is a super huge Tirupati Laddu known as Kalyana Laddu and it weighs around 500gms – ½ a kilogram.
  • Single largest laddu made is said to have weighed 32 kg.
  • The tradition of Tirupati Laddu is nearly 300 years old.
  • It is prepared by special hereditary priests known as archakas in special temple kitchen known as ‘potu’.
  • Ingredients used in Tirupati Laddu are Besan flour (kadalai mavu), Sugar, Cashew nuts, Cardamom, Ghee, Oil, Sugar candy, Raisins and Almonds.
On a day around 5000 kg of Besan flour is used.
Sugar around 10000 kg.
Cashew nuts around 600 kg.
Cardamom 150 kg
Ghee 300 liters
Sugar candy 400 kg
Raisins 540 kg
  • The ingredients are bought at the auction at the Commodities and Spices Exchange in Kochi.
Tirumala Tirupati Devasthanams (TTDs) the administrating body of the temple is planning to patent the Tirupati Laddu to stop counterfeits.

భక్తులకు అదనంగా ప్రసాదం

 తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అదనంగా పొందడానికి భక్తులు అధిక సంఖ్యలో పోటీపడ్డారు. తిరుమల, తిరుపతి దేవస్థానం ఒక్కో భక్తుడికి అదనంగా నాలుగు లడ్డూలు వంతున విక్రయించే కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించింది. లడ్డూ ప్రసాదం పొందడానికి భక్తులు ఉత్సాహంగా క్యూలైన్లలో రాత్రి వరకు కూడా బారులు తీరి కనిపించారు. ఎలాంటి సిఫార్సు లేకుండా లడ్డూలు పొందగలిగామనే సంతృప్తి వారిలో కనిపించింది. ఇది వరకు లడ్డూ పడి టిక్కెట్లు జారీ చేసే కేంద్రాల నుంచి టిక్కెట్లు ఇస్తున్నారు. టిక్కెట్లు పొందిన భక్తులు లడ్డూ వితరణ కేంద్రంలో ఏ కౌంటరు నుంచైనా ప్రసాదం పొందే అవకాశం కల్పించారు. రాత్రి వరకు 50 వేల వరకు లడ్డూలను యాత్రికులకు విక్రయించారు.

ఆనంద నిలయం అనంత స్వర్ణమయం



తితిదే చేపట్టిన ‘ఆనంద నిలయం అనంత స్వర్ణమయం' పథకంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ జరపాలని నిర్ణయించడంతో దేవస్థానం అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ భక్తుడు రూ.ఐదు కోట్లు విలువ చేసే 25 కిలోల బంగారం ఇవ్వడానికి వచ్చి వెనక్కు తీసుకువెళ్లిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ఓ భక్తుడు 25 కిలోల బంగారంతో పాటు తితిదేలోని ఓ అధికారిని కలుసుకున్నారు. తాను ‘ఆనంద నిలయం అనంత స్వర్ణమయం' పథకానికి వితరణ చేయడానికి వచ్చినట్లు తెలిపారు. పూర్తి వివరాలు రాసుకుని వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో ఆలయానికి బంగారం తీసుకురావాల్సిందిగా అధికారి దాతకు సూచించారు. చట్టపరంగా ఉన్న ఇబ్బందులు కారణంగా తాను చిరునామా వివరాలు ఇవ్వలేనని, బంగారం తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. సిబ్బంది నిరాకరించడంతో భక్తుడు అసంతృప్తితో బంగారం తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అనంత స్వర్ణమయం




ఆనంద నిలయం- అనంత స్వర్ణమయం

తిరుమలేశుని ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు తితిదే ఛైర్మన్‌ ఆదికేశవుల నాయుడు ఆధ్వర్యంలో ‘ఆనంద నిలయం- అనంత స్వర్ణమయం' పేరుతో భారీ పథకం చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రధానాలయాన్ని బంగారంతో తాపడం చేయాలన్నది ఈ పథకం ఉద్దేశం. ఇందుకుగాను మొత్తం 200 కిలోల బంగారం అవసరం అవుతుందని అంచనా వేశారు. గత సంవత్సరం అక్టోబరు 1న అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకూ 100 కిలోల బంగారాన్ని సేకరించారు. ఆలయానికి అమర్చేందుకు గాను ముందు రాగి రేకులను సిద్ధం చేసి వాటిని బంగారంతో తాపడం చేసే పని దాదాపు పూర్తి కావచ్చింది. వీటిని ఆలయానికి అమర్చాల్సి ఉంటుంది. ఈ భారీ ప్రాజెక్టులో అక్రమాలు కూడా భారీగానే జరిగాయని అందిన ఫిర్యాదుల మేరకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రంగంలోకి దిగింది. పథకానికి అవసరమైన బంగారం అంతా దాతల నుంచే స్వీకరిస్తున్నారు. తితిదే విజ్ఞప్తి చేసిందే మొదలు దాతలు భారీగా విరాళాలు ఇవ్వడం మొదలుపెట్టారు. సామాన్య భక్తుల నుంచి పారిశ్రామిక వేత్తల వరకూ తమకు చేతనైనంత సాయం చేస్తున్నారు.

కార్తీక బ్రహ్మోత్సవాలు


తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 13 నుంచి 22 వరకూ జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం ఉదయం తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉత్సవాల వాల్ పోస్టర్ ను టిటిడి పాలకమండలి చైర్మన్ డి.కె. ఆదికేశవులు నాయుడు, టిటిడి కార్యనిర్వహణాధికారి ఐవైఆర్ కృష్ణారావు విడుదల చేశారు. అనంతరం వారిద్దరూ అమ్మవారి ఆలయ లోపల ఉన్న అయన మహల్ ను తనిఖీ చేశారు.

అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నవంబర్ 13న ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 17న గజవాహన సేవ ఉంటుంది. 20వ తేదీన రథోత్సవం, 21న పంచమీతీర్థం, 22న పుష్పయాగం నిర్వహిస్తామని టిటిడి చైర్మన్, కార్యనిర్వహణాధికారి తెలిపారు. వాల్ పోస్టర్ విడుదల కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ శ్రీమతి సరస్వతి, నారాయణశెట్టి, ఆలయ పూజారులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

మహాప్రసాదం!


ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారికి పదవీగండం ఉందని ప్రచారం జరిగింది. దీంతో ఆ ఖాకీబాసు తిరుపతి లడ్డూలు పట్టుకుని ఓ కీలకనేత దర్శనానికెళ్లారు. అనుకున్నట్టే, రెండ్రోజుల్లో దొరగారి పదవి వూడింది. కానీ, బొత్తిగా పన్లేని సీట్లో కూర్చోబెట్టకుండా, కాస్త గౌరవప్రదమైన బాధ్యతే కట్టబెట్టారు. తిరుపతి లడ్డూ రాయబారం పనిచేసిందన్నమాట!
తిరుపతి లడ్డూలు చేతిలో ఉంటే తిరుగే ఉండదు. సీఎం పేషీకెళ్లినా ప్రైమ్‌మినిస్టర్‌ ఆఫీసుకెళ్లినా పనులు చకచకా జరిగిపోతాయి. ఇక అమెరికాకెళ్తే, సాక్షాత్తు శ్రీవేంకటేశుడే వచ్చినంత సంబరపడిపోతారు ప్రవాస సోదరులు. అంత కమ్మగా ఉంటాయి కాబట్టే శ్రీనివాసుడు ఏరికోరి వండించుకుంటున్నాడో, శ్రీనివాసుడికి నివేదించడంవల్లే ఆ కమ్మదనం వచ్చిందో తెలియదు కానీ...లడ్డూలంటే తిరుపతి లడ్డూలే! ఆ రుచి నాలుకని తాకగానే అప్రయత్నంగా కళ్లుమూసుకుంటాం. అది భక్తి కావచ్చు, తీపంటే అనురక్తీ కావచ్చు. ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే తిరుపతి లడ్డూ!

1940 ప్రాంతంలో కల్యాణోత్సవాలు మొదలైనప్పుడే...లడ్డూ ప్రసాదం పుట్టింది. తిరుపతి లడ్డూ తయారీకి కచ్చితమైన పద్ధతంటూ ఉంది. ఏయే దినుసుల్ని ఎంతెంత పరిమాణంలో వాడాలో తెలియజేసే ‘దిట్టం' ఉంది. కాలానికితగినట్టు దానికీ మార్పులు చేస్తున్నారు. తొలిరోజుల్లో కట్టెల పొయ్యిమీద ప్రసాదం తయారు చేసేవారు. మెల్లగా యంత్రాలు ప్రవేశించాయి. రుచిలోనూ నాణ్యతలోనూ ఎంతోకొంత తేడా వచ్చింది. అయినా, తిరుపతి లడ్డూలకు తిరుగులేదు. పేటెంటు పుణ్యమాని ఆ విశిష్టత రికార్డులకెక్కింది.

శ్రీవారి ఆభరణాల విలువ


శ్రీవారి ఆభరణాల విలువ రూ.52 కోట్లు
స్థిరాస్తుల విలువ రూ.32 వేల కోట్లు
పురాతన కాలం నాటి అంచనాలే ప్రామాణికం
తిరుమల, తిరుపతి దేవస్థానం సోమవారం హైకోర్టుకు సీల్డ్‌ కవర్‌లో సమర్పించిన శ్రీవారి ఆస్తుల వివరాలను మూడు నెలలుగా లెక్కించింది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు.. ప్రస్తుత మార్కెట్‌ విలువతో కాకుండా పురాతన రికార్డులనే తితిదే ప్రామాణికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. బంగారు ఆభరణాల విలువ 2008 ఏప్రిల్‌ నాటికి రూ.73 కోట్లుగా తేల్చగా, అందులో శ్రీవారి ఆభరణాల విలువ మాత్రం రూ.52 కోట్లుగా చూపించినట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన బంగారు ఆభరణాల విరాళాలను పరిగణలోకి తీసుకోలేదనీ, వీటి విలువను ఇంకా నిర్ధరించనందు వల్ల లెక్కల్లో చూపలేదని తెలుస్తోంది. స్థిరాస్తుల విలువ రూ.32 వేల కోట్లుగా లెక్కించగా, వీటిని కూడా ప్రస్తుత మార్కెట్‌ విలువతో లెక్కించే ప్రయత్నం చేయలేదనీ, రికార్డుల మేరకు ఆస్తులన్నీ సక్రమంగానే ఉన్నాయని పేర్కొన్నట్లు సమాచారం.

డిసెంబర్‌ 31న శ్రీవారి ఆలయం మూసివేత

చంద్రగ్రహణం కారణంగా వచ్చే డిసెంబర్‌లో శ్రీవారి స్వామి వారి ఆలయాన్ని మూసివేయనున్నారు. డిసెంబరు 31 రాత్రి ఏడు గంటలకు మూసివేసి జనవరి 1న ఉదయం తెరుస్తారు.
స్వామి వారికి మూడు కిలోల బంగారం విరాళం :
హైదరాబాద్‌కు చెందిన బీవీ రామారావు రెండు కిలోలు, రామిరెడ్డి శ్రీనివాసులురెడ్డి కిలో వంతున మొత్తం మూడు కిలోల బంగారం విరాళంగా అందించినట్లు దేవస్థానం ఛైర్మన్‌ డి.కె.ఆదికేశవులు నాయుడు వెల్లడించారు.

ప్రత్యక్ష దైవానికి మరో విడిది "ద్వారకా తిరుమల"


నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో... తిరుమల శిఖరాలు దిగివచ్చునో... మముగన్న మాయమ్మ అలివేలు మంగ.. పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ.. స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ..." అంటూ భక్త జనావళి స్వామివారి కరుణ తమమీద ఉండేలా చూడాలని అమ్మవారికి విన్నవించుకోవటం మామూలే..! అయితే ఈ అయ్యవారిని ఏడుకొండలూ ఎక్కి చూడలేకపోతేనేం.. స్వయంభువుగా ప్రత్యక్షమైన చిన్న తిరుపతి అయ్యవారి కరుణ తమమీద ఉంటే చాలదా అన్నట్లుగా పరమ పవిత్రమైన "ద్వారకా తిరుమల"ను పశ్చిమగోదావరి వాసులు దర్శించుకుంటుంటారు.

ఏలూరు పట్టణం నుంచి 42 కిలోమీటర్ల దూరంలోనున్న శేషాద్రి కొండపైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు "ద్వారకా తిరుమల"లో కొలువుదీరి ఉన్నారు. స్వయంభువుగా ప్రత్యక్షమైన స్వామివారిని చీమలపుట్ట నుంచి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ఆలయానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చనట్లు పూర్వీకుల కథనం. సుదర్శన క్షేత్రమైన ఈ ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా కూడా ప్రసిద్ధి చెంది.. అశేష భక్త జనావళి నీరాజనాలు అందుకుంటోంది.

"తిరుమల" స్వామివారికి మ్రొక్కిన మ్రొక్కును "చిన్న తిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే చిన్నతిరుపతిలో తీర్చుకునేందుకు మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని భక్తులు, స్థానికులు ప్రగాడంగా నమ్ముతుంటారు. ఇక్కడ స్వామివారిని కలియుగ వైకుంఠ వాసునిగా భావించి సేవిస్తారు. తిరుపతికి వెళ్ళలేని భక్తులు తమ ముడుపులను, తలనీలాలను, మొక్కుబడులను ఇక్కడ సమర్పిస్తే తిరుపతి స్వామివారికి చెందుతాయని భావిస్తారు.
అజమహారాజు స్వయంవరం..!
బ్రహ్మపురాణం ఆధారంగా, శ్రీరామచంద్రుడి తాతగారు అజమహారాజు తన వివాహం కోసం స్వామివారిని సేవించారు. ఆయన ఇందుమతి స్వయంవరానికి వెళుతూ.. మార్గమధ్యంలో ఉన్న ద్వారకా తిరుమలలో ఆగి స్వామివారిని దర్శించుకోకుండానే వెళ్లిపోయారట. ఇందుమతి అజమహారాజును పెళ్లి...

ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. అయితే ఆ మునికి ప్రత్యక్షమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు దక్షిణాభిముఖుడై ఉన్నాడట. అందుకనే.. ఈ ఆలయంలో మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉండటం విశేషంగా చెప్పవచ్చు. అలాగే ఒకే విమాన శిఖరం క్రింద రెండు విగ్రహాలు ఉండటం ఇక్కడి మరో విశేషం. ఒక విగ్రహం సంపూర్ణమైనదిగా, రెండవది స్వామివారి పై భాగం మాత్రమే కనిపించేటట్లుగా ఉండే అర్థవిగ్రహంగా ఉంటుంది.

స్థల పురాణం ప్రకారం చూస్తే... ద్వారకా తిరుమల క్షేత్రం శ్రీరాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదిగా భావిస్తున్నారు. ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాద సేవను కోరారట. దాంతో స్వామివారి పాదములను మాత్రమే పూజించే భాగ్యం అతడికి దక్కింది. అందుకే మనకు నేడు స్వామివారి పై భాగం మాత్రమే దర్శనమిస్తుంది.

అయితే.. విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారనీ... అప్పుడు భక్తులందరి విన్నపాలను స్వీకరించిన ఆయన స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధృవమూర్తికి వెనుకవైపు పీఠంపై.. వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్టించారని చెబుతుంటారు.

అందుకే.. స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే శ్రీ వేంకటేశ్వర ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ.. ఆ తరువాత ప్రతిష్టింపబడిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్థ కామపురుషార్ధములు సమకూరుతాయనీ భక్తులు నమ్ముతుంటారు.

పురాణ గాథల ప్రకారం ఆలయ చరిత్రను చూసినట్లయితే... బ్రహ్మపురాణం ఆధారంగా, శ్రీరామచంద్రుడి తాతగారు అజమహారాజు తన వివాహం కోసం స్వామివారిని సేవించారు. ఆయన ఇందుమతి స్వయంవరానికి వెళుతూ.. మార్గమధ్యంలో ఉన్న ద్వారకా తిరుమలలో ఆగి స్వామివారిని దర్శించుకోకుండానే వెళ్లిపోయారట. ఇందుమతి అజమహారాజును పెళ్లి చేసుకున్నప్పటికీ.. స్వయంవరానికి వచ్చిన ఇతర రాజులు ఆయనపై దాడి చేస్తారు.

తాను మార్గమధ్యలో స్వామివారిని దర్శించుకోకుండా వెళ్లినందుకే ఇలా జరిగిందని భావించిన అజమహారాజు శ్రీవేంకటేశ్వరుని క్షమించమని ప్రార్థిస్తాడు. అంతటితో ఆ అలజడి ఆగిపోయిందట. అత్యంత ప్రాచీన చరిత్రగల ఈ ఆలయం కృతయుగం నుంచి ఉందనేందుకు ఇదో చక్కని నిదర్శనంగా చెప్పవచ్చు.

ఇక.. ద్వారకా తిరుమలలోని స్వామి వారికి అభిషేకం చేయకపోవటం మరో విశేషంగా చెప్పవచ్చు. ఎందుకంటే.. స్వామివారిపై ఒక చిన్న నీటి బొట్టుపడినా.. అది స్వామివారి విగ్రహం క్రిందనుండే ఎర్రచీమలను కదుల్చుతుందని అభిషేకం చేయరు. గుడి సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ, ఆశ్వయుజ మాసాలలో రెండు కళ్యాణోత్సవాలు జరుపుతుంటారు. ఎందుకంటే.. స్వామివారు స్వయంభువుగా వైశాఖ మాసంలో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజ మాసంలో ప్రతిష్టించిన కారణంగా అలా చేస్తుంటారు.

తిరుమలేశునికి బంగారు గంగాళం



కలియుగ ప్రత్యక్షదైవం, తిరుమలేశునికి భక్తులు కానుకల వర్షం కురిపిస్తున్నారు. భక్తుల కొంగుబంగారంగా కోరిన వరాలను ప్రసాదించే ఆపదమొక్కులవాడికి సోమవారం రూ. 3కోట్ల విలువైన స్వర్ణ గంగాళం కానుకగా అందింది. ఢిల్లీకి చెందిన ఓ అజ్ఞాత భక్తులు దీన్ని వెంకన్నకు కానుకగా అందజేశారు.

అభిషేకం, తిరుమంజన సేవల్లో దీన్ని ఉపయోగించే దిశగా సుమారు 18 కిలోల బంగారంతో గంగళాన్ని తయారు చేసినట్లు టీటీడీ ఛైర్నన్ డీకే ఆదికేశవులనాయుడు అన్నారు.

ఈ గంగళాన్ని ఆ అజ్ఞాత భక్తుడు ఆదికేశవులనాయుడుకు అందజేస్తూ.. తాను గతంలో అభిషేక సేవలో పాల్గొన్నపుడు స్వామివారి సేవలో వెండి గంగాళాన్ని ఉపయోగించడం చూసి బంగారు గంగాళాన్ని కానుకగా అందించాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.

లడ్డూ లాంటి కబురు!

శ్రీవారి ప్రసాదానికి భౌగోళిక అనుకరణ హక్కు
దిట్టాన్ని అనుకరిస్తే చర్యలు తప్పవు
ఆ పేరూ వాడకూడదు


తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి భక్తులకు ప్రసాదంగా ఇచ్చే తిరుపతి లడ్డూకు భౌగోళిక అనుకరణ హక్కు (జియోగ్రాఫికల్‌ కాపీరైట్‌) లభించింది. వేరెవరు కూడా తిరుపతి లడ్డూ పేరును ఉపయోగించుకోకుండా, ఆ పేరుతో మిఠాయిని మార్కెట్‌ చేయకుండా జీఐ నిషేధిస్తుంది. ఓ ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ.. భక్తులకు అందించే ప్రసాదాన్ని భౌగోళిక సూచిక నమోదు కేంద్రం (జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ రిజిస్ట్రీ-జీఐఆర్‌)లో నమోదు చేసుకోవడం ఇదే మొదటిసారి. శ్రీవారి లడ్డూకు ఉన్న ప్రత్యేకత ఎనలేనిది. తిరుమల వెళ్లిన భక్తులను లడ్డూలు తెచ్చారా అని ప్రతి ఒక్కరూ ఆత్రుతగా అడిగి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అంతటి రుచి, ప్రాముఖ్యం ఉన్న దృష్ట్యా చాలాకాలంగా దీనిపై హక్కులు తీసుకోవాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. చెన్నైలోని భౌగోళిక సూచిక నమోదు కేంద్రం (జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ రిజస్ట్రీ-జీఐ)లో రెండేళ్ల క్రితం ఈ హక్కు కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తరఫున అప్పటి ఈవో రమణాచారి దరఖాస్తు చేశారు.మంగళవారం ఢిల్లీలోని ప్రధాన కేంద్రం నుంచి జాబితాలో చేర్చినట్లు సమాచారం అందింది. ‘‘తిరుపతి లడ్డూను గుర్తిస్తూ జీఐ ధ్రువీకరణ పత్రాన్ని తితిదేకు మంజూరు చేస్తున్నాం. ఇప్పటి నుంచి ఈ లడ్డూకు చట్టం రక్షణ ఇస్తుంది. దీన్నెవరూ అనుకరించలేరు'' అని ట్రేడ్‌మార్క్స్‌, జీఐ సహాయ రిజిస్ట్రార్‌ వర్మ వెల్లడించారు. పేటెంట్లు, డిజైన్లు, ట్రేడ్‌మార్కుల కంట్రోలర్‌-జనరల్‌ పి.హెచ్‌.కురియన్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ విశేషంపై తితిదే పాలకమండలి అధ్యక్షుడు ఆదికేశవులు, ఈవో కృష్ణారావు ఆనందం వ్యక్తం చేశారు.
ఇకపై తితిదే అనుసరించే ‘దిట్టం' ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ ఆధ్యాత్మిక, ఇతర సంస్థలు, వ్యక్తులు లడ్డూలను తయారు చేయరాదు. ఈ నమూనాను కూడా ఇతరులు అనుకరించే వీలు లేదు. 51 వేల లడ్డూలను ‘దిట్టం'గా పరిగణిస్తారు. ‘దిట్టం' కింద శనగపిండి-2 వేల కిలోలు, చక్కెర-4 వేల కిలోలు, నెయ్యి-1850 కిలోలు, గోడంబి-350 కిలోలు, ద్రాక్ష-87.5 కిలోలు, యాలకులు-50 కిలోలు, కలకండ-50 కిలోలు లడ్డూ తయారీకి వినియోగిస్తారు. లడ్డు తయారీ, నమూనా, దిట్టం, ఆకారాలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై చట్టపరమైన చర్యలు తప్పవు.

జీఐ ప్రకారం.. ఒక ఉత్పత్తిని విక్రయించుకునే హక్కు సంబంధిత భౌగోళిక ప్రాంతంతో ముడిపడి ఉంటుంది. ఆ హక్కు లభించిన ఉత్పత్తులు అదే ప్రాంతంలో తయారు కావాలి. ఒక ప్రాంతంలో దీర్ఘకాలికంగా విశిష్టత సాధించిన బ్రాండ్‌నేమ్‌ను మరెవరూ సొమ్ము చేసుకోకుండా ఈ హక్కు సంరక్షిస్తుంది. హక్కును ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలకు అవకాశం కల్పిస్తుంది. భౌగోళిక అనుకరణ హక్కు.. మేధో సంపత్తి హక్కుల్లో భాగం.

ఎంకన్న సొమ్ము.. ఎటెళ్లుతోంది?


98 ధార్మిక సంస్థలకు నిధులు
100 కోట్ల నష్టాల్లో ఎస్వీ ఛానెల్‌
దేనిపైనా నియంత్రణ లేదు
7 ఫౌండేషన్లుగా చక్కదిద్దాలి

ఓ ప్రవహించే నదిలోంచి ఒక్కొక్కరుగా బకెట్లతో నీళ్లు ముంచుకొని వెళుతుంటే... ఎవరెన్ని బకెట్ల నీళ్లు తీసుకెళ్లారనేది ఎలా తెలుస్తుంది? సామర్థ్యం ఉన్న వ్యక్తి నాలుగు బకెట్లు ఎక్కువ తీసుకెళ్లినా నదీ ప్రవాహంలో నీటి లెక్క తెలీదు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లో పరిస్థితి కూడా ఇదే
తితిదేలో ఆదాయ వ్యయాలు అంతు చిక్కవు. ఎంకన్నస్వామికి ఎంత ఆదాయం వస్తుందో లెక్క తేలని పరిస్థితి కాబట్టి ఖర్చుల్ని కూడా అదే రీతిలో చేయాలన్నట్లుంది ప్రస్తుత తితిదేలో పాలనా వ్యవహారం. గత 50 ఏళ్లలో ధార్మిక సంస్థల పేరిట తితిదే అనేక పథకాల్ని చేపట్టింది. ఇప్పటి వరకూ సుమారు 98 అకౌంటింగ్‌ యూనిట్లు తితిదే నుంచి నిధులు పొందుతున్నాయి. ఇన్ని యూనిట్ల వ్యయ పద్దుల్ని సరిచూసేందుకు పటిష్టమైన ఆడిటింగ్‌ విభాగం తితిదేలో లేదు. అన్ని పథకాల అమలు తీరును, నిధులను మంజూరు చేయాల్సిన బాధ్యత కార్యనిర్వహణాధికారి(ఈఓ)పై ఉంది. ఉదాహరణకు... ఆరోగ్యానికి సంబంధించి 16 ప్రాజెక్టులు తితిదే పరిధిలో పనిచేస్తున్నాయి. ఇందులో శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(స్విమ్స్‌) వంటి పెద్ద సంస్థతోపాటు ఆయుర్వేద ఆస్పత్రులు, డిస్పెన్షరీలూ ఉన్నాయి. విద్యాభివృద్ధి కోసం 14 సంస్థలు, ధర్మ ప్రచార పరిషత్తు కోసం 11 సంస్థలు... ఇలా అనేక రకాల ప్రాజెక్టుల కింద మొత్తం 98 యూనిట్లు నిధులు ఖర్చుచేస్తున్నాయి. ఒక సంస్థ పెద్ద ఆసుపత్రికని నిధులు కోరితే, మరొక అధికారి గోసంరక్షణకని తీసుకుంటారు. ఏ పథకం కోసం ఎవరికి ఎప్పుడు నిధులు కావాల్సి వచ్చినా.. నేరుగా పాలక మండలిలో తీర్మానం చేయించుకుంటారు. ఆ మేరకు కార్యనిర్వహణాధికారి నిధుల్ని మంజూరుచేస్తారు. ప్రభుత్వం మారగానే, పాలక మండలి మారుతుంది. కొత్త పాలక మండలి రాగానే మరికొన్ని కొత్త పథకాలను ప్రారంభించడం, వాటికి నిధులు మంజూరు చేయడం.. ఈ క్రమంలోనే అకౌంట్‌ యూనిట్ల సంఖ్య వందకు దగ్గరైంది. దేనిపైనా ఆడిట్‌ లేదు. ఏ పథకంపై ఎంత ఖర్చు పెడుతున్నామనే లెక్క తెలియదు. ఉదాహరణకు స్విమ్స్‌కు ఈ ఏడాది రూ.20 కోట్లు మంజూరు చేశారనుకుంటే... ఆ రూ.20 కోట్లు దేని కోసం ఖర్చుపెట్టారు? దానివల్ల ఫలితం ఎంత? ఎంతమంది ప్రయోజనం పొందారు? వచ్చే ఏడాది ఇంతకంటే ఎక్కువ మంజూరుచేయాలా? అసలు అవసరం లేదా? అనే వివరాలేవీ తితిదే వద్ద లేవు. ఇది ఒక్క సంస్థకు సంబంధించింది కాదు... 98 యూనిట్ల పరిస్థితి ఇంతే! ఇలా కొన్నేళ్లుగా వేల కోట రూపాయలు తితిదే నుంచి మంజూరవుతున్నాయి. ఉదాహరణకు శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్‌ ఒకటి. ఇది ఇప్పటికే దాదాపు రూ.100కోట్లు నష్టాల్ని మూటగట్టుకుంది. ఏటా దీనిపై రూ.30 కోట్లు ఖర్చుపెడుతుంటే... దీని ఆదాయం రూ.3 కోట్లను మించడం లేదు. వీటినన్నింటినీ ఒక్క ఎగ్జిక్యూటివ్‌ అధికారే సమర్థంగా నిర్వహించడం అనేది అసాధ్యమని మాజీ ఐపీఎస్‌ అధికారి సి.ఆంజనేయరెడ్డి తితిదేపై గత ఏడాది ఇచ్చిన నివేదికలో స్పష్టంచేశారు. ఈ భక్తి ఛానెల్‌కు వచ్చే మూడేళ్లలో పైసా ఇవ్వకూడదని, దాని సొంత ఆదాయాన్ని పెంచుకుని నడిపించుకోవాలని, మూడేళ్లలో అలా నిలదొక్కుకోలేకపోతే ఆ ఛానెల్‌ను మూసేయాలని నివేదికలో ఆంజనేయరెడ్డి స్పష్టంచేశారు. ఇలా వివిధ పథకాల కింద 98 అకౌంట్‌ యూనిట్లుగా ఉన్నవాటిని 7 ఫౌండేషన్లుగా విభజించాలని ఆయన సూచించారు. అవి...

* విద్య
* ఆరోగ్యం
* ధర్మ ప్రచార పరిషత్‌
* అన్నదానం ట్రస్ట్‌
* చారిత్రక, సాంస్కృతికం
* సాంఘిక సంక్షేమం
* గోసంరక్షణ

ఒక్కో గ్రూపు కిందికి సంబంధిత యూనిట్లను తీసుకురావాలి. ఇలా ఏడు ఫౌండేషన్లను స్థాపించి, వాటి ద్వారా సంబంధిత విభాగాలకు నిధులు ఖర్చు చేయాలి. ఈ ఏడు ఫౌండేషన్లు కూడా వేటికవే స్వతంత్ర సంస్థలుగా రూపొందించాలి. వాటికి మూల ధనమిచ్చి ఆర్థికంగా సహకరించాలే గానీ తితిదే ఆధ్వర్యంలో నడిపించకూడదు. రామకృష్ణ మిషన్‌, భారతీయ విద్యా భవన్‌... వంటి లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలి. ప్రతి ఫౌండేషన్‌ను ఒక ట్రస్ట్‌గా ఏర్పాటుచేయాలి. ముగ్గురు సభ్యులుగా ఉండే ఆ ట్రస్టీలో తితిదే పాలకమండలి సభ్యుడు ఒకరు, సంబంధిత విభాగంలో నిపుణులు ఇద్దరు సభ్యులుగా ఉండాలి. తితిదే ఇచ్చిన నిధులను వారే పర్యవేక్షిస్తారు. ఎంత ఖర్చు పెడుతున్నారు? ఎవరెవరికి ఖర్చుపెడుతున్నారు? ఏవిధంగా ఖర్చుపెడుతున్నారు? అనే లెక్కల్ని సరిచూస్తారు. వార్షిక నివేదికలు అందజేస్తారు. దీనివల్ల తితిదేకు నియంత్రణ వస్తుంది. మొత్తంగా ఎవరెవరికి ఎంత ఖర్చుపెడుతున్నామో తెలుస్తుంది.

గోవిందుడు.. మళ్లీ అప్పులపాలు!


ఈ అపరాధం దేవస్థానందే
అన్నదానం ట్రస్టు నిధుల మళ్లింపు
మూలధనమూ కదిలించారు
ఇక నిర్వహణ భారమే!


తిరుమల, న్యూస్‌టుడే: అలనాడు శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారి పరిణయం సందర్భంగా కుబేరుడి వద్ద తీసుకున్న అప్పు నేటికీ తీరలేదు. భక్తులు చెల్లించే కానుకల ద్వారా వడ్డీ మాత్రమే చెల్లిస్తున్నాడు. అందుకే గోవిందుడుకి వడ్డీకాసులవాడనే పేరొచ్చింది. ఆ అప్పు సంగతి అలా ఉంటే.. తితిదే పాలక పెద్దలు స్వామి నెత్తిన మరో అప్పుల భారం మోపారు. భక్తులు ఏనాడూ కోరకపోయినా శ్రీ వారి నిత్య అన్నదానం పథకం కింద ముద్దపప్పు, నెయ్యి వడ్డింపును అదనంగా చేర్చారు. పాలకమండలి మాజీ సభ్యుడొకరు కందిపప్పు, నెయ్యి సరఫరా చేస్తున్నారు. ఆయన కోసమే ఈ పథకాన్ని చేర్చారనే విమర్శలు వచ్చాయి. దీంతో నిత్య అన్నదానం ట్రస్టుకు నెలా వారీ వ్యయం రూ.కోటి నుంచి రూ.1.50 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో తితిదే విద్యాలయాల వసతిగృహాల్లో క్యాంటిన్లను అన్నదానం ట్రస్టు కింద నిర్వహించాలనే తీర్మానం పాలకమండలి చేసింది. దేవస్థానం ఉన్నతాధికారులూ మారు మాట్లాడకుండా అంగీకరించారు. ఈ తీర్మానాన్ని అన్నదానం ట్రస్టు తీవ్రంగా వ్యతిరేకించింది. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదానం చేయడానికే దాతలు విరాళాలు ఇచ్చారు తప్ప క్యాంటిన్లకు కాదని తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంపై వారు న్యాయస్థానానికి వెళితే సమస్య తీవ్రమవుతుందని ట్రస్టు హెచ్చరించింది. విరాళాలు అందించే దాతలకు ఆదాయపు పన్ను రాయితీ వర్తింపు రద్దవుతుందని కూడా సూచించింది. అయినా తితిదే పెడచెవిన పెట్టి వసతి గృహాలకు అన్నదానం పథకం విస్తరించింది. విధిలేని పరిస్థితిలో అన్నదానం ట్రస్టు వసతి గృహాల్లోనూ క్యాంటిన్ల నిర్వహణ భారం ఎత్తుకుంది. దీంతో ట్రస్టు రుణ భారం రూ.17,47,67,057 మేరకు పెరిగింది. భక్తులు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన మూలధనం నుంచి నిబంధనలు అతిక్రమించి రూ.రెండు కోట్లు (31-3-2008 నాటికి) తీసి ఖర్చు పెట్టారు. భక్తులిచ్చే డిపాజిట్లపై తితిదేకు ఎలాంటి అధికారంలేదు. ఆ డిపాజిట్లను రద్దు చేయడం, ఆ నిధుల్ని నేరుగా వినియోగించుకోవడం చట్టరీత్యా నేరం. పెరిగిపోయిన రుణ భారంపై ఆందోళన చెందిన నిత్య అన్నదానం ట్రస్టు తితిదేకు హెచ్చరిక చేస్తూ ఇటీవల నివేదిక అందచేసింది. నివేదికలోని అంశాలు...

* అన్నదానం ట్రస్టు కింద డిపాజిట్లు రూ.168,14,54,776. ఈ మొత్తంపై ఏడాదికి వచ్చే వడ్డీ మొత్తం రూ.27,20,40,447గా అంచనా.
* తిరుమలలో నిత్య అన్నదానంతో పాటు వైకుంఠం-2, పీఏసీ-2, తిరుచానూరులో అన్నదానంకు ఏడాదికి రూ.22,25,37,196 ఖర్చు. తితిదే విద్యాసంస్థల వసతిగృహాల్లో క్యాంటిన్ల నిర్వహణకు రూ.11,49,46,141 ఖర్చు.
* ఏడాది ఖర్చు రూ.33,74,83,337 కాగా వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం 27,20,40,447 మాత్రమే. ఆదాయానికి, ఖర్చు మధ్య ఉన్న వ్యత్యాసం రూ.ఐదు కోట్లు ఏవిధంగా భరించాలని నివేదికలో తితిదేను ప్రశ్నించింది.
* గత ఏడాదిలో అప్పుల భారం రూ.17,47,67,057గా తేల్చింది. ఈ భారం ఏ విధంగా పూడ్చుకోవాలో అర్థం కాక అన్నదానం ట్రస్టు నిర్వాహకులు తలపట్టుకున్నారు. ఈ పరిస్థితిపై పలుమార్లు నివేదిక ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదు.

శ్రీవారి నగల వివరాలివ్వండి


తితిదేకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్‌, తిరుపతి, న్యూస్‌టుడే: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఆధ్వర్యంలో ఉన్న అన్ని దేవాలయాల్లోని నగల వివరాలను అందజేయాలని సోమవారం హైకోర్టు తితిదేని ఆదేశించింది. గతంలో ఉన్న జాబితాకు ప్రస్తుతం సేకరించినదానికి తేడాలేమైనా ఉంటే కోర్టు దృష్టికి తీసుకురావాలంది. డాలర్లు అదృశ్యమైన నేపథ్యంలో స్వామివారి ఆభరణాలకు రక్షణ కల్పించాలంటూ నెల్లూరు కాంగ్రెస్‌ నేత బెజవాడ గోవిందరెడ్డి గత ఏడాది ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ గోడా రఘురాం, జస్టిస్‌ రమేష్‌రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. డాలర్ల అదృశ్యం తదితర అంశాలపై విచారణ చేపట్టడానికి ప్రభుత్వం ఇప్పటికే ఏకసభ్య కమిషన్‌ను నియమించిందని, ఈ నేపథ్యంలో పిటిషన్‌పై విచారణను ముగించాలని తితిదే తరఫు న్యాయవాది కోరారు. ఈ వాదనను పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.రామచంద్రరావు విభేదించారు. ఏడాదిగా పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా కమిషన్‌ ఏర్పాటు చేశామంటూ విచారణను ముగించడం సరికాదన్నారు. విజయనగర కాలం నుంచి స్వామివారికి నగలు ఉన్నాయని, ప్రస్తుతం వాటికి భద్రత కొరవడిందని తెలిపారు. స్వామివారి డాలర్లు అదృశ్యమయ్యాయని, మరి నగల పరిస్థితి ఏమిటోనని అనుమానాలు వ్యక్తంచేశారు. ఖజానాకు సంబంధించి తాళాలు రెండూ ఒకరి వద్దే ఉంటున్నాయని చెప్పారు. వాదనలను విన్న హైకోర్టు స్వామివారి నగల వివరాలను తెలియజేయాలని ఆదేశించింది. ప్రతివాదులైన తితిదే, రాష్ట్ర ప్రభుత్వాలను కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను మూడువారాలకు వాయిదా వేసింది.

బంగారు కొండ మరి
వజ్రకిరీటధారి వెంకన్న ఆలయ బొక్కసంలో మూలుగుతున్న ఆభరణాల విలువెంతో ఇప్పటికీ వెలకట్టలేకపోతున్నారు. శ్రీవారికి 12వశతాబ్ధి నుంచే కానుకల వెల్లువ ప్రారంభమైంది. 1509-1530 మధ్య కాలంలో దేవదేవుణ్ని శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు సందర్శించి స్వామివారి భాండాగారాన్ని స్వర్ణమయం చేశాడు. 10.02.1513లో కెంపులు, పచ్చలు, వజ్రాలు, నీలాలు, మాణిక్యాలు, వైఢూర్యాలు, గోమేధికాలతో పొదిగిన వజ్రకిరీటాన్ని సమర్పించారు. 02.05.1513న నవరత్నఖచిత ఉడుధార, స్వర్ణఖడ్గం, భుజకీర్తులు, 30 తీగల పతకం ఆయన అందించారు. తంజావూరు రాజు పాండ్యన్‌ కిరీటం సమర్పించారు. మైసూరు మహారాజు సహా పలువురు విలువైన కానుకలు అందించారు. ఇందులో 108 బంగారు పుష్పాలు, 32 కిలోల సహస్రనామహారం, నాలుగు కిలోల చతురు్భజ లక్ష్మీహారం, 7 కిలోల రత్నాల మకరకంఠి, 13.6 కిలోల నవరత్న కిరీటం ఉన్నాయి. దీంతోపాటు 500 గ్రాముల అరుదైన గరుడమేరు పచ్చ ఆభరణం ఉంది. మొత్తం మీద మూలవిరాట్‌కు ఎనిమిది కిరీటాలు, ఉత్సవ విగ్రహాలకు ఏడు కిరీటాలున్నాయి. దీంతోపాటు రతన్‌టాటా, అంబానీలు, విజయ్‌మాల్యా, గోయెంకా తదితర ప్రముఖులతో పాటు అజ్ఞాత భక్తులు సమర్పించే కానుకలకు అంతేలేదు. వెంకన్నకు 1940లో వజ్రకిరీటం, 1954లో వజ్రాలహారం, 1972లో వజ్రాల శంఖు, చక్రాలు, కర్ణపత్రాలు, 1974లో కఠిహస్తం, 1986లో రూ.5 కోట్ల విలువైన వజ్రాల కిరీటాన్ని తితిదే తయారు చేయించింది.

అమూల్య విలువకు గోప్యత
శ్రీవారి ఆభరణాలకు తితిదే 19 రికార్డులు నిర్వహిస్తున్నా, వీటి ఆధారంగా మదింపు చేసేందుకు నిపుణులు వెనకడుగు వేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా వీటి విషయం గోప్యంగా ఉంచుతూ వస్తున్నారు. అయితే గత ఏడాది నిర్వహించిన అమృతోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆభరణాల విలువ రూ.32 వేల కోట్లు అంటూ వెల్లడైంది. కానీ, విశ్లేషకుల అంచనా ప్రకారం దేవదేవుని ఆభరణాల బరువు మొత్తం 11.5 టన్నులు. వీటి విలువ రూ.50 వేల కోట్లకు పైగా ఉన్నట్లు తేల్చుతున్నారు. ఇలా ఎవరికి వారు విలువ నిర్ధరించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ఇప్పటివరకు ఏనాడూ తితిదే వీటి విలువ గణించకపోవడంపై వివాదం నెలకొంది. కోర్టు ఆదేశాల మేరకు తాము ఆభరణాల జాబితా నివేదికను గడువులోగా ఇస్తామని తితిదే ఛైర్మన్‌ ఆదికేశవులునాయుడు చెప్పారు.

తిరుమలలో 40 రొజులకు


తిరుమల, న్యూస్‌టుడే: వర్షాభావ పరిస్థితులతో తిరుమలలో జలవనరులు అడుగంటిపోతున్నాయి. ప్రస్తుతం అకాశగంగ పూర్తిగా ఎండిపోయింది. గోగర్భం డ్యాం కూడా వట్టిపోయే దశకు చేరుకుంది. పాపవినాశనం డ్యాంలో మాత్రం కొంత నీరు ఉంది. తిరుమలలో ప్రస్తుతం రోజుకు 30 నుంచి 35 లక్షల గ్యాలన్ల నీరు వినియోగం అవుతోంది. పాపవినాశనం డ్యాంలో 2,260 లక్షలు, గోగర్భంలో 335 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులో ఉంది. ఈ మొత్తం నీటిలో 908 లక్షల గ్యాలన్లు అవిరవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇక మిగిలే నీరు 1,687 లక్షల గ్యాలన్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పాంచజన్యం, సన్నిధానం అతిధి భవనాలు భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి తితిదే చర్యలు చేపట్టింది. దీంతో రోజు వారీగా నీటి వినియోగం 40 లక్షల గ్యాలన్లకు చేరుకుంటుందని అంచనా. ఫలితంగా అందుబాటులో ఉన్న 1,687 లక్షల గ్యాలన్ల నీరు 40 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోనుంది. వచ్చే నెలలో శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో నీటి ఇబ్బందులు తీవ్రంగానే ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి.

చెన్నై శ్రీవారికి 108 స్వర్ణ కమలాలు


చెన్నై, న్యూస్‌టుడే: చెన్నైలోని తిరుమల-తిరుపతి దేవస్థానం సమాచార కేంద్రంలోని శ్రీవారికి ఓ భక్తుడు 108 స్వర్ణ కమలాలు బహుకరించారు. గ్రానైట్‌ వ్యాపారి జేసీ నాయుడు వీటిని రూ.20 లక్షల వ్యయంతో చేయించారు. ఒక్కో బంగారు పుష్పం తయారీకి పది గ్రాముల బంగారం ఉపయోగించారు. మొత్తం కేజీకిపైగా బంగారు వాడారు. వీటిని స్వామివారి పాదాల ముందు అలకరించడానికి వెండి పీఠాన్ని కూడా తయారు చేసి బహుకరించారు. ‘జీఆర్‌టీ జ్యూవెలరీస్‌' ఈ పుష్పాలను తయారు చేసింది. రెండు రోజుల క్రితం ఈ పుష్పాలు తితిదే సమాచారం కేంద్రానికి చేరాయి. వీటిని వారం రోజుల్లో శుభముహూర్తాన స్వామివారికి సమర్పిస్తారు.
వజ్రకటి హస్తాలు: సమాచార కేంద్రంలోని శ్రీవారికి త్వరలోనే ఓ భక్తుడు వజ్రకచిత కటిహస్తాలను బహుకరించనున్నారు. కేంద్ర మంత్రి జగద్రక్షకన్‌ కుటుంబీకులు సుమారు రూ.50 లక్షల వ్యయంతో ఈ కటిహస్తాలను రూపొందించి బహుకరించడానికి అంగీకరించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. సింగపూరుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త ఇక్కడ స్వామి వారికి రూ.22 లక్షల వ్యయంతో స్వర్ణకాసుల హారాన్ని బహుకరించనున్నారు.

SV Bhakti TV channel


Sri Venkateswara Bhakti channel was launched by Sri Sri Ranga Ramanjua Pedda Jeeyar Swamy of Tirumala at Srivari temple on Monday on the occasion of Ugadi.
The exclusive TV channel of TTD, will telecast live several programmes in the temple along with different featured programmes on devotion and culture. TTD chairman B Karunakar Reddy, executive officer KVRamanachary, board member Chadalavada Sudha, Bhakti Channel CEO'KS. Sarma, CE VSB Koteswara Rao, temple Dy EO Siddaiah and others were present.
According to TTD officials, the response to the channel is overwhelming and the signals are being received with clarity all over the State. There are several reports that people in different places are asking their cable operators to ensure that they get SV Bhakti channel.

Tirumala temple closed on Jul 21, 2009


TIRUPATI: The hill shrine of Lord Venkateswara in Tirumala will remain closed from 9 pm on July 21 to 8 am on July 22 in view of the solar eclipse
on July 22.

Following the eclipse TTD has cancelled all morning sevas, including Ekantham. The general darshan for the pilgrims will commence at 11 am after performing the `suddhi' (cleansing) ritual. On July 21, the `Ekantha' seva to the Lord will be conducted at 10.30 pm instead of 12.30 am.

Goddess Padmavathi temple at Tiruchanoor, Appalayagunta temple, Narayanavanam temple, Nagalapuram temple, Srinivasa Mangapuram temple and other Vaishnavaite temples in and around Tirupati and Kanipakam Varasidhi Vinayaka temple will also remain closed during the eclipse.

The Vayulingeshwara temple at Srikalahasti will however remain open as there is no `graha dosha' for Lord Shiva. But the devasthanam authorities will perform a special `graha puja' on the eclipse day.

భక్తులకు కాఫీ, టీ


స్వామి దర్శనార్థం తిరుమల వచ్చే భక్తులకు కాఫీ, టీ ఇవ్వాలని TTD నిర్నయించింది. ఈ మేరకు TTD చర్యలు చేపట్టారు. సర్వ దర్శనం చేసుకున్న సమయం లో భక్తుల నుంచి వచ్చిన అభి ప్రాయం మేరకు పై నిర్ణయం తీసుకున్నారు. వైకుంఠం - 2 ద్వారా సర్వదర్సనానికి వెళ్ళే భక్తులు కంపార్ట్మెంట్లలో గంటల తరబడి నినీక్షించే భక్తులు కాఫీ, టీ తాగడం ద్వారా ఉప శమనం లభిస్తుంది అని గుర్తించారు. ఈ మేరకు అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు.